By: ABP Desam | Updated at : 03 Aug 2023 12:36 PM (IST)
Image credit: Anupama Parameswaran/Instagram
ప్రైయివేట్ ఆల్బమ్ సాంగ్స్ కు ఎలాంటి డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. ఎంతో మంది ఇలాంటి ప్రైవేట్ ఆడియో, వీడియో ఆల్బమ్ లు చేసి స్టార్ లుగా ఎదిగారు. మన బాలీవుడ్ లో ఇలాంటి ప్రైవేట్ ఆల్బమ్స్ చేయడం ఎప్పటినుంచో ఉంది. పలువురు స్టార్ హీరోలు, హీరోయిన్లు ప్రైవేటు ఆల్బమ్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. కొంతమంది ఈ ఆల్బమ్స్ ద్వారానే తన టాలెంట్ ను నిరూపించుకొని సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకున్నారు కూడా. అయితే మన టాలీవుడ్ లో ఈ ప్రైవేటు ఆల్బమ్స్ కు అంతగా ఆదరణ ఉండదు. ముఖ్యంగా సినిమా సెలబ్రెటీలు ఎవరూ అలాంటి ఆల్బమ్స్ చేయడానికి శ్రద్ధ చూపరు. ఇప్పుడు ఆ సరిహద్దును అనుపమ పరమేశ్వరన్ చెరిపేసింది. టాలీవుడ్ లో ప్రైవేటు ఆల్బమ్ లో నటించిన మొదటి సెలబ్రెటీగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటించిన తొలి ప్రైవేటు ఆల్బమ్ ‘పద పద’ సాంగ్ రిలీజైంది. ఇప్పుడిది నెట్టింట వైరల్ అవుతోంది.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది అనుపమ పరమేశ్వరన్. ఓ వైపు సనిమాల్లో నటిస్తూనే ఇంకోవైపు సోషల్ మీడియాలో రోజురోజుకూ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది. తాజాగా ఆమె ప్రైవేటు ఆల్బమ్ లో నటించి మరోమారు వార్తల్లో నలిచింది. టాలీవుడ్ లో ఏ హీరోయిన్ టచ్ చేయని ప్రైవేటు ఆల్బమ్స్ వైపు అనుపమ అడుగు వేసింది. ఇప్పటి వరకూ ఎవరూ అలా నటించిన పరిస్థితి లేదు. మొదటిసారి అనుపమ ఆ ప్రయత్నం చేయడంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. రిచర్డ్ ప్రసాద్ దర్శకత్వంలో ఆమె ‘పద పద’ అనే ప్రైవేటు ఆల్బమ్ లో నటించింది. రీసెంట్ గా ఈ సాంగ్ విడుదల అయింది.
అనుపమ నటించిన ఈ ‘పద పద’ అనే ప్రైవేటు సాంగ్ ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమాటోగ్రాఫర్ గా ఉన్న రిచర్డ్ ప్రసాద్ దర్శకుడిగా మారి ఈ పాటను రూపొందించారు. జపాన్ లోని టోక్యో అందాలు చూపిస్తూ ఉల్లాసంగా సాగిన ఈ సాంగ్ లో అనుపమ డాన్స్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా చేసింది. ఈ పాటకు డెన్నిస్ నార్టన్ సంగీతం అందించారు. సింగర్ చన్మయి శ్రీపాద ఆలపించింది. ఏ.వసంత్ సినిమాటోగ్రఫీ అందించారు. బాబీ ఫిల్మ్స్, ఆయేరా స్టూడియోస్, రూబీ నాజ్ పాటను నిర్మించారు. ఇది ప్రైవేట్ పాట అయినప్పటికీ మూవీ రేంజ్ లో తెరకెక్కించడం విశేషం. టోక్యో అందాలని అద్భుతంగా చూపించారు. అనుపమ కూడా ఢిపరెంట్ లుక్ లో కనిపించింది. మొత్తానికి ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది.
అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం సినిమాల్లోనూ రానిస్తోంది. గతేడాది ‘కార్తికేయ 2’, ‘18 పేజెస్’ వంటి సినిమాలతో మంచి హిట్లను అందుకుంది అనుపమ. ముఖ్యంగా ‘కార్తికేయ 2’ సినిమాతో అనుపమ క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిందనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ బ్యూటీ సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతోన్న ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు తమిళ్, మలయాళం సినిమాల్లోనూ నటిస్తోంది అనుపమ.
Also Read: ‘స్కంద’ ఫస్ట్ సింగిల్ సాంగ్ - డ్యాన్స్‌తో అదరగొట్టిన రామ్, శ్రీలీల!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!
WhatsApp Channels: వాట్సాప్ చానెల్స్‌లో మన దేవరకొండే టాప్ - మెటా యజమానికే షాకిచ్చిన కత్రినా కైఫ్!
Vidhi Movie: కంటి చూపులేనివాళ్లు సైతం థియేటర్‌కు వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: ‘విధి’ హీరో రోహిత్ నందా
అప్పట్లో చిరంజీవి, కమల్ హాసన్, శ్రీదేవిల రెమ్యునరేషన్ ఇంతేనా? ఆసక్తికర విషయాలు చెప్పిన యండమూరి
Skanda Overseas Reviews : ఓవర్సీస్ ఫేక్ రివ్యూలకు చెక్ పెట్టిన 'స్కంద' టీమ్
Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన
Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!
IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్ మాక్సీ! రాజ్‌కోట్ వన్డేలో టీమ్ఇండియా ఓటమి
TS TET: తెలంగాణ 'టెట్' పేపర్-1లో 36.89 శాతం, పేపర్-2లో 15.30 శాతం ఉత్తీర్ణత
/body>