Chiranjeevi: చిరంజీవి కాళ్ళ మీద పడ్డ యంగ్ హీరో... కొండంత ధైర్యం అంటూ ఎమోషనల్
Ankith Koyya Meets Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని యంగ్ హీరో అంకిత్ కొయ్య కలిశారు. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. 'కొండంత ధైర్యం' అంటూ ఎమోషనల్ అయ్యారు. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

యంగ్ హీరో అంకిత్ కొయ్య (Ankith Koyya) గుర్తున్నాడా? ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటించిన 'ఆయ్' సినిమాలో ఫ్రెండ్ రోల్ చేశాడు. రావు రమేష్, ఇంద్రజ ప్రధాన పాత్రలో నటించిన 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం' సినిమాలో వాళ్ళ కుమారుడిగా కనిపించాడు. ఈ యంగ్ హీరో తాజాగా మెగాస్టార్ చిరంజీవిని కలిశాడు.
చిరు కాళ్ళ మీద పడ్డ అంకిత్
''నా అనుభూతిని మాటల్లో వర్ణించలేను. ఆయన ఆశీర్వాదం తీసుకోవడం నా అదృష్టం. మెగా ఆశీస్సులు నన్ను బోలెడంత దూరం తీసుకు వెళతాయని నమ్ముతున్నాను'' అని సోషల్ మీడియాలో అంకిత్ కొయ్య పేర్కొన్నారు. చిరు కాళ్ళ మీద పడిన ఫోటోలను షేర్ చేశారు. ''కొండంత ధైర్యం. జై చిరంజీవ'' అంటూ ఎమోషనల్ అయ్యారు.
I can’t put this experience into words. Fortunate to get his blessings and I believe they will take me a long way.
— Ankith Koyya (@AnkithKoyyaLive) September 3, 2025
Grateful. ♥️
“కొండంత ధైర్యం”
Jai Chiranjeeva. ♥️🫂 pic.twitter.com/q6xw4j6mGM
చిరంజీవి సోదరుడు నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సంస్థను స్థాపించి కొన్ని వెబ్ సిరీస్‌లు ప్రొడ్యూస్ చేశారు. నిహారిక నిర్మాతగా మారిన మొదటి సినిమా 'కమిటీ కుర్రోళ్ళు'. ఆ సినిమాకు తెర వెనుక అంకిత్ కొయ్య పని చేశారు. నిహారిక నిర్మాణ సంస్థలు క్రియేటివ్ పరమైన పనులు కొన్నిటిని అంకిత్ చూస్తున్నట్లు తెలిసింది. అలాగే హీరోగా వరుస సినిమాలు చేస్తున్నారు.
Also Read
: నాగార్జున పెద్ద కోడలు అంటే నమ్మగలమా? నాగచైతన్య భార్య ఎంత సింపుల్‌గా వంట చేసిందో ఫోటోల్లో చూడండి
Beauty Telugu Movie Release Date: అంకిత్ కొయ్య కథానాయకుడిగా మారుతి సమర్పణలో రూపొందిన సినిమా 'బ్యూటీ'. సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది. ఆ సినిమా కాకుండా సింపుల్ సంతోష్ అని మరో సినిమా సెట్స్ మీద ఉంది. హీరోగా రెండుమూడు సినిమాలు చర్చల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవిని కలిసి ఆశీస్సులు తీసుకున్నాడు అంకిత్. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.





















