Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఎపిసోడ్ 8 రివ్యూ... పరమ బోరింగ్... మనీష్‌కు ఎల్లో కార్డ్ - బయటకు పంపించేస్తారా?
Bigg Boss Agnipariksha: కామనర్స్‌ని హౌస్‌లోకి పంపే క్రమంలో జరుగుతున్న బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఎపిసోడ్ 8 చాలా చప్పగా సాగింది. ఇంకా చెప్పాలంటే పరమ బోరింగ్ అనేలా నడిచింది. అసలీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

Bigg Boss Agnipariksha - Episode 8 Review: బిగ్ బాస్ అగ్నిపరీక్షలో భాగంగా శుక్రవారం జరిగిన 8వ ఎపిసోడ్ అత్యంత పరమ బోరింగ్‌గా సాగింది. ఎవరికి ఎంత లక్ ఉంది? అనేది పరీక్షిద్దామంటూ పెట్టిన టాస్క్ అయితే జనాలను ఆకట్టుకునేలా కనిపించలేదు. కాకపోతే కంటెస్టెంట్లలో ఎవరు చురుగ్గా ఉన్నారు? ఎవరికి తెలివి ఉంది? టైం వచ్చినప్పుడు ఎవరెలా ప్రవర్తిస్తారు? అన్నది మాత్రం బయటకు వచ్చింది. అసలు ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం.
బాక్సులో ఉన్న వాటిని తీసుకోవాలని కంటెస్టెంట్లకు శ్రీముఖి చెప్పింది. ఒక్కొక్కరు వచ్చి ఆ బాక్సులో ఉన్న ఫ్రూట్స్ నుంచి ఏదో ఒకటి తీసుకుంటూ వచ్చారు. అలా గ్రీన్ ఆపిల్స్‌ను చేతిలోకి తీసుకున్న నాగ, మనీష్, షాకిబ్‌లు ఈ రోజు ఆడే టాస్కులకు లీడర్స్ అని చెప్పారు. ఆ తరువాత ఆ ముగ్గురు కూడా జడ్జ్‌ల వద్ద ఉన్న కార్డులను సెలెక్ట్ చేసుకోవాలని చెప్పింది. అలా నాగ ఏమో అభిజిత్ వద్ద ఉన్న కార్డుని తీసుకున్నాడు. మనీష్ ఏమో బిందు మాధవి వద్ద ఉన్న కార్డ్.. షాకిబ్ ఏమో నవదీప్ వద్ద ఉన్న కార్డుని తీసుకున్నాడు.
నాగ తీసుకున్న కార్డుపై 4, షాకిబ్ తీసుకున్న కార్డుపై 2, మనీష్ తీసుకున్న కార్డుపై 6 నంబర్ వచ్చింది. అంటే షాకిబ్ టీంలో ఇద్దరు మాత్రమే ఉంటారు. నాగ టీంలో 4, మనీష్ టీంలో ఆరుగురు ఉంటారు. దీంతో ముందుగా సెలెక్ట్ చేసుకునే ఛాన్స్‌ను షాకిబ్‌కు ఇచ్చారు. అలా దివ్య, కళ్యాణ్ పడాలను షాకిబ్ తీసుకున్నాడు. నాగ తన టీంలోకి ప్రియా, హరీష్, శ్రీజ, అనూషను తీసుకున్నాడు. మిగిలిన వారంతా కూడా మనీష్ టీంలోనే ఉంటారు. అలా రెడ్ టీంకు నాగ, గ్రీన్ టీంకు మనీష్, ఎల్లో టీంకు షాకిబ్ లీడర్లుగా ఉన్నారు.
ఒక్కో టాస్కుకి ఒక్కో టీం నుంచి ఒక్కో కంటెస్టెంట్ వస్తారు. గంట కొట్టి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. రకరకాల ఫోటోలు చూపించడం, అందులో ఉండే తప్పులు ఏంటి? లాజిక్స్, రీజనింగ్స్ అంటూ ఇలా సిల్లి సింపుల్ ప్రశ్నల్ని వేశాడు. ఇలాంటి సిల్లీ, సింపుల్ ప్రశ్నలకి కూడా మనీష్ సమాధానం చెప్పలేకపోయాడు. మనీష్ తాను మాత్రమే తెలివైన వాడు అనుకుని ఉన్నాడో ఏమో గానీ.. చివరకు ఆయన టీం దారుణంగా ఓడిపోయింది. టీంని నమ్ముకుని, టీం మెంబర్స్‌ని పంపించిన నాగ గెలిచాడు.
Agnipariksha lo vigyana pariksha ki catalyst yevaru? 👀
— Starmaa (@StarMaa) August 29, 2025
Watch #Agnipariksha now streaming in JioHotstar! 🔥#BiggbossTelugu9 #Biggboss9Agnipariksha #StreamingNow #JioHotstar #JioHotstarTelugu pic.twitter.com/whGeEDpE70
మనీష్ పర్ఫామెన్స్, బిహేవియర్ మీద అతని టీం ఫైర్ అయింది. అతనొక్కడే తెలివైన వాడని అనుకుంటున్నాడు అంటూ పవన్, ప్రసన్న ఇలా అందరూ టీం అంతా అతడ్ని వ్యతిరేకించారు. ఇక ఈ రోజుకి వరెస్ట్ ప్లేయర్‌గా మనీష్‌ను ఎంచుకుని ఎల్లో కార్డు ఇచ్చారు. ఇంకో సారి ఎల్లో కార్డ్ వస్తే బయటకు పంపిస్తామని కూడా చెప్పారు. టీం గెలవడంతో నాగకి ఓట్ అప్పీల్ ఛాన్స్ వస్తే.. ప్రియాకు ఇచ్చాడు. ఆ తరువాత మోస్ట్ వాల్యబుల్ ప్లేయర్‌గా నాగను సెలెక్ట్ చేసుకున్నారు. దీంతో నాగకి కూడా ఓట్ అప్పీల్ ఛాన్స్ వచ్చింది. అలా ఈ ఎపిసోడ్ ముగిసింది. మరి ఇక మున్ముందు ఇంకెలాంటి టాస్కులు పెడతారో చూడాలి. ఈ రోజు అయితే అంత ఇంట్రెస్టింగ్‌గా ఎపిసోడ్ సాగలేదని చెప్పుకోవచ్చు.





















