Unstoppable with NBK 3: బాలయ్య 'అన్ స్టాపబుల్' అప్డేట్ - సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడంటే?
'అన్ స్టాపబుల్ విత్ NBK' టాక్ షోతో హోస్ట్ అవతారమెత్తిన బాలకృష్ణ.. సక్సెస్ ఫుల్ గా రెండు సీజన్లను పూర్తి చేసాడు. ఈ క్రమంలో సీజన్-3కి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారిగా హోస్ట్ గా వ్యవహరించిన 'అన్ స్టాపబుల్ విత్ NBK' టాక్ షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ఓటీటీ 'ఆహా' వేదికగా ప్రసారమైన ఈ కార్యక్రమం.. డిజిటల్ వరల్డ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికే రెండు సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకొని, మూడో సీజన్ కోసం రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో 'అన్ స్టాపబుల్ 3' కి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.
'అన్ స్టాపబుల్ విత్ NBK 3' కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూడో సీజన్ ఉంటుందని బాలయ్య గత సీజన్ చివరి ఎపిసోడ్ లో క్లారిటీ ఇచ్చారు. కానీ ఎప్పుడు వస్తుందనే విషయం మాత్రం వెల్లడించలేదు. అయితే తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, ఆహా టీమ్ ఇప్పటికే సరికొత్త సీజన్ కోసం సన్నాహకాలు మొదలు పెట్టిందట. అంతేకాదు బాలయ్య సైతం సీజన్-3 కి సంబంధించిన అగ్రిమెంట్ మీద సైన్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది.
'అన్ స్టాపబుల్' రెండు సీజన్లకు ఆడియన్స్ నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చిన తరుణంలో, నిర్వాహకులు ఇప్పుడు సీజన్-3 ని గట్టిగానే ప్లాన్ చేస్తున్నారట. దసరా ఫెస్టివల్ టైమ్ లో ఈ టాక్ షోని గ్రాండ్ గా లాంచ్ చేయాలని భావిస్తున్నారట. బాలయ్య నటిస్తున్న 'భగవంత్ కేసరి' సినిమా అదే సమయంలో విడుదల అవుతుంది కాబట్టి, ఫస్ట్ ఎపిసోడ్ కి దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్ శ్రీలీలా గెస్ట్ లుగా హాజరయ్యే అవకాశం వుందని అంటున్నారు.
'అన్ స్టాపబుల్' టాక్ షో బాలయ్యలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది.. దెబ్బకు అందరి థింకింగ్ ని మార్చేసింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఏమాత్రం బోర్ కొట్టకుండా సరదా సంభాషణలు, డైలాగ్స్ తో తనదైన శైలి హోస్టింగ్ తో అలరించారు.. ఈ షోని అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమాల్లో ఒకటిగా నిలిపారు. ఇక ఫస్ట్ సీజన్ లో సినీ సెలబ్రిటీలు మాత్రమే గెస్టులుగా హాజరవ్వగా.. రెండో సీజన్ లో రాజకీయ నాయకులు కూడా సందడి చేసారు. ఈ క్రమంలో సీజన్ 3లో మరికొందరు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నట్లు టాక్ నడుస్తోంది.
ఇప్పటి వరకు 'అన్ స్టాపబుల్ విత్ NBK' టాక్ షోలో మోహన్ బాబు, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో పాటుగా పలువురు యంగ్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు పాల్గొన్నారు. అలానే నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి లాంటి పొలిటిషన్స్ తో కూడా బాలయ్య చిట్ చాట్ నిర్వహించారు. రాబోయే సీజన్-3 లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, రామ్ చరణ్, కేటీఆర్ లాంటి ప్రముఖులను గెస్టులుగా తీసుకొచ్చే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఇదే నిజమైతే మూడో సీజన్ కి కూడా మంచి ఆదరణ లభించడం ఖాయమని చెప్పొచ్చు.
ఇక సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న 'భగవంత్ కేసరి' సినిమా అక్టోబర్ 19న విడుదల కాబోతోంది. దీని తర్వాత బాబీ డైరెక్షన్ లో చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. మధ్యలో వీలుకుదిరినప్పుడల్లా ఆహా ఓటీటీ కోసం 'అన్ స్టాపబుల్ విత్ NBK' సీజన్ 3 షూటింగ్ లో పాల్గొననున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడికానున్నాయి.