అన్వేషించండి

Bigg Boss Season 7 Telugu: సందీప్‌కు గౌతమ్ 'ధమ్కీ' - ప్రియాంక కన్‌ఫ్యూజన్, పాపం టేస్టీ తేజ!

బిగ్ బాస్ సీజన్ 7 తెలుగులో కెప్టెన్సీ టాస్క్ హోరాహోరీగా సాగింది. ఇందులో ధమ్కీ అనే ఒక్కమాటపై సందీప్, గౌతమ్ మధ్య సీరియస్ గొడవ మొదలయ్యింది.

బిగ్ బాస్ సీజన్ 7లో మొదటి కెప్టెన్ అవ్వడానికి టేస్టీ తేజ, సందీప్, గౌతమ్ కృష్ణ, పల్లవి ప్రశాంత్ ఇంకా ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. ఈ నలుగురిని రంగు పడుద్ది అనే టాస్క్‌తో పోటీపడమని బిగ్ బాస్ తెలిపారు. నలుగురికి ఒక్కొక్క రంగు పెయింట్‌ను బిగ్ బాస్ అందించారు. వారు తమ రంగును ఇతర కంటెస్టెంట్స్ టీ షర్ట్స్‌పై రుద్దడానికి ప్రయత్నించాలి. ఎవరి టీషర్ట్‌పై ఎక్కువ రంగు ఉంటుందో వారు తప్పుకోవాలి. అయితే ఈ టాస్కులో సంచాలకురాలిగా వ్యవహరిస్తున్న ప్రియాంకను కంటెస్టెంట్స్ అంతా కన్‌ఫ్యూజ్ చేసి ఆటను మళ్లీ మొదటికి తీసుకొచ్చారు. అంతే కాకుండా నలుగురు కెప్టెన్సీ పోటీదారుల మధ్య సీరియస్ గొడవలు కూడా జరిగాయి. ముఖ్యంగా సందీప్, గౌతమ్ మధ్య జరిగిన ధమ్కీ గొడవ.. ఎపిసోడ్‌కే హైలెట్‌గా నిలిచింది. అయితే, ప్రియాంక ఫస్ట్ గీత దాటిన టేస్టీ తేజాను మళ్లీ ఆడించేందుకు ఒకే చెప్పింది. చివర్లో సందీప్‌కు ఎక్కువ కలర్స్ అంటుకున్నాయంటూ సందీప్‌ను బయటకు పంపింది. దీంతో సందీప్ తిరగబడ్డాడు. గీత నుంచి బయటకు వెళ్లినవారు కదా ముందుకు ఔటయ్యేదంటూ వాదించాడు. దీంతో ప్రియాంక బిగ్ బాస్ అనుమతి తీసుకుని తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. టేస్టీ తేజాను బయటకు పంపి.. గౌతమ్, సందీప్, పల్లవి ప్రశాంత్ మధ్య పోటీ పెట్టింది. ఆ తర్వాత గౌతమ్, ప్రశాంత్ ఇద్దరు కలిసి సందీప్‌కు రంగులు రాశారు. దీంతో అతడు బయటకు వెళ్లాడు. చివర్లో గౌతమ్, పల్లవి ప్రశాంత్ మధ్య హోరాహోరీ జరిగింది. చివరికి ప్రశాంత్‌ను విజేతగా ప్రకటించింది ప్రియాంక.

ధమ్కీ ఇస్తావా అంటూ గౌతమ్‌పైకి వెళ్లిన సందీప్..

ముందుగా సందీప్.. ‘‘నాకు ధమ్కీ ఇస్తాడంట’’ అని అందరికీ చెప్తూ ‘రా’ అంటూ గౌతమ్‌పైకి వెళ్లాడు. ‘‘ధమ్కీ ఇవ్వు రా’’ అంటూ రెచ్చగొట్టాడు. ‘‘ధమ్కీ అంటే మొహం మీద ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని క్లారిటీ ఇచ్చాడు గౌతమ్. కానీ కోపంతో ఊగిపోతున్న సందీప్.. ‘‘ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు’’ అంటూ కోపంగా అడిగాడు. ‘‘ఈ రౌండ్‌లో నీ మీద విన్ అయ్యి చూపిస్తా’’ అని గౌతమ్ ఛాలెంజ్ చేశాడు. ‘‘ధమ్కీ అన్నావు కదా’’ అని మళ్లీ అడిగాడు సందీప్. ‘‘ధమ్కీ మరి ఇలాగే ఉంటుంది. అరుచుకుంటూనే మాట్లాడాలని కాదు’’ అని సమాధానమిచ్చాడు గౌతమ్. దానికి ‘‘భయపడ్డాను సార్’’ అంటూ ఓవరాక్షన్ చేశాడు సందీప్. 

‘‘నేను ధమ్కీ ఇస్తున్నా, డైరెక్ట్ చెప్తున్నా. ఇద్దరం కలిసి అటాక్ చేస్తాం అని చెప్తున్నాడు నాకు’’ అంటూ గౌతమ్ అన్న మాటలను శుభశ్రీతో చెప్పాడు సందీప్. ఇక మధ్యలోకి వచ్చిన గౌతమ్.. ‘‘చివరి గేమ్‌లో ఏం చేశాడో తెలుసా? మనమిద్దరం కలిసి వాళ్లని అటాక్ చేద్దాం అని సేఫ్ గేమ్ ఆడాలని అడిగాడు’’ అని బయటపెట్టాడు. దానికి సందీప్ ‘‘నువ్వు అడగలేదా’’ అని ఎదురుప్రశ్న వేశాడు. ‘‘నేనెక్కడ అడిగాను? నేను అడగలేదు’’ అని చెప్పేశాడు గౌతమ్. ‘‘నేను విడివిడిగా గేమ్ ఆడదామని చెప్పాను. ఆయన అందరికీ వచ్చి అడుగుతున్నాడు అని నీతో చెప్పలేదా’’ అంటూ ప్రశాంత్‌ను ఈ గొడవ మధ్యలోకి లాగాలని చూశాడు గౌతమ్. ఆపై తాను ఎవరిని అలా అడగలేదని క్లారిటీ ఇచ్చాడు.

డబుల్ గేమ్ అంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు..

‘‘నువ్వు తన గురించి చెప్పాలంటే ఇప్పుడు వేరేలాగా వెళ్లిపోతుంది. నేను నీలాంటి మనిషిని కాదు. బయటికి ఓపెన్ అప్ అవ్వలేదు. నువ్వు డబుల్ గేమ్ ఆడితే కరెక్ట్ కాదు’’ అంటూ శుభశ్రీ, గౌతమ్ జంటను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు సందీప్. ‘‘డబుల్ గేమ్ కాదు. అందరికీ వచ్చి అదే చెప్పావు కదా’’ అని తేజను కూడా అడగడం మొదలుపెట్టాడు గౌతమ్. కానీ సందీప్.. ఇదేమీ పట్టించుకోకుండా ‘‘డబుల్ గేమ్ గురించి కూడా వదిలేసేయ్. నువ్వు ధమ్కీ అన్నదే నాకు నచ్చలేదు. ప్రశాంత్ గట్టిగా చేతులతో కొట్టినప్పుడు కళ్లు కనబడలేదు నాకు. నేను దాని గురించి అడుగుతుంటే మధ్యలో గౌతమ్ వచ్చి నీకు ధమ్కీ ఇస్తున్న అన్నట్టు మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్?’’ అంటూ యావర్‌తో డిస్కషన్ మొదలుపెట్టాడు. ఆపై ‘‘నేను నీకంటే పెద్దవాడిని. నువ్వు ధమ్కీ ఇస్తానని ఎలా అంటావ్’’ అని గౌతమ్‌ను ప్రశ్నించాడు. ‘‘నీకు అమర్యాదగా అనిపిస్తే సారీ’’ అని టాపిక్‌కు ఎండ్ పెట్టేద్దామని అనుకున్నాడు గౌతమ్. కానీ సందీప్ మాత్రం ఆ సారీని పట్టించుకోలేదు. ఆపై గౌతమ్‌ను డాక్టర్ అంటూ మాట్లాడడం మొదలుపెట్టాడు. ప్రొఫెషన్‌ను అగౌరవంగా మాట్లాడొద్దు అంటూ సీరియస్ అయ్యాడు గౌతమ్. నేను అగౌరవంగా మాట్లాడలేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు సందీప్.

Also Read: బాలయ్య 'అన్ స్టాపబుల్' అప్డేట్ - సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడంటే?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
This Week OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP DesamAmitshah vs Rahul Gandhi Ambedkar Controversy | పార్లమెంటును కుదిపేసిన 'అంబేడ్కర్ కు అవమానం' | ABPఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
This Week OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Nandamuri Mokshagna: మోక్షు సినిమా ఆగిపోలేదు... అంతా సర్దుకున్నట్టే - ఇదిగో అప్డేట్ వచ్చింది... కాకపోతే!
మోక్షు సినిమా ఆగిపోలేదు... అంతా సర్దుకున్నట్టే - ఇదిగో అప్డేట్ వచ్చింది... కాకపోతే!
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Embed widget