అన్వేషించండి

Shobha Shetty Boyfriend: ఆ డాక్టర్ బాబు తమ్ముడే, ఈ మోనితా లవర్ - మొత్తానికి బయటపెట్టేశారుగా!

Bigg Boss Telugu 7 : ‘కార్తీక దీపం’ సీరియల్‌తో మోనిత పాత్రతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శోభా.. లవర్ ఎవరో తెలిసిపోయింది. అతడి గురించి తెలిస్తే మీరూ షాకవుతారు.

‘బిగ్ బాస్’ సీజన్ 7లో ఆదివారం దీపావళి స్పెషల్‌తో నాగార్జున అలరించారు. గెస్టులతోనే కాదు.. హౌస్‌మేట్స్ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా స్టేజ్ మీదకు వచ్చి ఆకట్టుకున్నారు. అయితే, శోభాశెట్టికి మాత్రం ఈ ఎపిసోడ్ చాలా స్పెషల్. ఇన్నాళ్లూ బయట చెప్పకుండా తనలోనే దాచుకుంటున్న సీక్రెట్‌ను.. ‘బిగ్ బాస్’ బయటపెట్టేశాడు. దీపావళి స్పెషల్ షోకు ఆమె తండ్రితోపాటు ఆమె బాయ్‌ఫ్రెండ్‌ కూడా వచ్చాడు. దీంతో శోభా షాకైంది. అంతేకాదు, ఈ షో చూసిన ప్రేక్షకులు కూడా అతడిని చూసి షాకయ్యారు. ఎందుకంటే.. ఆ వ్యక్తి మరెవ్వరో కాదు.. పాపులర్ సీరియల్ ‘కార్తీక దీపం’ సీరియల్‌లో డాక్టర్ బాబు నిరుపమ్‌కు సోదరుడిగా నటించిన యశ్వంత్‌. 

టీవీ ప్రేక్షకులకు శోభా శెట్టి అంటే పెద్దగా తెలియదు. మోనితా అంటేనే ఆమెను గుర్తుపడతారు. వంటలక్క తర్వాత అంత పేరు వచ్చిన పాత్ర అది. తన విలనిజంతో అమ్మలక్కల తిట్లు తిన్న మోనిత.. ఇప్పుడు ‘బిగ్ బాస్’లో శోభా శెట్టిగా తన లక్ పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బిగ్ బాస్‌లో కూడా ఆమె మోనితాలాగే ఉంటుందని బయట టాక్. ఆ విషయాన్ని పక్కన పెడితే.. షో ఆరంభం నుంచి శోభా శెట్టి.. టేస్టీ తేజాతో క్లోజ్‌గా ఉండేది. అయితే, తేజా చాలాసార్లు ఆమెకు పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రపోజ్ చేశాడు. ఆమె తనతో పెళ్లికి ఓకే చెబితే టాటూ కూడా వేయించుకుంటానని చెప్పేవాడు.

అయితే, శోభా మాత్రం సరదాగా నవ్వి ఊరుకొనేదే గానీ.. పెద్దగా స్పందించేది కాదు. కానీ, మధ్యలో ఓసారి.. తేజాతో మాట్లాడుతూ తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పింది. తేజాతో క్లోజ్‌గా ఉంటున్నందుకు అతడు ఏమైనా అనుకుంటాడేమో అని కలత చెందింది. అయితే, తేజా ఈ విషయాన్ని చాలా లైట్ తీసుకున్నాడు. ‘‘నేను కామెడీ పీస్‌ను. అంత సీన్ లేదు’’ అని క్లారిటీ ఇచ్చాడు. అయితే, అప్పటి నుంచి శోభా బాయ్ ఫ్రెండ్ ఎవరా అని ప్రేక్షకులు ఆరా తీయడం మొదలుపెట్టారు. మరి, బిగ్ బాస్‌కు కూడా ఈ విషయం తెలిసిందో ఏమిటో.. ఏకంగా అతడినే స్టేజ్ మీదకు తీసుకొచ్చి నిలబెట్టాడు. ‘కార్తీక దీపం’ సీరియల్ అభిమానులు కూడా యశ్వంత్‌ను చూడగానే ఆశ్చర్యపోయారు. అంటే డాక్టర్ బాబు తమ్ముడు.. నిజ జీవితంలో మోనితాకు బాయ్ ఫ్రెండ్ అన్నమాట అని మాట్లాడుకుంటున్నారు. 

సీరియల్ తర్వాత ఫ్రెండ్ షిప్

‘కార్తీకదీపం’ సీరియల్ ముగిసిన తర్వాత కూడా వీరి స్నేహం కొనసాగింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. శోభా శెట్టి స్వయంగా యశ్వంత్‌కు ప్రపోజ్ చేసిందట. అప్పటికే యశ్వంత్ కూడా అదే ఫీల్‌తో ఉండటంతో ఆమెకు ఒకే చెప్పేశాడట. ఏడాది కిందట వీరిద్దరు జంటగా ‘బుజ్జి బంగారం’ అనే వీడియో సాంగ్ ఆల్బమ్ వచ్చింది. అది అప్పట్లో మంచి హిట్ కొట్టింది. ఆ తర్వాత శోభా పెద్దగా అతడి గురించి బయట మాట్లాడేది కాదు. అయితే, ఆమె యూట్యూబ్ వ్లాగ్స్‌లో ఒకసారి యశ్వంత్ హోమ్ టూర్ చేసింది. అప్పుడే చాలామంది.. వారిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అని అనుకున్నారు. కానీ, శోభా మాత్రం ఈ విషయం బయటపెట్టలేదు. మొత్తానికి శోభా లవర్‌ను బీబీ ప్రేక్షకులు చూసేశారు. ఇన్ని రోజులు తేజాతో లవ్ ట్రాక్.. కేవలం మైలేజీ కోసమేనని స్పష్టమైపోయింది. ఈ విషయాన్ని పక్కన పెడితే.. యశ్వంత్ బీబీ స్టేజ్ పై నుంచి మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చాడు. కానీ, శోభా మారుతుందో లేదో చూడాలి. 

Also Read: కంటి చూపుతోనే మా వాడిని కంట్రోల్ చేస్తుంది, ఆ కామెంట్స్ చూసి తట్టుకోలేకపోయా, అమర్ దీప్ తల్లి షాకింగ్ కామెంట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Deepfake Scam: డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
Embed widget