అన్వేషించండి

Bigg Boss Telugu 8 day 18 promo : హద్దులు దాటిన యష్మి గౌడ యాటిట్యూడ్, నిఖిల్ ఫైర్... విసిరికొట్టింది ప్రేరణ అంటూ ఫుడ్ సెంటిమెంట్ తో ఏడిపించిన విష్ణు ప్రియ 

బిగ్ బాస్ తెలుగు 8 ఎపిసోడ్ 18 ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది. అందులో యష్మి గౌడ, నిఖిల్ ల మధ్య సీరియస్ డిస్కషన్ నడిచింది. మరోవైపు విష్ణు ప్రియ ఫుడ్ సెంటిమెంట్ కంటతడి పెట్టేలా చేసింది.

బిగ్ బాస్ సీజన్ 8 డే 18 కి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ మొదటి ప్రోమోలో నిన్న జరిగిన ౠరని కొట్టు రేషన్ పట్టు అనే టాస్క్ కు సంబంధించిన హీటెడ్ డిస్కషన్ కంటిన్యూ అయినట్టుగా చూపించారు. ఈ నేపథ్యంలోనే హౌస్ మేట్స్ అందరూ ఎవరి పాయింట్ వాళ్ళు మాట్లాడుతుంటే యష్మి గౌడ మళ్ళీ ఆటిట్యూడ్ తో రెచ్చిపోయింది. దీంతో నిఖిల్, యష్మి గౌడ మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఇక ఆ తర్వాత ప్రేరణ ఫుడ్ విసిరేసింది అంటూ విష్ణు ప్రియ కన్నీరు మున్నీరయింది. 

నోరు పారేసుకుంటున్న యష్మి గౌడ    
నిన్న జరిగిన బూరని కొట్టు రేషన్ పట్టు అనే ఎపిసోడ్లో సంచాలక్ నిర్ణయాన్ని సస్పెన్స్ లో పెట్టారు బిగ్ బాస్. అయితే ఇంకా ఆ డిస్కషన్ కంటిన్యూ అవుతున్నట్టుగా తాజా ప్రోమోలో చూపించారు. సంచాక్ గా ఉన్న సోనియా శక్తి టీం విన్ అయ్యిందని నిర్ణయానికి వచ్చేసింది. కానీ హౌస్ మేట్స్ మాత్రం అందుకు ఒప్పుకోవట్లేదు. ఆపోజిట్ టీం అయిన కాంతారా క్లాన్ సభ్యులు అభయ్, యష్మి గౌడ, ప్రేరణ కంబం ఇదే విషయం గురించి చెప్పిందే చెప్పి రచ్చ రచ్చ చేస్తున్నారు. "బిగ్ బాస్ చెప్పిన రూల్స్ లో కంటెస్టెంట్ ఒంటిపై ఉన్న బెలూన్ అనే లైన్ ఫస్ట్ లోనే ఉంది కదా. దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు" అంటూ సోనియాపై ఫైర్ అయ్యింది యష్మి గౌడ. అయితే నిఖిల్ మాత్రం "అతను బయటకు కాలు లోపల పెట్టి బెలూన్స్ ను పగలగొట్టాడు. బయటకు వెళ్ళినా సరే లోపలికి వచ్చి ఆడాలి" అని చెప్పాడు. వెంటనే యష్మి గౌడ నోరు వేసుకుని పడిపోతూ "లేదు.. సంచాలక్ ఆపాడు. నీవల్ల, నీ స్టిక్ విరిగిపోయింది అనే కారణంతో స్టాప్ చేసి మరీ కొట్టొద్దు అన్నారు. మీ సంచాలక్ ఎందుకు సైలెంట్ గా నిల్చుకోవాలి" అంటూ నిఖిల్ చెప్పేది వినకుండా అరుస్తూనే ఉంది యష్మి గౌడ. దీంతో నిఖిల్ సీరియస్ అవుతూ ఆగమని అరిచాడు. "నేను అరుస్తాను" అని చెప్పేసరికి, "అయితే పక్కకెళ్ళి ఆడు" అంటూ ఫైర్ అయ్యాడు నిఖిల్.  ఇక ఆ తర్వాత హౌస్ లో ఫుడ్ డ్రామా మళ్లీ మొదలైంది. 

Read Also : Bigg Boss Naga Manikanta: బిగ్‌ బాస్‌ 8 మణికంఠ భార్య షాకింగ్‌ పోస్ట్‌ - విడాకుల అసలు కారణం ఇదే, భర్త అసలు రూపం బయటపెట్టిన ప్రియ

విష్ణు ప్రియ, ప్రేరణ మధ్య తెగని గుడ్డు గొడవ...
ఈవారం మొదట్లోనే విష్ణు ప్రియ రెండు గుడ్లు తినడం తనకు నచ్చలేదంటూ ప్రేరణ నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఏంట్రా ఈ గుడ్డు గొడవ అని మళ్లీ తలలు పట్టుకుంటే, తాజాగా మరోసారి అదే టాపిక్ తెరపైకి తీసుకొచ్చారు. "ఫుడ్ వేసేటప్పుడు విసిరికొట్టినట్టుగా వేసింది ప్రేరణ. ఎవరిదైనా ఆకలే కదా" అంటూ ఎమోషనల్ అయింది విష్ణు ప్రియ. హౌస్ మేట్స్ అందరూ కలిసి ఆమెను బుజ్జగించడంతోపాటు ప్రేరణను దీని గురించి అడిగే ప్రయత్నం చేయగా, అక్కడ కూడా ప్రేరణ ఆటిట్యూడ్ చూపించినట్టుగా ప్రోమోని చూస్తే అర్థమవుతుంది.

Also Read: ఏ గేమ్స్‌ ఆడను.. బిగ్‌ బాస్‌పై అభయ్‌ అసహనం - యూ ఆర్‌ చీటర్‌ అంటూ సోనియాపై విరుచుకుపడ్డ యాష్మి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Embed widget