Deepika Padukone: ప్రభాస్ సినిమా షూటింగ్‌లో దీపికా పదుకోన్‌కు అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు
మంగళవారం(జూన్ 14) నాడు మధ్యాహ్నం సమయంలో ఉన్నట్టుండి దీపికా హార్ట్ బీట్ పెరిగిపోయిందట.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ మంగళవారం నాడు హైదరాబాద్ లోని కామినేని హాస్పిటల్ లో చేరారు. ప్రభాస్ నటిస్తోన్న 'ప్రాజెక్ట్ K' సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసం ఆమె ఇటీవల హైదరాబాద్ కి వచ్చారు. మంగళవారం(జూన్ 14) నాడు మధ్యాహ్నం సమయంలో ఉన్నట్టుండి దీపికా హార్ట్ బీట్ పెరిగిపోయిందట. దీంతో వెంటనే ఆమె షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని కామినేని హాస్పిటల్ కి వెళ్లినట్లు తెలుస్తోంది.
హాస్పిటల్ లో ప్రాథమిక చికిత్స అనంతరం ఆమె తాను బస చేస్తోన్న నోవెటల్ హోటల్ కి వెళ్లిపోయారు. నోవాటెల్ లో కూడా ఆమె డాక్టర్స్ పర్యవేక్షణలోనే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్స్ సూచించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
ఇదిలా ఉండగా.. ఇటీవల పారిస్ లో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎంతో హుషారుగా పాల్గొంది దీపికా. ఈసారి ఆమెకి జ్యూరీలో మెంబర్ గా ఛాన్స్ దక్కింది. కేన్స్ లో ఉన్న అన్ని రోజులు తన కాస్ట్యూమ్స్ తో అదరగొట్టింది దీపికా. ఈ ఫెస్టివల్ పూర్తయిన తరువాత ఆమె ముంబైలో కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని హైదరాబాద్ కి పయనమైంది. నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ప్రాజెక్ట్ K' షూటింగ్ లో పాల్గొంది దీపికా. చిత్రీకరణ సమయంలో ఆమెకి హార్ట్ బీట్ పెరిగిపోవడంతో సెట్స్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
Also Read: వెనక్కి వెళ్ళిన అరుణ్ విజయ్ 'ఏనుగు' - ఎప్పుడు విడుదల అవుతుందంటే?
Also Read: విష్ణు మంచు ఇచ్చిన లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే? ఉదయం ఆరు గంటలకు వర్క్ స్టార్ట్
View this post on Instagram
View this post on Instagram
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















