అన్వేషించండి

VK Naresh: మళ్లీ ఒకసారి ట్రై చేద్దాం అనిపిస్తుంది - పెళ్లి గురించి నరేష్ మాటలు వింటే మతిపోవాల్సిందే!

సీనియర్ నటుడు నరేష్ పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లి విషయంలో ప్రస్తుత తరం, పాతతరం వ్యక్తులు ఎలాంటి అభిప్రాయాలతో ఉన్నారో ఫన్నీగా చెప్పారు.

Actor VK Naresh on Marriages: సీనియర్ నటుడు నరేష్ ప్రేమలు, పెళ్లిళ్ల గురించి మీడియాలో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు ముగిసిపోగా, గత సంవత్సరం నటి పవిత్రా లోకేషన్‌ను నాలుగో వివాహం చేసుకోడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే, ఆయన ఏ ప్రెస్ మీట్ లో పాల్గొన్నా, పెళ్లిళ్ల ప్రస్తావన వస్తూనే ఉంటుంది. తాజాగా నారా రోహిత్ హీరోగా నటించిన ‘సుందరకాండ‘ టీజర్ లాంచ్ ఈవెంట్ లోనూ ఆయనకు పెళ్లి గురించి ప్రశ్న ఎదురయ్యింది. దానికి ఆయన చెప్పిన సమాధానం అందరూ పడీ పడీ నవ్వారు.

పెళ్లి గురించి నరేష్ ఏమన్నారంటే?

ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్లిళ్లు కాలేదని బాధపడుతున్నారు. మీ అనుభవం ప్రకారం, పెళ్లి అనేది సంతోషాన్ని ఇస్తుందా? కాకుంటేనే బాగుంటుంది అనిపిస్తుందా? అనే ప్రశ్నకు నరేష్ ఆసక్తికర సమాధానం చెప్పారు. “ఇప్పటితరం పెళ్లి వద్దు అనుకుంటున్నారు. అంతకు ముందు తరం మళ్లీ ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నారు. హ్యాపీగా ఉండటానికే అలా ఆలోచిస్తున్నారు. ఈ మధ్యలో నేనున్నాను” అని చెప్పడంతో ఈవెంట్‌కు హాజరైన వాళ్లంతా నవ్వారు.

నరేష్ నాలుగో పెళ్లి విషయంలో బోలెడు హైడ్రామా

నటుడు నరేష్ పెళ్లిళ్ల విషయం మీడియాతో పాటు సోషల్ మీడియాలో ఓ రేంజిలో చర్చ జరిగింది. 2023లో నటి పవిత్రా లోకేషన్ నరేషన్ నాలుగో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లిని అడ్డుకునేందుకు ఆయన మూడు భార్య రమ్యా రఘుపతి చేసిన ప్రయత్నాలు హాట్ టాపిక్ అయ్యాయి. కేసులు, కోర్టుల వరకు వెళ్లి పెద్ద రచ్చ జరిగింది. వాటన్నింటిని తట్టుకుని నరేష్, పవిత్ర పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పెళ్లిళ్ల గురించి ఎప్పుడూ ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. వాటికి ఆయన ఫన్నీగా సమాధానాలు చెప్తూనే ఉన్నారు.   

‘సుందరకాండ’లో రోహిత్ తండ్రిగా నరేష్

‘సుందరకాండ’ సినిమాలో హీరో రోహిత్ తండ్రిగా, నరేష్ నటించారు. ఇందులో తన కొడుకు పెళ్లి కావడం లేదంటూ ఆయన పడే టెన్షన్, తన కొడుకు గురించి ఆయన చేసే కామెంట్స్ అందరినీ నవ్విస్తాయి. ‘మా వాడిలో ఏ సమస్య లేదు, మా వాడితోనే సమస్య” అనే డైలాగ్ ఫన్నీగా ఆట్టుకుంటుంది. ఈ చిత్రంలో ఏజ్ డ్ లవర్ బాయ్ గా రోహిత్ కనిపించనున్నారు. తను చేసుకోబోయే అమ్మాయిలో 5లక్షణాలు ఉండాలని కోరుకుంటాడు. ఇంతకీ ఆమె దొరుకుతుందా? లేదా? అనేది ఈ సినిమాలో చూపించనున్నారు. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై మంచి అంచనాలు కలిగిస్తోంది. ఈ సినిమాలో నారా రోహిత్, శ్రీదేవి విజయ్ కుమార్, వృతి వర్గనీ హీరో, హీరోయిన్లుగా నటించారు. నరేష్, వాసుకీ ఆనంద్, సత్య, అజయ్, వీటీవీ గణేశ్, అభినవ్ గోమటం, విశ్వాంత్, రూప లక్ష్మి, రఘుబాబు ఇతర పాత్రలు పోషిచారు. ఈ సినిమాకు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.   

Read Also: అమ్మాయి కోసం నారా వారి అబ్బాయి తంటాలు, ఆకట్టుకుంటున్న‘సుందరకాండ‘ టీజర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
YS Jagan: ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
YSRCP Leaders Bail: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
Hyderabad News: హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అరవింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు బెయిల్, సీబీఐ కేసులో ఊరటదవాఖానకు పోవాలి, చేయి నొప్పి పుడుతోంది - పోలీసులతో హరీశ్ వాగ్వాదంఅభిమాని చివరి కోరిక తీర్చనున్న జూనియర్ ఎన్‌టీఆర్, దేవర సినిమా స్పెషల్ షోబలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు, నొప్పితో విలవిలలాడిన హరీశ్ రావు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! 8 మంది దుర్మరణం
YS Jagan: ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
YSRCP Leaders Bail: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
Hyderabad News: హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
Kedarnath: కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
CM Revanth Reddy: 'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Pawan Kalyan Vacate Office:  ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
Roja: నగరిలో కీలక నేతలపై వైసీపీ సస్పెన్షన్ వేటు - రోజా  ఇక ఫీల్డులోకి వస్తారా ?
నగరిలో కీలక నేతలపై వైసీపీ సస్పెన్షన్ వేటు - రోజా ఇక ఫీల్డులోకి వస్తారా ?
Embed widget