Bigg Boss Naga Manikanta: బిగ్ బాస్ 8 మణికంఠ భార్య షాకింగ్ పోస్ట్ - విడాకులకు కారణం ఇదేనా! భర్త అసలు రూపం బయటపెట్టిన ప్రియ
Bigg Boss Manikanta Wife Priya: బిగ్ బాస్ 8 తెలుగు కంటెస్టెంట్ నాగ మణికంఠ భార్య షాకింగ్ పోస్ట్ చేసింది. విడాకులకు కారణం చెబుతూ తన భర్త అసలు రూపం బయటపెట్టింది.
బిగ్ బాస్ 8 తెలుగులో నాగ మణికంఠకు ప్రత్యేకంగా గుర్తింపు ఉంది. అంతా ఆటపై దృష్టి పెడితే నాగ మణికంట సింపతి గెయిన్ చేసేందుకు ప్రయత్నించాడు. ఎంట్రీతో తల్లి చనిపోయింది... స్టెప్ ఫాదర్ వదలేశాడు.. భార్యతో గొడవ.. విడాకులు సాడ్ స్టోరీతో హౌజ్‌లోకి వచ్చాక. హౌజ్‌లోనూ ఫస్ట్‌వీక్ మొత్తం తన భార్య, కూతురిని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ డ్రామా ప్లే చేశాడు. అలా హౌజ్ మణికంఠ ఫేమస్ అయ్యాడు. మణి కంఠ స్టోరీ విన్న అందరు అతడి భార్య శ్రీప్రియను తప్పుబడ్డారు. ఆమెపై కాస్తా నెగిటివిటీ కూడా పెరిగింది. ఈ క్రమంలో మణికంఠ భార్య చేసిన ఓ పోస్ట్ సంచలనంగా మారింది.
ప్రియ షాకింగ్ పోస్ట్
"సమాజం కోసం కలిసి ఉండటం కంటే.. విషపూరిత సంబంధం నుంచి విడిపోవడమే మంచిది" అని తన పోస్ట్‌లో పేర్కొంది. అదే విధంగా భార్యాభర్తలు తరచూ గొడవలు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలియజేసేలా ఫొటోని కూడా షేర్ చేసింది. "చిన్న పిల్లల అంతరంగాన్ని వినండి. భార్యాభర్తలు గొడవ పడటం వల్ల అది పిల్లల మానసిక స్థితిపై ఎలా ప్రభావం చూపిస్తుందో చూడండి" అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఆమె. ప్రస్తుతం ఆమె పోస్ట్ హాట్‌టాపిక్‌గా మారింది. ఈ పోస్ట్ ద్వారా ఆమె తమ విడాకులకు అసలు కారణం బయటపెట్టిందంటున్నారు. మణికంఠ కావాలనే భార్యను నెగిటివ్ చేశాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అదంతా సింపతి డ్రామానా?
కాగా తల్లిచనిపోయాక పెళ్లి చేసుకున్న మణికంఠ ప్రియను పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లాడు. అయితే తనకు జాబ్ లేని కారణంగా తరచూ వీరద్దరికి గొడవ జరిగేదని, ఈ క్రమంలో తమ వివాహ బంధం విడాకుల వరకు వచ్చిందని చెప్పాడు. తన భార్య వెళ్లగొట్టడంతో ఇండియా వచ్చానన్నాడు. ఇదంతా విన్న నెటిజన్లు అతడి భార్యను తిట్టిపోశారు. కష్టసమయాల్లో భర్తకు అండగ నిలవాల్సింది పోయి.. తన స్వార్థం చూసుకుందంటూ విమర్శించారు. కానీ, హౌజ్‌లోకి వచ్చాక సీన్ అంతా రివర్స్ అయ్యింది. హౌజ్‌లో తన భార్య మంచిందంటూ తనతో ఉన్న జ్ఞాపకాలు గుర్తు చేసుకి నెటిజన్లకు షాకిచ్చాడు మణికంఠ. భర్త మొదట తనపై నెగిటివ్‌గా ప్రచారం చేయడంపైనే అతడు భార్య ప్రియా ఈ పోస్ట్ చేసిందని నెటిజన్లంతా అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే మణికంఠ ప్రస్తుతం హౌజ్‌లో తన ఆటతీరుతో అందరిని సర్‌ప్రైజ్ చేస్తున్నాడు. మొదటి వీక్ అంతా కూడా కంటతడి పెడుతూ, ఆటలు ఆడకుండ తన కష్టాలను గురించి వివరిస్తూ ఎమోషనల్ డ్రామా ఆడాడు. హౌజ్‌మేట్స్‌తోనూ పెద్దగా కలిసేవాడు కాదు. కానీ రెండోవారం తన తీరు మార్చుకుని తనని తాను మెరుగుపరుచకున్నాడు. టాస్క్‌ల్లో తగ్గేదే లే అంటూ ఆడుతూ టఫ్ కాంపిటేషన్ ఇస్తున్నాడు. అంతేకాదు సమయస్ఫూర్తిగానూ వ్యవహరిస్తూ ఆడియన్సని ఆకట్టుకుంటున్నాడు. మొదటి రెండు వారాల్లోనే బయటకు వస్తాడని అనుకున్న మణికంఠ ఇప్పుడు హౌజ్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌లో ఒకడు అయ్యాడు.
Also Read: ఏ గేమ్స్ ఆడను.. బిగ్ బాస్‌పై అభయ్ అసహనం - యూ ఆర్ చీటర్ అంటూ సోనియాపై విరుచుకుపడ్డ యాష్మి