Bigg Bosss 5 Telugu: నవరాత్రి స్పెషల్.. బిగ్ బాస్ స్టేజ్ పై అఖిల్..
ఈరోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ స్టేజ్ పైకి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' టీమ్ రాబోతుంది. ఇందులో భాగంగా అక్కినేని అఖిల్, పూజాహెగ్డే బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు.
బిగ్ బాస్ షోలో ఈరోజు ఎపిసోడ్ ను స్పెషల్ గా డిజైన్ చేశారు. ఈ ఆదివారం బిగ్ బాస్ స్టేజ్ పైకి చాలా మంది అతిథులు రాబోతున్నారు. నవరాత్రి స్పెషల్ గా ఈ షోను ప్లాన్ చేశారు. ఈరోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ స్టేజ్ పైకి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' టీమ్ రాబోతుంది. ఇందులో భాగంగా అక్కినేని అఖిల్, పూజాహెగ్డే బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు. ముందుగా వీరిద్దరూ ఎవరినీ పట్టించుకోకుండా తమ సినిమాలో పాటకు డాన్స్ చేస్తూ రొమాన్స్ లో మునిగిపోయారు.
Also Read: ప్రగ్యా జైస్వాల్‌కు మళ్లీ కరోనా.. టెన్షన్ లో బాలయ్య
ఇంతలో స్టేజ్ పైకి వచ్చిన నాగ్.. 'ఎరా.. ఇదేమైనా నీ ఇల్లు అనుకుంటున్నావా..?' అంటూ అఖిల్ పై సెటైర్ వేశారు. దానికి అఖిల్.. 'స్టేజ్ ఈజ్ యువర్స్ అని ఎవరో అన్నారని' అఖిల్ చెబుతుండగా.. 'దిస్ ఈజ్ మై స్టేజ్' అంటూ నాగార్జున అన్నారు. తండ్రీకొడుకుల మధ్య జరిగిన సంభాషణ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత అఖిల్-పూజాహెగ్డేలు హౌస్ మేట్స్ తో మాట్లాడారు.
ఆ సమయంలో అఖిల్ హౌస్ లో ఉన్న అబ్బాయిలకు ఒక టాస్క్ ఇచ్చారు. వారందరినీ పూజాహెగ్డేని ఇంప్రెస్ చేయమని అడిగారు. ఇంతలో శ్రీరామచంద్ర 'సామజవరగమన' పాట అందుకొని పూజాని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశాడు. వెంటనే నాగ్ 'నాకు తెలుసు శ్రీరామ్ నీకీ అడ్వాంటేజ్ ఉందంటూ' కౌంటర్ వేశారు. ఆ తరువాత నాగ్.. సన్నీను ఓ ప్రశ్న వేశారు. దానికి సన్నీ 'నా బ్రెయిన్ వాడతా సార్' అని అనగా.. 'లేనిది ఎలా వాడతావ్' అంటూ మళ్లీ పంచ్ వేశారు నాగ్. ఆ తరువాత స్టేజ్ పైకి వచ్చిన హైపర్ ఆది హౌస్ మేట్స్ పై తన కామెడీ, పంచ్ లతో నవ్వించాడు.
Stage is yours ante ila ardham cheskunnadu @AkhilAkkineni8 ... @hegdepooja ni impress chestara mana bachelors#BiggBossTelugu5 today at 6 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/Ir6IwL0TQa
— starmaa (@StarMaa) October 10, 2021
Also Read: అతడి వల్లే 'మా'లో ఇన్ని గొడవలు.. శివాజీరాజా ఆరోపణలు..
Also Read: 'మా' ఎన్నికల్లో ఓటేసిన పవన్ కల్యాణ్.. అది అవసరమా అనిపించింది అంటూ కామెంట్
Also Read: MAA Elections 2021: ‘మా’ ఎన్నికలు.. మోహన్ బాబు కాళ్లు మొక్కబోయిన ప్రకాష్ రాజ్, విష్ణుకు హగ్!
Also Read: Hema Bites Siva Balaji: ‘మా’లో రచ్చ.. శివబాలాజీ చేయి కొరికిన హేమా.. ప్రకాష్ రాజ్‌తో మంచు ఫైట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి