అన్వేషించండి

Bigg Boss Season 7 Day 71 Promo : మోటీవేట్ చేసిన శివాజీ, రెచ్చిపోయిన రతిక.. శోభా కెప్టెన్సీపై విరుచుకుపడ్డ కంటెస్టెంట్స్

Bigg Boss Season 7 Nominations Promo : బిగ్​బాస్ సీజన్ 7.. 71వ తేదీ నామినేషన్స్ ప్రోమో తాజాగా విడుదలైంది. రతిక, అర్జున్ శోభాపై ఓ రేంజ్​లో ఫైర్​ అయ్యారు.

Bigg Boss Season 7 Day 71 Promo : బిగ్​బాస్​ సీజన్ 7 దీపావళి స్పెషల్ ఎపిసోడ్ అంగరంగ వైభవంగా జరిగింది. కంటెస్టెంట్ల ఫ్రెండ్స్, ఫ్యామిలీ బిగ్​బాస్ వేదికపైకి వచ్చి.. తమ వారితో మాట్లాడుకున్నారు. సలహాలు ఇచ్చారు. వచ్చినవారితో నాగార్జున బిగ్​బాస్ సీజన్ 7 టాప్ 5 ఎవరంటూ గేమ్ ఆడించారు. వచ్చినవారందరూ శివాజీ టాప్​ 5లోనే ఉంచారు. నిన్న భోళే షావల్ ఇంటిని విడిచి వెళ్లాల్సి వచ్చింది. అయితే హాయిగా ఉన్న హౌజ్​లో నామినేషన్స్ వేడి మొదలైంది. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.

బిగ్​బాస్​ హౌజ్​లో ఆదివారం ఫన్​ అంతా.. సోమవారం ఫైర్​గా మారుతుంది. నామినేషన్ల ప్రక్రియ నువ్వానేనా అనే రేంజ్​లో సాగుతుంది. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో శివాజీ.. రతికకు తను తీసుకోవాల్సిన స్టాండ్​పై సలహాలు ఇచ్చాడు. నువ్వు ఏమనుకుంటావో నాకు తెల్వదు. నామినేషన్​లో మాత్రం నసుగుతూ పాయింట్లు చెప్పడం కాదు.. నీ టాలెంట్ చూపించు. ఆలోచించుకుని అవతలి వాడు నిన్ను డిఫెండ్ చేసేటప్పుడు నిన్ను రివర్స్ క్వశ్చన్ చేసే అవకాశం ఇవ్వకుండా చూసుకో. ఇక్కడనుంచి మొదలుపెడితే.. గేమ్ అయిపోయి.. గేమ్ ఎండ్ డేట్ వరకు కూడా.. ఆపకు అంటూ శివాజీ మోటీవేషన్ ఇచ్చారు. 

మోటీవెషన్​ ఎంతవరకు పనిచేసుందో తెలియదు కానీ నామినేషన్​లో రతిక రెచ్చిపోయింది. బిగ్​బాస్​ ఈ వారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభించండి అంటూ ఎనౌన్స్ చేశారు. నామినేట్ చేసే వారు.. కారణాలు చెప్పిన తర్వాత నామినేట్ అవ్వబడ్డవారి తలపై బాటిల్​ని పగలగొట్టాల్సి ఉంటుందని చెప్పారు. ఈ ప్రక్రియలో రతిక.. శోభా, ప్రియాంకు నామినేట్ చేసినట్లు చూపించారు. నామినేషన్ ప్రక్రియకు వచ్చిన రతిక.. శోభా శెట్టి.. కెప్టెన్ అయిన తర్వాత నువ్వు నీ వందశాతం గేమ్ ఇచ్చాను అనుకుంటున్నావా అని ప్రశ్నించగా.. నేను 200 శాతం గేమ్​కి నా ఎఫర్ట్స్ పెట్టాను అని శోభా బదులిచ్చింది. ఫిగర్స్​లో చెప్పడం కాదు.. ఏమి చేశావో అది చెప్పు అంటూ రతిక గట్టిగా ప్రశ్నించింది. నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదని శోభా చెప్తుండగా.. కెప్టెన్​ అంటే బ్యాడ్జ్ పెట్టుకుని తిరగడం కాదని తెలిపింది.

తర్వాత వచ్చిన అర్జున్ కూడా శోభాను నామినేట్ చేశాడు. నువ్వు కిచెన్​లో ఉన్నావా అంటూ శోభను ప్రశ్నించాడు. నేను లేనా అంటూ శోభా రివర్స్ క్వశ్చన్ చేసింది. లేవు అంటూ అర్జున్ రిప్లై ఇచ్చాడు. నువ్వసలు వీఐపీ రూమ్ దాటి వచ్చావా అని ప్రశ్నించాడు. మార్నింగ్ లేచి లంచ్ చేసి.. బ్రేక్​ఫాస్ట్ చేసి మళ్లీ అక్కడే పడుకున్నాను అంటూ వెటకారంగా సమాధానం ఇచ్చింది. ఈ తింగరి సమాధానాలే వద్దు అంటూ అర్జున్ తెలిపాడు. మధ్యలో అమర్ వచ్చాడు.

చాలావరకు చెప్పిన పనులు ఎవరూ చేయలేదంటూ సమర్థించుకోగా.. అలా చెప్పకు అంటూ అర్జున్ అమర్​కు సైగ చేశాడు. 
తనేమో టీచర్​.. తను అడిగిన ప్రతిదానికి ఆన్సర్​ చెప్పాలా అంటూ ప్రియాంక రతికను ఉద్దేశించి చెప్తుండగా.. ప్రియాంక ఆన్సర్​ టూ మై క్వశ్చన్​ అంటూ రతిక పెద్దగా అరిచింది. అర్జున్ పల్లవి ప్రశాంత్​ను కూడా నామినేట్ చేశాడు. నువ్వు నీ సొంతంగా ఎప్పుడైనా నామినేషన్ వేశావా అంటూ అర్జున్​ ప్రశాంత్​ను ప్రశ్నించాడు. అన్నా అది నీకు తెలియాలి అంటూ ప్రశాంత్ రిప్లై ఇచ్చాడు. వేసినోడివి నువ్వు కదా.. నువ్వు చెప్పు అంటూ అర్జున్ అరిచాడు.  ఇప్పుడు నువ్వు గేమ్స్ ఇలా ఆడాలి.. అలా ఆడాలి అని శివాజీ అన్న చెప్తున్నాడా? చెప్పట్లేగా? అంటూ ప్రశాంత్​ను నామినేట్ చేశాడు. దీంతో ప్రోమో ముగిసింది. నామినేషన్​లో ఎవరున్నారో.. ఎలాంటి పాయింట్లు తీశారో సాయంత్రం ఎపిసోడ్​లో తెలుస్తుంది. 

Also Read : ఆ డాక్టర్ బాబు తమ్ముడే, ఈ మోనితా లవర్ - మొత్తానికి బయటపెట్టేశారుగా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manmohan Singh Death: మన్మోహన్ సింగ్‌ మృతి- 7 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం
Manmohan Singh Death: మన్మోహన్ సింగ్‌ మృతి- 7 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Steve Smith Records: అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manmohan Singh Death: మన్మోహన్ సింగ్‌ మృతి- 7 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం
Manmohan Singh Death: మన్మోహన్ సింగ్‌ మృతి- 7 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Steve Smith Records: అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Embed widget