Samantha: వేసుకున్న డ్రెస్‌ను బట్టి స్త్రీలను జడ్జ్ చేయడం ఇక ఆపండి, సమంత గట్టిగా ఇచ్చిపడేసిందిగా
సమంత మళ్లీ వార్తల్లోకి వచ్చింది. నెటిజన్లకు గట్టిగా ఇచ్చి పడేసింది.
చైతూతో విడాకులు తీసుకున్నప్పట్నించి సమంత ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. నెటిజన్లు ఆమెను ట్రోల్ చేసిన సందర్భాలు ఎక్కువే. ఇప్పుడు మరోసారి ఆమె ట్రోలింగ్ బారిన పడింది. ఆ ట్రోలింగ్ కు ఆమె భయపడలేదు. అంతే ధీటుగా సమాధానం ఇచ్చింది. కామెంట్ చేసిన నెటిజన్లను ఉద్దేశించి పరోక్షంగా ‘మీ పని మీరు చేసుకోండి’ అని గట్టిగా సమాధానం ఇచ్చింది.
అసలేం జరిగింది?
రెండు రోజుల క్రితం సమంత ముదురు ఆకుపచ్చ గౌనులో ఉన్న ఫోటోలను పోస్టు చేసింది. ఆ గౌను పొడవుగా ఉన్నప్పటికీ చాలా డీప్ నెక్‌తో ఉంది. ఆ డ్రెస్‌ను క్రిటిక్స్ చాయిస్ ఫిల్మ్ అవార్డుల ఫంక్షన్లో వేసుకుంది. ఇది నాకు నచ్చిన లుక్ అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో ఫోటోలు కూడా పోస్టు చేసింది. ఆ గౌనుకు డీప్ నెక్ ఉండడంతో నెటిజన్లు మండి పడ్డారు. ఆమె డ్రెస్సింగ్ పై తీవ్రంగా కామెంట్లు చేశారు. దీనిపై సమంత కూడా ఘాటుగానే స్పందించింది.
సమంత ఏమంది?
‘ఒక స్త్రీగా జడ్జింగ్‌కు గురవ్వడం అంటే ఏమిటో నేను భరించాను. స్త్రీలు వేసుకున్న దుస్తులు, వారి చదువు, సామాజిక స్థితి, రూపు రేఖలు, రంగు... ఇలా ఈ జాబితా పెద్దదే. వీటిని బట్టి వారిపై కామెంట్లు చేయడం, వివక్ష చూపించడ చేస్తుంటారు. వేసుకున్న దుస్తులను బట్టి స్త్రీని జడ్జ్ చేయడం చాలా సులువైన పని. అందుకే చాలా ఈజీగా చేసేస్తుంటారు. మనం 2022లో ఉన్నాం. ఇప్పటికీ స్త్రీలను జడ్జ్ చేయడం మానరా? స్త్రీలపై కామెంట్లు చేయడం మాని మన పని మనం చేసుకోలేమా? మీ అభిప్రాయాలు రుద్దడం వల్ల ఒరిగేదేమీ లేదు’ అంటూ తన ఇన్‌స్టా స్టేటస్లో పెట్టింది. తనపై వచ్చిన ట్రోలింగ్ విషయంలోనే ఆమె అలా స్పందించింది. ఇకనైనా సమంతను ట్రోల్ చేయడం ఆపుతారో ఆపరో చూడాలి.
View this post on Instagram