By: ABP Desam | Updated at : 24 Apr 2023 04:41 PM (IST)
Image Credit: Akhil/Instagram
Agent: టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన మూవీ ‘ఏజెంట్’. స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్ 28 న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పిటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు, రీసెంట్ గా విడుదల అయిన ట్రైలర్ సైతం ఆకట్టుకునేలా ఉండటంతో మూవీ పై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో ఫుల్ బీజీగా ఉంది మూవీ టీమ్. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా గ్రాండ్ గానే ప్లాన్ చేశారు. ప్రస్తుతం మూవీకు సంబంధించిన సెన్సార్ పూర్తయింది. ఈ మూవీకు U/A సర్టిఫికేట్ వచ్చింది. సినిమా రన్ టైమ్ కూడా 2:36 నిమిషాల నిడివితో థియేటర్లలో రిలీజ్ కానుంది. సినిమా రన్ టైమ్ పట్ల అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీగా అవుతున్నారు.
ఇటీవలే అఖిల్ ‘ఏజెంట్’ సినిమాకు సెన్సార్ పూర్తయింది. ఇప్పటికే అక్కినేని అభిమానులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అఖిల్ కు ఈసారైనా హిట్ రావాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెన్సార్ సభ్యులు ఈ మూవీ పట్ల పాజిటివ్ రివ్యూ ఇచ్చినట్టే తెలుస్తోంది. మూవీ సెన్సార్ సందర్భంగా మూవీ చూసిన సెన్సార్ టీమ్ పాజిటివ్ గానే స్పందించారట. సినిమా బాగా వచ్చిందని, మూవీలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయని అన్నారట. దీంతో అక్కినేని అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈసారి అఖిల్ కు బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని సంబరపడిపోతున్నారట. మరి ఈ మూవీ వెండి తెరపై ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
టాలీవుడ్ లో బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చి ఇప్పటికీ సరైన హిట్ అందుకోలేని హీరోలు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో అఖిల్ అక్కినేని కూడా ఒకరు. ఆయన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్ ఒక్కటి కూడా అందలేదు. మధ్యలో కొన్ని సినిమాలు పర్వాలేదనిపించినా అవి కమర్షియల్ గా హిట్ అందుకోలేకపోయాయి. అఖిల్ చివరిగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటించారు. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా అఖిల్ కు మాత్రం ఇమేజ్ తీసుకురాలేకపోయింది. ఇప్పటి వరకూ అఖిల్ కు ఒక్క మాస్ ఇమేజ్ ఉన్న సినిమా పడలేదు. అందుకే ఈ ‘ఏజెంట్’ సినిమాతో మాస్ ఇమేజ్ తో పాటు కమర్షియల్ హిట్ ను కూడా అందుకోవాలని చూస్తున్నారు అఖిల్. అందుకే మూవీ కోసం ఏకంగా నెలల పాటు కష్టపడి బాడీను మూవీ కు తగ్గట్టు తయారు చేసుకున్నారు. మూవీ ప్రమోషన్స్ లో కూడా రకరకాల స్టంట్ లు చేశారు కూడా. ప్రస్తుతం అఖిల్ ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నారని ఇవన్నీ చూస్తే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సెన్నార్ బోర్డ్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చిందనే అంశం అఖిల్ కు కలిసొచ్చిందనే చెప్పాలి. ఇక మూవీ రిలీజ్ అయ్యాక సినిమా ప్రేక్షకులను కూడా ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
'యూత్ ను ఎంకరేజ్ చేయాలే, ధమ్ ధమ్ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!
OTT Releases in June: ఈ వారం ఓటీటీ, థియేటర్‌లలో రిలీజయ్యే మూవీస్ ఇవే
SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!
Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!
PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!
4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం
Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా
లవ్ బూత్‌లో మెహ్రీన్ - హలో హనీ హార్ట్ మిస్సాయే అంటున్న ఫ్యాన్స్!