Bigg Boss Shivaji: పేరుపోతే చచ్చిపోతా - శుభశ్రీపై శివాజీ అరుపులు, అమర్‌దీప్ పెట్టిన చిచ్చుకు అల్లకల్లోలం
శివాజీకి కోపం వస్తే ఎలా ఉంటుంది అని ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 7లో పలుమార్లు ప్రేక్షకులు చూశారు. ఈసారి శుభశ్రీపై ఆయన చూపించిన కోపాన్ని తేజ కంట్రోల్ చేయాలని ప్రయత్నించినా కంట్రోల్ అవ్వలేదు.
బిగ్ బాస్ రియాలిటీ షోలో అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా ఉండకూడదని, ఉంటే టాస్కుల విషయంలో సరిగా ఆడలేరని నాగార్జున ఎన్నోసార్లు చెప్పారు. కానీ కొన్నిసార్లు అమ్మాయిల మీద చేసే కొన్ని వ్యాఖ్యలు అబ్బాయిలను ఇబ్బందుల్లోకి తోస్తాయి. తాజాగా శుభశ్రీపై శివాజీ వ్యాఖ్యలు చేశారంటూ ఆయనను వచ్చి నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య సీరియసే గొడవే జరిగింది. కంటెస్టెంట్స్ అంతా ఈ గొడవను చూస్తూ నిలబడ్డారు కానీ ఎవరూ ఆపడానికి ప్రయత్నించలేదు. తేజ మాత్రమే వచ్చి ఆపాలని చూసినా.. శివాజీ మాత్రం కోపంతో ఊగిపోయాడు. మొత్తానికి శుభశ్రీ, శివాజీ మధ్య జరిగిన ఈ గొడవ వెనుక వేరే కంటెస్టెంట్ ఉన్నట్టు తెలుస్తోంది.
శుభశ్రీపై శివాజీ అరుపులు.. ఆపే ప్రయత్నం చేసిన తేజ..
బిగ్ బాస్ ఎపిసోడ్‌లో రాని కంటెంట్ అంతా బిగ్ బాస్ బజ్‌లో ప్రసారం అవుతుంది. తాజాగా బిగ్ బాస్ బజ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది. ఇందులో ముందుగా ‘‘ఒక ఆడపిల్లను అంటానా నేను’’ అంటూ శుభశ్రీపై అరవడం మొదలుపెట్టాడు శివాజీ. ఈ అరుపులు విన్న ప్రిన్స్ యావర్, గౌతమ్, సందీప్, తేజ.. వాష్ ఏరియాలోకి వచ్చారు. శుభశ్రీ చెప్పినదానికి అర్థం అది కాదు అంటూ శివాజీకి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ‘‘అది కాదన్న అక్కడ జరిగింది’’ అని తేజ చెప్పబోతుండగా.. ‘‘వాడు.. పెంట చేసింది అమర్‌గాడు’’ అంటూ అమర్‌దీప్‌పై ఆరోపణలు చేశాడు శివాజీ. తన కోపం చూసి శుభశ్రీకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.
కంట్రోల్ తప్పుతాను..
శివాజీ కోపం చూసి అందరూ సైలెంట్‌గా నిలబడినా తేజ మాత్రం ‘‘కంట్రోల్ తప్పుతున్నావు అన్నా’’ అని హెచ్చరించాడు. ‘‘కంట్రోల్ తప్పుతాను. నా పేరు పోతే చచ్చిపోతాను నేను’’ అని శివాజీ శివతాండవం చేశాడు. ‘‘మీకు చెప్పానా నేను’’ అని చాలాసేపు తర్వాత నోరువిప్పి ప్రశ్నించింది శుభశ్రీ. తను అలా మాట్లాడుతుండగానే.. ఇప్పుడు అమర్ ముందే తేల్చుకుందామంటూ శుభశ్రీని, శివాజీని అక్కడ నుండి తీసుకెళ్లబోయాడు తేజ. ‘‘అవసరం లేదు. నేను ఎవ్వరి దగ్గరకు రాను’’ అంటూ తన చేయిను వదిలించుకున్నాడు. ప్రోమో చూడడానికి ఇంత బీభత్సంగా ఉన్నా.. అసలు గొడవ ఎందుకు మొదలయ్యింది అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.
గేమ్ కాస్త వైల్డ్‌గా మారింది..
ఈ బిగ్ బాస్ బజ్ ప్రోమోను స్టార్ మా.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసింది. ‘‘గేమ్ కాస్త వైల్డ్‌గా మారింది. బిగ్ బాస్ హౌజ్‌లోని ఓ గేమ్ సమయంలో కంటెస్టెంట్స్ తమ కంట్రోల్‌ను ఎలా కోల్పోయారో చూడండి. అరుపులు, డ్రామా, ఊహించని ట్విస్టులు అన్నీ ఈ ఎక్స్‌క్లూజివ్ వీడియోలో చూడండి’’ అనే క్యాప్షన్‌తో పాటు ఈ వీడియోను పోస్ట్ చేసింది స్టార్ మా. అసలు శివాజీ ఇంత సీరియస్ అయ్యేంత మాట అమర్‌దీప్ ఏమన్నాడు అని ప్రేక్షకులకు ఇంకా క్లారిటీ లేదు. దీని గురించి తెలియాలంటే బిగ్ బాస్ బజ్ చూడాలి లేదా నాగార్జునతో కంటెస్టెంట్స్ డిస్కషన్ అయ్యేంత వరకు ఎదురుచూడాలి అని ప్రేక్షకులు భావిస్తున్నారు.
Also Read: సందీప్‌కు గౌతమ్ 'ధమ్కీ' - ప్రియాంక కన్‌ఫ్యూజన్, పాపం టేస్టీ తేజ!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial