Bigg Boss OTT Telugu: అఖిల్ పై అరిచిన బిందు, ఆమెని బూతులు తిట్టిన అజయ్
అఖిల్.. బిందుని అసలు మీరు ఎన్ని సార్లు పోటీదారులయ్యారని అడిగాడు. దానికి బిందు.. తనకు ఫాలోవర్స్ అవ్వలేదని, తనను మొదటినుంచి టార్గెట్ చేశారంటూ మాట్లాడింది.
బిగ్ బాస్ నాన్ స్టాప్ తెలుగు షో నాల్గో వారం పూర్తి చేసుకోబోతుంది. ఇప్పటివరకు ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఆదివారం ఎపిసోడ్ లో మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు. ప్రస్తుతం హౌస్ లో కెప్టెన్సీ కి సంబంధించిన టాస్క్ లు జరుగుతున్నాయి. సంచాలక్ అయిన అరియానా ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తోంది. టాస్క్ ప్రకారం.. బెల్ కొట్టే ఛాన్స్ వచ్చిన వాళ్లు గుర్రంపై ఉన్న వారిని జ్యూస్ తాగించి మరీ సంచాలక్ తో ఎలిమినేట్ చేయమని కోరుతున్నారు.
ఫైనల్ గా నటరాజ్ మాస్టర్, అజయ్, యాంకర్ శివ మాత్రమే మిగిలారు. నిన్న రాత్రి ఎండ్ అయిన ఈ టాస్క్ ను ఉదయాన్నే మొదలుపెట్టారు. కంటెస్టెంట్ బిందు మాధవి.. తన ఫ్రెండ్ యాంకర్ శివకి సపోర్ట్ చేస్తుండగా.. అఖిల్.. అజయ్ కి సపోర్టింగ్ గా నిలిచాడు. దీంతో అఖిల్, బిందు మాధవిల మధ్య మాటల యుద్ధం జరిగింది. బిందు మాధవి.. అఖిల్ పై విరుచుకుపడింది. అఖిల్ లాజికల్ గా మాట్లాడడంతో బిందు మాధవి ఎమోషనల్ గా అతడిని డౌన్ చేయాలని చూసింది.
దీంతో అఖిల్.. బిందుని అసలు మీరు ఎన్ని సార్లు పోటీదారులయ్యారని అడిగాడు. దానికి బిందు.. తనకు ఫాలోవర్స్ అవ్వలేదని, తనను మొదటినుంచి టార్గెట్ చేశారంటూ మాట్లాడింది. దీంతో అఖిల్, బిందులకు గొడవ జరిగింది. నేనెప్పుడూ సేఫ్ గేమ్ ఆడనని అఖిల్ చెప్పగా.. అసలు నువ్ ఏదీ ఆడవు అంటూ రెచ్చిపోయింది బిందు. అఖిల్ ఫ్రెండ్స్ సపోర్ట్ తో బతుకుతున్నాడని.. ఫ్రెండ్స్ లేకపోతే అతడు హౌస్ లో ఉండలేడని చాలా మాటలు అనేసింది బిందు.
దీనికి హర్ట్ అయిన అఖిల్.. వీళ్లతో ఇన్ని మాటలు పడడానికి నేనొచ్చానా..? అంటూ ఎమోషనల్ అయిపోయాడు. దీంతో అజయ్.. బిందుపై ఫైర్ అయ్యాడు. నావల్ల వాడు బతుకుతున్నాడు అని చెప్పావ్ , నా వల్ల వాడు బతకడం లేదు అంటూ బిందుపై మండిపడ్డాడు. దీంతో బిందు కూడా అజయ్ పై అరిచింది. ఈ క్రమంలో అజయ్ మరింత గట్టిగా అరుస్తూ.. బిందుని తిట్టాడు. బూతులు మాట్లాడడంతో బీప్స్ కూడా పడ్డాయి.
Also Read: రామ్ చరణ్‌ను చూసి గర్వపడుతున్నా, మా బావ ఎన్టీఆర్ పవర్ హౌస్! - 'ఆర్ఆర్ఆర్'కు బన్నీ రివ్యూ
https://t.co/Hg2cNwRQHv
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) March 26, 2022
Kanta thadi pettukunna Akhil Sarthak!
Watch the intense episode at 9PM exclusively on @DisneyPlusHS!#BiggBoss #BiggBossTelugu #BiggBossNonStop @EndemolShineIND