Bigg Boss OTT Telugu: అరియనా, శివ సేఫ్ - అందరూ టార్గెట్ చేస్తున్నారంటూ ఎమోషనల్ అయిన మిత్రా
హౌస్ మేట్స్ లో కొంతమందికి క్లాస్ పీకారు నాగార్జున. ఆ తరువాత నామినేషన్ లో ఉన్న వారితో ఒక టాస్క్ ఆడించారు.
![Bigg Boss OTT Telugu: అరియనా, శివ సేఫ్ - అందరూ టార్గెట్ చేస్తున్నారంటూ ఎమోషనల్ అయిన మిత్రా Bigg Boss OTT Telugu: Ariyana, Siva safe from elimination Bigg Boss OTT Telugu: అరియనా, శివ సేఫ్ - అందరూ టార్గెట్ చేస్తున్నారంటూ ఎమోషనల్ అయిన మిత్రా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/13/39c3b5f4b77280adc94bd76c52deac1d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
బిగ్ బాస్ ఓటీటీ తెలుగు వెర్షన్ మొదలై రెండు వారాలవుతోంది. మొదటి వారంలో ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కాగా.. ఈ వారం ఎలిమినేట్ అవ్వడానికి మొత్తం పదకొండు మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ కానున్నారో కాసేపట్లో తెలియనుంది. ఆదివారం నాడు ఎప్పటిలానే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు నాగార్జున.
ముందుగా హౌస్ మేట్స్ లో కొంతమందికి క్లాస్ పీకారు నాగార్జున. ఆ తరువాత నామినేషన్ లో ఉన్న వారితో ఒక టాస్క్ ఆడించారు. ఇందులో అషురెడ్డి, అఖిల్ లకు సేఫ్ అని వచ్చింది. అనంతరం హౌస్ మేట్స్ తో రెడ్ రోజ్, బ్లాక్ రోజ్ టాస్క్ ఆడించారు నాగార్జున. ఆ తరువాత నామినేషన్స్ లో మిగిలిన వారిని నుంచోమని చెప్పిన నాగార్జున.. చిలకజోస్యం టాస్క్ ఇచ్చారు.
ఇందులో యాంకర్ శివ, అరియానా సేఫ్ అని అనౌన్స్ చేశారు. హౌస్ మేట్స్ అందరూ తనకు బ్లాక్ రోజెస్ ఇవ్వడంతో మిత్రా బాగా ఎమోషనల్ అయింది. దీంతో నాగార్జున ఆమెని కూల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ మిత్రా మాత్రం తన ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఆ తరువాత తేరుకొని గేమ్ కంటిన్యూ చేస్తూ.. మహేష్ కి రెడ్ రోజ్ ఇచ్చింది మిత్రా. తనను హౌస్ లో బాగా అర్ధం చేసుకునేది ఆయననేనని చెప్పింది. బ్లాక్ రోజ్.. ఆర్జే చైతుకి ఇచ్చింది.
Also Read: 'ది కశ్మీర్ ఫైల్స్' ప్రధాని మోదీ మెచ్చిన సినిమా, అంతగా ఏముందంటే?
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)