Allu Arjun: ఆ పాటలో వింటేజ్ బన్నీను చూస్తారు... ఇకపై అభిమానులను వెయిట్ చేయించను - అల్లు అర్జున్ ప్రామిస్
Pushpa 2: పుష్ప 2 విడుదల సందర్భంగా అభిమానులకు అల్లు అర్జున్ ఓ ప్రామిస్ చేశారు. అభిమానులను వెయిట్ చేయించనని చెప్పారు. ఎక్కువ సినిమాలు చేస్తానని అన్నారు.

Allu Arjun speech at Pushpa 2 Kerala Event: మూడేళ్లు... ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేసి మూడేళ్లు అవుతోంది. ఉత్తమ నటుడిగా ఆయనకు జాతీయ అవార్డు వచ్చిన 'పుష్ప: ది రైజ్' డిసెంబర్ 17, 2021లో విడుదల కాగా... ఆ సినిమా సీక్వెల్ 'పుష్ప 2: ది రూల్' డిసెంబర్ 5, 2024లో విడుదలకు సిద్ధమయ్యింది. తమ అభిమాన హీరో సినిమా మూడేళ్లకు ఒక్కటి వస్తే ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. అందుకని వాళ్లకు బన్నీ ఓ ప్రామిస్ చేశారు.
వెయిటింగ్ వద్దు... ఇకపై ఎక్కువ సినిమాలు చేస్తా!
'పుష్ప 2' ప్రచార కార్యక్రమాల కోసం అల్లు అర్జున్ కేరళ వెళ్లారు. తనను మల్లు అర్జున్ కింద అభిమానిస్తున్న అక్కడ ప్రజలకు, తనను దత్తత తీసుకున్న మలయాళీలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. అంతే కాదు... అక్కడ నుంచి అభిమానులకు ఒక ప్రామిస్ చేశారు. తన సినిమా వచ్చి మూడేళ్లు అయ్యిందని, ఇకపై అభిమానులను అంత వెయిట్ చేయించనని, ఎక్కువ సినిమాలు చేస్తానని చెప్పారు.
నా ఫ్యాన్స్ ను నెక్స్ట్ టైం ఇంత వెయిట్ చేయించను.. number of movies చేస్తాను - @alluarjun pic.twitter.com/wtbvuLbagP
— Rajesh Manne (@rajeshmanne1) November 27, 2024
ఆ ఒక్క పాటలో వింటేజ్ బన్నీని చూపిస్తా!
కేరళ వెళ్లిన సందర్భంగా అభిమానులకు తన మలయాళ ప్రేక్షకులకు అల్లు అర్జున్ ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. 'పుష్ప 2'లో కొత్త పాటను విడుదల చేశారు. 'ఫీలింగ్స్' అంటూ సాగే ఆ పాటలో మలయాళ లిరిక్స్ ఉన్నాయి. కేవలం మలయాళం వెర్షన్ కోసం మాత్రమే కాదు... ఈ సినిమా ఎన్ని భాషలలో విడుదల అవుతుందో... అన్ని భాషల్లోనూ సేమ్ మలయాళ లిరిక్స్ ఉంటాయని అల్లు అర్జున్ తెలిపారు.
#Pushpa2 "Peelings".. Song Coming Soon ! https://t.co/5rBhdjyjdi pic.twitter.com/C6wIjIGruL
— Rajesh Manne (@rajeshmanne1) November 27, 2024
#AlluArjun about his dance in #Pushpa2TheRule ! pic.twitter.com/nKVqE5cE42
— Rajesh Manne (@rajeshmanne1) November 27, 2024
పుష్ప క్యారెక్టర్ వల్ల మొదటి పార్ట్ లోని పాటల్లో పెద్దగా డాన్స్ చేసే అవకాశం తనకు రాలేదని అల్లు అర్జున్ తెలిపారు. చాలామంది అభిమానులు తన డాన్స్ మిస్ అయినట్లు చెప్పుకొచ్చారని, వింటేజ్ బన్నీ ఎక్కడ? అని అడిగారని, ఈ సినిమాలో పీలింగ్స్ పాటలో డాన్స్ బాగా చేశానని తెలిపారు. ఆ పాటలో రష్మిక డాన్స్ చూసిన తర్వాత ఆమెను అందరూ క్రష్మిక అంటారని చెప్పుకొచ్చారు.
Also Read: వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
కేరళలో అల్లు అర్జున్ ఫాలోయింగ్ చూసి తమకు మైండ్ బ్లాక్ అయినట్టు నిర్మాత నవీన్ ఎర్నేని తెలిపారు. కనివిని ఎరుగని రీతిలో కేరళవ్యాప్తంగా భారీ ఎత్తున చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఆయన వివరించారు. ఫహాద్ ఫాజిల్ నటన కూడా బాగుంటుందని ఆయన నట విశ్వరూపం చూస్తారని బన్నీతో పాటు నిర్మాతలు తెలిపారు.
Also Read: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

