Actress Amani: సినిమా ఛాన్సుల కోసం వెళ్తే.. అలా అడిగారు, కాస్టింగ్ కౌచ్‌పై ఆమని షాకింగ్ కామెంట్స్
Actress Amani: కాస్టింగ్ కౌచ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం. అయితే, ఇప్పుడే కాదట.. సావిత్రి గారి నుంచి ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారట హీరోయిన్స్. దానిపై స్పందించారు యాక్టరస్ ఆమని.
Actress Amani About Casting couch: కాస్టింగ్ కౌచ్.. సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం. అయితే, దీనిపై స్పందించారు అలనాటి నటి ఆమని. తాను కూడా ఇలాంటివి ఫేస్ చేశాను అంటున్నారు. ఎన్నో మంచి మంచి సినిమాలు చేసిన ఆమని చాలామంది అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చాలా దగ్గరయ్యారు ఆమె. అయితే పెళ్లి, పిల్లల తర్వాత ఇప్పుడు సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు ఆమె. సీరియల్స్, సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ వేస్తూ ఈతరం ప్రేక్షకులను అలరిస్తున్నారు ఆమని. ఇటీవల ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పారు.
స్ట్రెచ్ మార్క్స్ చూపించమన్నారు
ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి కామెంట్స్ చేశారు ఆమని. కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పటి నుంచి కాదని, సావిత్రి గారి టైం నుంచే అది ఉందని అన్నారు ఆమె. సినిమా కాకుండా, సినిమా పేరుతో ఇంకేదో వ్యాపారం చేయాలని వచ్చేవాళ్లు ఇలాంటి పనులు చేస్తుంటారని, తాను కూడా ఇలాంటివి ఫేస్ చేశానని చెప్పారు.
"హీరోయిన్స్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఉన్న హీరోయిన్స్ కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, అప్పట్లో ఏమీ లేవు కాబట్టి తెలిసేది కాదు. అంత ఇష్యూ అయ్యేది కాదు. ఏ ప్రొఫెషన్‌లో అయినా.. మంచి చెడు రెండూ ఉంటాయి. మనం ఏం తీసుకోవాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. తమిళ్ వాళ్లు నన్ను బాగా ఇబ్బంది పెట్టారు. కొత్తగా వచ్చే కంపెనీల్లో అలాంటివి ఉంటాయి. పెద్ద పెద్ద కంపెనీలు, డైరెక్టర్లు అలా చేయరు. హీరోయిన్ ఛాన్స్ కోసం వెళ్తే.. టూ పీస్ వేయాలి, ఇక్కడ స్ట్రెచ్ మార్క్ ఉందేమో అని అంటారు. చూపించండి అంటారు. ఎలా చూపిస్తాం. పక్కన అమ్మ, తమ్ముడు ఎవరో ఉంటారు. ఒక్కోసారి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఫోన్ చేసి.. స్టోరీ డిస్కషన్‌కు బీచ్‌కు రమ్మంటున్నారు. ఫైనాన్సియర్ మిమ్మల్ని చూడాలంట. మీరు మాత్రమే రండి అమ్మని తీసుకురాకండి లాంటివి చెప్తుంటారు. అలాంటప్పుడే మనకు అర్థం అయిపోతుంది. వాళ్లు జెన్యూన్ కాదని, పెద్ద కంపెనీకి వెళ్తే వాళ్లు డ్యాన్స్ చేయమ్మ, ఎమోషనల్‌గా నటించు, డైలాగ్స్ చెప్పు అని అడుగుతారు. స్ట్రెచ్ మార్క్ చూడాలి, ఇక్కడేమన్న బ్లాక్ ఉంటుందా? ఇలాంటివి అడిగినప్పుడు వాళ్లు సినిమా కోసం రాలేదని, ఏదో ఆశించి వస్తున్నారని తెలిసిపోతుంది. అప్పుడే నో చెప్పి రావాలి. ఇష్టపడి చూపిస్తాను అంటే అది వాళ్ల ఉద్దేశాన్ని బట్టి ఉంటుంది. మైండ్ సెట్‌ను బట్టి ఉంటుంది. నేనైతే చూపించను అని అక్కడి నుంచి వచ్చేసిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి. చాలామంది నేను హీరోయిన్ అయిపోవాలి. నేను విజయశాంతి లాగా అవ్వాలి. నగ్మా లాగా అవ్వాలనే ఆశతో వస్తారు. అలా వచ్చినప్పుడు ఇలాంటి తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఆశ ఒక్కోసారి మనిషిని బలహీన పరుస్తుంది. అలాంటప్పుడు అలాంటి వాళ్లను మనం ఏమీ అనలేం కదా?" అని తెలిపారు ఆమని.
నా పనే నాకు సరిపోతుంది..
మీ టూ ఉద్యమంలో పాల్గొనక పోవడంపై కూడా ఆమె స్పందించారు. "నాకు మా ఇంట్లో నా సమస్యలు చాలా ఎక్కువ. అవి తీర్చుకుంటే చాలు నాకు. ఇద్దరు పిల్లలు వాళ్లు చిన్నవాళ్లు. ఎప్పుడూ బిజీగా ఉంటాను. ఫోన్ మాట్లాడటానికి నాకు షూట్ లోనే టైం దొరుకుతుంది. పిల్లలు హైపర్ యాక్టివ్. నా ఫోన్ లాగేసుకుంటారు. నాకు ఇవ్వరు. ఫోన్ కోసం పిల్లల్ని అడుక్కుంటాను. మిస్డ్ కాల్ వచ్చిందేమో చూడమ్మా అని అడుగుతాను" అంటూ తన గురించి, పిల్లల గురించి చెప్పారు ఆమె.
Also Read: చిరంజీవి రియల్ లైఫ్‌లో బ్యాడ్ యాక్టర్, వాళ్లు ఏం అనుకుంటారో అని కూడా ఆలోచించలేదు: జయసుధ