అన్వేషించండి
Advertisement
Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ సేఫ్, శ్రీరాపాక అవుట్
ఫైనల్ గా నటరాజ్ మాస్టర్, శ్రీరాపాక నామినేషన్ లో మిగిలి ఉండగా.. అందరూ ఊహించినట్లుగానే శ్రీరాపాక ఎలిమినేట్ అయింది.
బిగ్ బాస్ ఓటీటీ తెలుగు వెర్షన్ మొదలై రెండు వారాలవుతోంది. మొదటి వారంలో ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కాగా.. ఈ వారం ఎలిమినేట్ అవ్వడానికి మొత్తం పదకొండు మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ కానున్నారో కాసేపట్లో తెలియనుంది. ఆదివారం నాడు ఎప్పటిలానే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు నాగార్జున. ముందుగా హౌస్ మేట్స్ లో కొంతమందికి క్లాస్ పీకారు నాగార్జున.
ఆ తరువాత నామినేషన్ లో ఉన్న వారితో పలు టాస్క్ లు ఆడించి డేంజర్ జోన్ లో మిత్రా, శ్రీరాపాక, నటరాజ్ మాస్టర్ లను పెట్టారు. వారు ముగ్గురికి ఎగ్స్ టాస్క్ ఇచ్చి గేమ్ ఆడించగా.. మిత్రా సేఫ్ అని వచ్చింది. ఫైనల్ గా నటరాజ్ మాస్టర్, శ్రీరాపాక నామినేషన్ లో మిగిలి ఉండగా.. అందరూ ఊహించినట్లుగానే శ్రీరాపాక ఎలిమినేట్ అయింది. కానీ ఆమె ఎంతమాత్రం బాధ పడకుండా నవ్వుతూ హౌస్ నుంచి బయటకు వెళ్లింది.
స్టేజ్ పైకి వెళ్లిన శ్రీరాపాకతో గేమ్ ఆడించారు నాగార్జున. హౌస్ లో ఎవరిని నమ్మొచ్చో, నమ్మకూడదో చెప్పాలని అడిగారు. అషురెడ్డి, తేజస్వి, బిందు, అఖిల్, ఆర్జే చైతులను నమ్మొచ్చని చెప్పింది. స్రవంతి, మిత్రా, అజయ్ లకు అన్ ట్రస్ట్ ఇచ్చింది. అరియనా కాన్ఫిడెంట్ గా ఉంటుందని.. నటరాజ్ మాస్టర్ చాలా ఎమోషనల్ అని, సరయు హానెస్ట్ గా ఉంటుందని చెప్పింది.
Shree Rapaka..... Eliminated! Mee thoughts enti? #BiggBoss #BiggBossTelugu #BjggBossNonStop@DisneyPlusHS @EndemolShineIND @iamnagarjuna pic.twitter.com/Ens6iidWHL
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) March 13, 2022
Shree Rapaka's 'Trust vs. Do Not Trust'.
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) March 13, 2022
Do you agree with her opinions?#BiggBoss #BiggBossTelugu #BiggBossNonStop@DisneyPlusHS @EndemolShineIND @iamnagarjuna
Fashion check!
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) March 13, 2022
Who's the best dressed housemate this week?#BiggBoss #BiggBossTelugu #BiggBossNonStop@DisneyPlusHS @EndemolShineIND @iamnagarjuna
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
న్యూస్
క్రైమ్
విజయవాడ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion