Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్‌కు మళ్లీ కరోనా.. టెన్షన్ లో బాలయ్య
నటి ప్రగ్యాజైశ్వాల్ కోవిడ్ బారిన పడింది. ఆమెకి రెండు వ్యాక్సిన్ డోసులు అయిపోయినప్పటికీ మళ్లీ కోవిడ్ ఎటాక్ చేసింది.
'కంచె' సినిమాతో హీరోయిన్ గా పరిచయమై.. మొదటి సినిమాతో నటిగా ఆకట్టుకుంది. ప్రగ్య జైస్వాల్. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా తాను కోవిడ్ బారిన పడినట్లు ప్రకటించింది. ఆదివారం జరిపిన టెస్ట్ లలో తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని.. వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నా కానీ కరోనా సోకినట్లు ఆమె తెలిపింది. అయితే ఈ బ్యూటీ కోవిడ్ బారిన పడడం ఇది మొదటిసారి కాదని.. వ్యాక్సిన్ వేసుకోకముందుకు కూడా తనకు పాజిటివ్ వచ్చిందని చెప్పుకొచ్చింది.
Also Read: అతడి వల్లే 'మా'లో ఇన్ని గొడవలు.. శివాజీరాజా ఆరోపణలు..
తనకు వైరస్ లక్షణాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉన్నట్లు.. అలానే డాక్టర్ల సూచనలతో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపింది. అలానే గత పది రోజుల నుంచి తనను కలిసిన ప్రతి ఒక్కరూ కోవిడ్ టెస్ట్ లు చేయించుకోవాలని.. జాగ్రత్తలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేసింది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ టెన్షన్ లో పడ్డారు. ఎందుకంటే రీసెంట్ గానే ఆమె బాలయ్యను కలిసింది.
ఇద్దరూ కలిసి 'అఖండ' సినిమాలో నటించారు. నాలుగురోజుల క్రితమే షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా ప్రగ్య.. బాలయ్యతో కలిసి ఫోటోలు తీసుకొని వాటిని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. అతడిని తెగ పొగిడేసింది. ఇక బోయపాటి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీకాంత, పూర్ణలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
View this post on Instagram
View this post on Instagram
Also Read: 'మా' ఎన్నికల్లో ఓటేసిన పవన్ కల్యాణ్.. అది అవసరమా అనిపించింది అంటూ కామెంట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి