Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 9 రివ్యూ - అంతా వేస్ట్... ఎవ్వరికీ అర్హత లేదంటూ స్టేజ్ మీద నుంచి వెళ్లిపోయిన జడ్జ్‌లు
Bigg Boss Agnipariksha: అంట్లు తోమడం, బట్టలు మడతపెట్టడం, చెత్త ఊడ్చడం అనే టాస్క్‌లతో బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 9 చాలా చెత్తగా సాగింది. ఆఖరికి విసుగు వచ్చి జడ్జ్‌లు కూడా లేచి వెళ్లిపోయారు.

Bigg Boss Agnipariksha - Episode 9 Review: బిగ్ బాస్ అగ్ని పరీక్షలో భాగంగా శనివారం నాడు జరిగిన ఎపిసోడ్‌లో ఇంట్రెస్టింగ్ ఘటనలు జరిగాయి. ఒకటి అనుకుని చేస్తే.. ఇంకోటి జరిగినట్టుగా ఎపిసోడ్ ప్రారంభంలోనే కంటెస్టెంట్లకు దెబ్బ పడినట్టుగా అనిపిస్తుంది. స్టార్ ప్లేయర్ అయిన నాగకి జ్యూరీ ఓ పని అప్పజెప్పింది. పన్నెండు బాక్సుల్ని తీసుకు వచ్చి.. అందులో మూడు మాత్రమే లీడర్ బాక్సుల్ని పెట్టింది.. ఆ పన్నెండు బాక్సుల్ని 12 మందికి పంచమని, కావాలంటే ఒక బాక్సు తీసుకోమని నాగకు చెప్పింది. ఆ బాక్సులో ఏముందో చూసి ఇచ్చుకోవచ్చని మరో ట్విస్ట్ పెట్టింది.
దీంతో నాగ ప్రతీ బాక్సుని చూసి ఒక్కో కంటెస్టెంట్‌కు ఇచ్చాడు. పదో నంబర్ బాక్సుని మాత్రం నాగ తన వద్దే పెట్టుకున్నాడు. ఇక పన్నెండు బాక్సులు పంచిపెట్టిన తరువాత అసలు ట్విస్ట్‌ను రివీల్ చేశారు జ్యూరీ మెంబర్లు. ఒకటో నంబర్ నుంచి పన్నెండో నంబర్ వరకు ఒక్కొక్కరినీ అడుగుతూ స్వాపింగ్‌కు అవకాశం ఇచ్చారు. ఒకటో నంబర్ బాక్స్ హరీష్‌కి వచ్చింది. హరీష్ తన బాక్స్ తన వద్దే ఉంచుకుంటాను.. ఎవ్వరితోనూ స్వాప్ చేయను అని అన్నాడు. రెండో నంబర్ వచ్చిన శ్రీజ, మూడో నంబర్ వచ్చిన ప్రసన్న ఇలా ఎవ్వరూ స్వాపింగ్ చేసుకోలేదు.
మళ్లీ శ్రీజకు డౌట్ వచ్చి.. నాగ వద్ద ఉన్న బాక్సుని శ్రీజ తీసుకుంది. అలా మళ్లీ శ్రీజ నుంచి నాగ వరకు ఆ బాక్సు వెళ్లింది. మళ్లీ నాగ నుంచి ప్రియా ఆ బాక్సుని తీసుకుంది. ఇలా స్వాపింగ్ తరువాత చివరకు ప్రసన్న, దాల్య, ప్రియా బాక్సుల్లో లీడర్ బ్యాడ్జ్‌లు వచ్చాయి. నాగ వదిలేసిన మనీష్, షాకిబ్, పవన్‌లు ఆటలో అరటి పండ్లలా మిగిలిపోయారు. ఇక ప్రసన్న రెడ్ టీంలోని మెంబర్లుగా అనూష, శ్వేత, దివ్యను తీసుకున్నాడు. దాల్య బ్లూటీం మెంబర్లుగా.. శ్రీజ, శ్రియా, హరీష్‌ని తీసుకుంది. ప్రియా ఎల్లో టీం మెంబర్లుగా.. కళ్యాణ్ పడాల, కల్కి, నాగలను తీసుకుంది.
ఈ మూడు టీంలకు మనీష్, షాకిబ్, పవన్‌లు సంచాలక్‌లుగా మారారు. ఎల్లో టీంకి పవన్, రెడ్ టీంకి షాకిబ్, బ్లూ టీంకి మనీష్ సంచాలక్‌లుగా ఫిక్స్ అయ్యారు. అయితే అంట్లు తోమడం, బట్టలు మడతపెట్టడం, చెత్త ఊడ్చడం అనే టాస్కుల్ని ఇచ్చారు. ఇందులో మొదటగా అంట్లు తోమే టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్‌ని సంచాలక్‌లకు సంతృప్తి చెందితేనే నెక్ట్స్ టాస్క్ మొదలవుతుందని చెప్పారు. అలా సంచాలక్‌కు ఓకే అంటేనే నెక్ట్స్ టాస్కుకి వెళ్లాల్సి ఉంటుంది. అంట్లు తోమేందుకు పవన్, అనూష ఇలా ఒంటరిగా టాస్కు ఆడితే.. దాల్య శ్రియా కలిపి ఆ టాస్కుని ఆడారు.
బట్టలు మడతపెట్టే టాస్కుని నాగ, ప్రియా, ప్రసన్న ఆడారు. కల్కి, దాల్య, హరీష్ చెత్తను క్లీన్ చేసే టాస్కుని ఆడారు. ఇక ప్రతీ స్టేజ్‌లో సంచాలక్‌లు, కంటెస్టెంట్లు తప్పులు చేస్తూనే వచ్చారు. ఇక చెత్త క్లీన్ చేసే టాస్కులో చివరకు శ్రీజ, హరీష్ కలిపి ప్రత్యర్థి టీం ప్లేస్‌లో చెత్తను వేశారు. వాళ్లు అప్పటికే టాస్కు పూర్తి చేసి గంటను కొట్టినా కూడా మళ్లీ చెత్తను వేశారు. దీంతో అక్కడ పెద్ద గొడవ జరిగింది. ఇక ఈ టాస్కు అంతా పూర్తి అయిన తరువాత జడ్జ్‌లు సంచాలక్‌లు, కంటెస్టెంట్ల మీద ఫైర్ అయ్యారు.
సంచాలక్‌లు వేస్ట్.. ఒక్కటి కూడా సరిగ్గా చూడలేదు.. మళ్లీ ఫెయిల్ అయ్యారు.. అంటూ మనీష్, షాకిబ్, పవన్‌లు తిట్టేశారు. గంట కొట్టిన తరువాత చెత్త వేయడం ఏంటి?.. శ్రీజకు శ్రీముఖి చురకలు అంటించింది. షర్ట్ విప్పి ఎలా క్లీన్ చేస్తావ్ హరీష్.. అంటూ శ్వేత ప్రశ్నించింది. అక్కడ రెండు టీంలు వాగ్వాదానికి దిగాయి. ఇక ఎల్లో టీం టాస్క్ పూర్తి చేసినా కూడా సంచాలక్‌ల నిర్లక్ష్యం వల్ల ఏ టీంని విన్నింగ్‌ను ప్రకటించడం లేదు అని శ్రీముఖి బాంబ్ పేల్చింది. ఈ రోజు విన్నింగ్ టీం లేదు.. వాల్యబుల్ ప్లేయర్ లేడు.. ఓటింగ్ అప్పీల్ కూడా లేదు అని అన్నారు. ఇక వీళ్లకు ఎల్లో కార్డు ఇచ్చి కూడా వృథానే.. ఎల్లో కార్డుకి కూడా వాళ్లు అనర్హులు.. అంతా వేస్ట్.. అంటూ నవదీప్ వెళ్లిపోయాడు. అతని వెంటే బిందు, అభిజిత్, శ్రీముఖి కూడా వెళ్లిపోయారు. మరి రేపటి ఎపిసోడ్‌లో ఎలాంటి డ్రామాను క్రియేట్ చేస్తారో చూడాలి.





















