Chandini Chowdary: 'ఎవరి దగ్గరకు వెళ్ళనూ? మసి చేస్తారు' - చాందిని చౌదరి & ఫ్యామిలీని భయపెట్టిన ప్రొడ్యూసర్
హీరోయిన్ చాందిని చౌదరిని ఒక ప్రొడ్యూసర్ భయపెట్టారు. 'ఆలీతో సరదాగా' షోలో ఆమె ఈ విషయం బయటపెట్టారు.
ఇండస్ట్రీలో తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి కొందరు కథానాయికలు గతంలో బయటపెట్టారు. కొంత మంది తమ కెరీర్‌ను ఎలా నాశనం చేసినదీ ఆ తర్వాత వివరించారు. ఇప్పుడు ఆ జాబితాలో చాందిని చౌదరి కూడా చేరారు.
చాందిని చౌదరి తెలుగమ్మాయి. లఘు చిత్రాలు (షార్ట్ ఫిలిమ్స్)తో కెరీర్ స్టార్ట్ చేసి... ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. కిరణ్ అబ్బవరం, చాందిని జంటగా నటించిన 'సమ్మతమే' సినిమా ఈ నెల 24న థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి వచ్చారు.
'ఒక ప్రొడ్యూసర్ నీతో సినిమా తీయకుండా కావాలని నీ కెరీర్ కి బ్రేక్ వేశారని విన్నాను' అని ఆలీ అడగ్గా... ''కనిపించకుండా చేస్తానని చాలా భయపెట్టారు. నన్ను, మా ఫ్యామిలీని కూడా! తర్వాత నాకు తెలిసింది ఏంటంటే... ఆయన సంతకం చేయించుకున్న కాంట్రాక్ట్ వ్యాలిడ్ కాదని'' అని చాందిని చౌదరి చెప్పారు. అంత అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు పెద్దలను సంప్రదించలేదని ఆలీ ప్రశ్నించగా... ''ఎవరి దగ్గరకు వెళ్ళను? నన్ను నేను బ్యాకప్ చేసుకోవడానికి నాకు ఏం ఉంది? చిటికెలో నన్ను మసి చేసేస్తారు కదా'' అని చాందిని అన్నారు.
Also Read: హైదరాబాద్ ఆస్పత్రిలో దీపికా పదుకోన్ - ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' షూటింగ్‌లో హార్ట్ బీట్ పెరగడంతో...
కిరణ్ అబ్బవరానికి సిగ్గు ఎక్కువని చాందిని చౌదరి తెలిపారు. ఈ షోకి ఆమెతో పాటు అతనూ వచ్చారు. తన కాలేజీలో ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసిన విషయాన్ని, ఇంటర్మీడియట్ తర్వాత తాను ఎంత లావుగా ఉన్నదీ కిరణ్ అబ్బవరం చెప్పారు.
Also Read: 'ఎఫ్ 3'లో తమన్నాలా 'జబర్దస్త్'లో వర్ష - కామెడీ కోసం మగాడిలా!
View this post on Instagram