అన్వేషించండి

Bigg Boss 8 Telugu Day 17 Promo 3: ఇదో లఫూట్ గేమ్, వాడో వరస్ట్ ప్లేయర్ అంటూ నోరు జారిన అభయ్- మళ్లీ బరస్ట్ అయిన మణికంఠ 

Bigg Boss Telugu Season 8 | బిగ్ బాస్ సీజన్ 8 డే 17 మూడవ ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులో అభయ్ లఫూట్ గేమ్ అంటూ నోరు జారగా, హౌజ్ మేట్స్ టాస్క్ కోసం ఒకరితో ఒకరు కొట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యారు.

Bigg Boss 8 Telugu | బిగ్ బాస్ సీజన్ 8 డే 17 కి సంబంధించిన మూడవ ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. స్ట్రాటజీతో గేమ్ ఆడాల్సిన కంటెస్టెంట్స్ సహనాన్ని కోల్పోయి నోటికి వచ్చినట్టుగా వాగడం, ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడం, మళ్లీ ఎమోషనల్ అవడం వంటి విశేషాలతో సాగింది ప్రోమో. అయితే లఫూట్ గేమ్ ఆడింది ఎవరు? వరస్ట్ ప్లేయర్ అని ఎవరు ఎవరిని అన్నారు? మణికంఠ మళ్ళీ ఎందుకు బరస్ట్ అయ్యాడు? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.

ఇదొక లఫూట్ గేమ్ అంటూ నోరు జారిన అభయ్ 
హౌస్ లో ఎవరు ఎప్పుడు ఎందుకు కోప్పడుతున్నారు? కంట్రోల్ గా ఉండకుండా ఎందుకు నోరు జారుతున్నారు ? అనే విషయం బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు అసలు అర్థం కావట్లేదు. ఇప్పటికే నోటిని అదుపులో పెట్టుకోండి అంటూ సోనియాకు, పృథ్వికి నాగ్ అక్షింతలు వేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ నిన్న, మొన్న జరిగిన టాస్క్ లలో యష్మి బొక్కలే అని, ప్రేరణ తొక్కలే అంటూ నోటికొచ్చినట్టుగా మాట్లాడారు. ఇక ఇప్పుడు ఏకంగా వీళ్ళ క్లాన్ చీఫ్ అయిన అభయ్ కూడా నోరు పారేసుకున్నాడు. తాజాగా 17వ ఎపిసోడ్ కు సంబంధించిన మూడవ ప్రోమో రిలీజ్ అయింది. అందులో మొదట్లోనే అభయ్ "ఇది ఒక వన్ ఆఫ్ ద లఫూట్ గేమ్, వాడొక వరస్ట్ ప్లేయర్" అని సంబోధిస్తూ "ఇదంతా పృథ్వి గాడే మొదలు పెట్టాడు" అంటూ తిట్ల దండకం అందుకున్నట్టు చూపించారు.

మరోవైపు యష్మీ గౌడ "ఫస్ట్ నేను పృథ్వీని హోల్డ్ చేశాను. వాడు రోల్ అయ్యి నా మీదకు వచ్చాడు. ఇద్దరూ నా మీద పడిపోయారు" అని చెప్పడం కనిపించింది. ఇక హౌస్ లో మరో క్లాన్ అయిన నిఖిల్ తన టీం సభ్యుడైన పృథ్వితో గేమ్ స్ట్రాటజీ గురించి చెప్పడం కనిపించింది. ఆ తర్వాత వద్దు వద్దు అని చెప్తున్నా వినకుండా అభయ్ క్లాన్ సభ్యులు పృథ్వి దగ్గరకు రావడంతో అతను ఫైర్ అయ్యాడు. ప్రేరణ మరింత రెచ్చగొడుతూ "ఎందుకు రావద్దు వస్తాం" అని అరిచింది. దీంతో పట్టరాని ఆవేశంతో పృథ్వీ ప్రేరణ మీదకి వెళ్ళాడు. దీంతో అక్కడే ఉన్న ఆదిత్య ఓం.. పృథ్వీ తో గొడవకు దిగాడు. మరోవైపు నబిల్ వీళ్ళిద్దరి మధ్య గొడవను ఆపే ప్రయత్నం చేశాడు. అయితే పృథ్వికి సపోర్ట్ గా ఉన్న సోనియా ఎందుకు రెచ్చగొడుతున్నారు అంటూ కోప్పడింది. 

Read Also : Bigg Boss Telugu 8 day 18 promo : హద్దులు దాటిన యష్మి గౌడ యాటిట్యూడ్, నిఖిల్ ఫైర్... విసిరికొట్టింది ప్రేరణ అంటూ ఫుడ్ సెంటిమెంట్ తో ఏడిపించిన విష్ణు ప్రియ 

ఆ తర్వాత బిగ్ బాస్ "ఇద్దరు క్లాన్ మెంబర్స్ వరుసగా నిలబడండి. ఎవరి దగ్గర ఎన్ని గుడ్లు ఉన్నాయో చెప్పండి" అని ఆదేశించారు. నెక్స్ట్ "శక్తి టీమ్ లో ఉన్నవారు కాంతారా టీంలో నుంచి ఎవరు వెళ్లిపోవాలి అనే విషయాన్ని నిర్ణయిస్తారు" అని చెప్పారు బిగ్ బాస్. ఆ తరువాత సీన్లో మణికంఠ ఇంట్లోకి ఏడుస్తూ వెళ్లడం కనిపించింది. అభయ్ బుజ్జగించబోతే "నేను నా పిల్ల, బిడ్డ నాకు కావాలంటే గేమ్ విన్ అవ్వాలి" అంటూ మళ్లీ తన ఎమోషన్స్ ని బయటకు కక్కాడు.

Read Also : Bigg Boss 8 Telugu Day 17 Promo 2 : బిగ్ బాస్ గా అమ్మాయి, గుడ్ల కోసం హౌజ్ మేట్స్ ఫైట్... ఫిజికల్ అయిన పృథ్వీ, ఆదిత్య

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Embed widget