Sonia Akula Love Story: ఎట్టకేలకు లవర్ గురించి ఓపెన్ అయిన సోనియా... మూడేళ్ల లవ్ స్టోరీ, ఏం చెప్పిందో తెలుసా?
Sonia Akula Boyfriend: బిగ్ బాస్ 8 తెలుగు డే 17 రోజు ప్రసారమైన తాజా ఎపిసోడ్ లో సోనియా మరోసారి తన లవ్ స్టోరీ గురించి ప్రేరణతో మాట్లాడింది. ప్రియుడు ఎవరో, పరిచయం ఎలా ఏర్పడిందో కూడా వెల్లడించింది.
తనంతట తానే ఆడ పులిగా ప్రకటించుకున్న సోనియా తాజాగా మరోసారి లవ్ స్టోరీ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టింది. ఓ వైపు చిన్నోడు, మరోవైపు పెద్దోడి సపోర్ట్ తో హౌస్ లో నెట్టుకు వస్తున్న సోనియా అసలు బయట రియల్ లైఫ్ లవ్ స్టోరీ ఎలా మొదలైంది? ఇప్పుడు ఆ రిలేషన్షిప్ స్టేటస్ ఎక్కడ దాకా వెళ్ళింది? అనే విషయాన్ని వెల్లడించింది.
మూడేళ్లుగా అతనితో ప్రేమలో ఆడపులి
సోనియా ఆకులపై ప్రస్తుతం నెగిటివ్ టాక్ ఎక్కువగా నడుస్తోంది. ఆమె హౌస్ లో ప్రవర్తించే తీరు పట్ల ఓ వర్గం ప్రేక్షకులు చిరాకు పడుతున్నారు. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే సోనియా హౌస్ లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపిస్తోంది అనే విధంగా కనిపిస్తోంది ప్రేక్షకులకు. వీకెండ్ లో నాగార్జున సైతం నీకైతే చిన్నోడు పెద్దోడు కావాలి... విష్ణు ప్రియకు ఎవరున్నారు అంటూ ఇచ్చి పడేసాడు. దీంతో ఇలా ముగ్గురి గురించి బయట ఎలా అవుతుంది అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు నాగార్జున. ఒకానొక టైంలో సోనియా కూడా "ఇదంతా బయటకు ఎలా వెళుతుందో తెలియదు, తను ఏమనుకుంటాడో అర్థం కావట్లేదు" అంటూ నిఖిల్ ఒడిలో తలపెట్టి ఏడ్చింది. కానీ నిఖిల్ మాత్రం ఎప్పటిలాగే కూల్ గా "తనకి నువ్వంటే ఏంటో తెలుసు కదా" అంటూ ఆమెను బుజ్జగించాడు. ఈ నేపథ్యంలోనే తాజుగా సోనియా ప్రేరణతో తన ప్రేమ విషయాలను పంచుకుంది. మూడేళ్లుగా కలిసి పని చేస్తున్నామని చెప్పిన సోనియా అతని పేరును మాత్రం వెల్లడించలేదు. సోనియా మాట్లాడుతూ "మూడేళ్లుగా తెలుసు.. నేను స్టార్ట్ చేసిన ఒక ఎన్జీవో కు అతను వెబ్సైట్ డిజైనింగ్ చేశారు. అంతేకాకుండా అమెరికా నుంచి తాను కూడా ఒక స్పాన్సర్. కానీ నేను ఇంతవరకు ప్రపోజ్ చేయలేదు. తను నా జీవితంలోకి అడుగు పెట్టాక ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పటికీ అతను నా నిర్ణయం కోసమే ఎదురు చూస్తున్నాడు. ఒక డిపెండెన్సీ ఉండడం వల్ల వెయిట్ చేసున్నాము" అంటూ చెప్పుకొచ్చింది.
సోనియా పై చిన్నోడి అలక...
హౌస్ లో పెద్దోడు నిఖిల్, చిన్నోడు పృథ్వీ అని సోనియా పిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే టాస్క్ లో భాగంగా "నువ్వు ఎవడివిరా నాకు చెప్పడానికి" అని సోనియా అన్న మాటను పట్టుకున్న పృథ్వీ ప్రస్తుతం అలక పాన్పు ఎక్కాడు. తనవల్ల గేమ్ డిస్టర్బ్ అవుతుందనే ఆలోచనతో బాధపడుతూ ఏకంగా సోనియాని దూరంగా పెట్టాలనుకున్నాడు. ఇదే విషయాన్ని నిఖిల్ కు కూడా చెప్పాడు. అయితే నిఖిల్ ఈ విషయాన్ని వెంటనే సోనియా చెవిలో జారేశాడు. దీంతో "వాడు అవన్నీ పెద్దగా పట్టించుకోడులే" అంటూనే అతన్ని ఎలా కూల్ చేయాలా అన్న ఆలోచనలో పడిపోయింది సోనియా. అయితే అలిగినప్పటికీ ఇద్దరూ ఒక్కటే క్లాన్ సభ్యులు కాబట్టి టాస్క్ లో మాత్రం గట్టిగానే పోరాడుతున్నారు.
Read Also: ఇదో లఫూట్ గేమ్, వాడో వరస్ట్ ప్లేయర్ అంటూ నోరు జారిన అభయ్- మళ్లీ బరస్ట్ అయిన మణికంఠ