Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 5 రివ్యూ... టాప్ 15 కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే - ఆడియన్స్ ఓట్ల ద్వారా ఇంట్లోకి... కేతమ్మకి క్రిష్ అవకాశం
Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఫైనల్‌గా 15 మంది కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారు. ఆ 15 మంది వివరాలివే. కాకపోతే ఇక్కడ కూడా ఆడియన్స్ అంటూ బిగ్ బాస్ పెద్ద టాస్క్ పెట్టారు. అదేంటంటే..

Bigg Boss Agnipariksha Fianl Contestants: బిగ్ బాస్ అగ్ని పరీక్షలో టాప్ 15 కంటెస్టెంట్లను ఐదో ఎపిసోడ్‌లో రివీల్ చేశారు. ఇంతకు ముందు ఆరుగురు నేరుగా జడ్జ్‌ల చేత గోల్డెన్ సీట్లోకి వెళ్లి కూర్చున్నారు. అగ్ని పరీక్ష లెవెల్ వన్ టాస్క్‌లో భాగంగా ఓ ఐదుగురు గోల్డెన్ సీట్లోకి వెళ్లారు. ఇక మంగళవారం నాటి ఎపిసోడ్‌లో మరో నలుగురు ఆ గోల్డెన్ చైర్‌లోకి వెళ్లారు. ఈ రోజు జరిగిన ఎపిసోడ్‌కు ఘాటీ ప్రమోషన్స్ కోసం క్రిష్ వచ్చాడు. స్టేజ్ మీద పాట పాడిన కేతమ్మని చూసి క్రిష్ తన సినిమాలోని చిన్న పాత్రను పోషించే ఛాన్స్ ఇచ్చాడు.
ఈ రోజు టాస్కుల్లో విజేతలను గోల్డెన్ చెయిర్‌కు పంపించకుండా ట్విస్ట్ ఇచ్చారు. టాస్కులు ఆడినా, ఆడకపోయినా, ఓడినా, గెలిచినా కూడా ఓవర్ ఆల్ పర్ఫామెన్స్ మీద బేస్ చేసుకుని శ్రీముఖి, నవదీప్, అభిజిత్, బిందు మాధవి కలిసి ఒక్కో కంటెస్టెంట్‌ను సెలెక్ట్ చేశారు. ఈ క్రమంలో నవదీప్ మొహం మీద నీళ్లు చల్లే టాస్క్ కోసం మనీష్ ముందుకు వచ్చాడు.
నాగ, ఊర్మిళ చేతులకు వైబ్రేటర్స్ పెట్టి.. డ్రాయింగ్ వేయాలనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్కులో ఊర్మిళ గెలిచిందన్నట్టుగా క్రిష్ చెప్పాడు. ఈ టాస్కులో ఓ చోట తన వైబ్రేటర్ పని చేయడం లేదని నిజాయితీగా నాగ చెప్పాడు. ఇక ఆ తరువాత షర్ట్ విప్పి వ్యాక్సింగ్ చేసుకోవాలనే టాస్కులో శ్రీతేజ్, మనీష్ వచ్చారు. కానీ షర్ట్ విప్పలేను అని మొండికేసి.. ఆ తరువాత షర్ట్ విప్పేందుకు మనీష్ ఒప్పుకున్నాడు. కానీ మనీష్ ఒంటిపై హెయిర్స్ లేనందుకు నాగ కంటెస్టెంట్‌ను శ్రీతేజ్ ఎంచుకున్నాడు. ఈ టాస్కులో శ్రీతేజ్, నాగ బాగానే ఆడారు.
Also Read: ఓటీటీలోకి విజయ్ 'కింగ్డమ్' వచ్చేస్తోంది - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఆ తరువాత ఫోన్ పగలగొట్టుకునే టాస్కులో షాకిబ్, నిఖిత ముందుకు వచ్చారు. తమ ఫోన్లను సుత్తితో పగలగొట్టేశారు. ఇక ఈ టాస్కులు, వారి పర్ఫామెన్సుల్ని చూసిన శ్రీముఖి, నవదీప్, అభిజిత్, బిందు మాధవి నలుగురు కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసుకున్నారు. ఈ క్రమంలో శ్రీముఖి వచ్చి మనీష్‌ని, బిందు వచ్చి దాల్యని, అభిజిత్ వచ్చి నాగని, నవదీప్ వచ్చి షాకిబ్‌ని టాప్ 15లోకి పంపారు.
Navadeep was rude.
— BiggBossTelugu.in (@BiggBossTel_in) August 25, 2025
Srija supported Shakib, and Shakib accepted his Confusion. But Navadeep’s words on Srija became a big mistake for him as a judge.#BiggBossTelugu9 #BiggBossAgnipariksha pic.twitter.com/mQ9qLspixB
అలా అనూష, ప్రసన్న కుమార్, దాల్య షరీఫ్, డిమాన్ పవన్, దివ్యా ఏలుమూరి, హరిత హరీష్, కల్కి, కళ్యాణ్ పడాల, మనీష్ మర్యాద, నాగ, ప్రియా శెట్టి, శ్రీయా, శ్వేత శెట్టి, శ్రీజ దమ్ము, సయ్యద్ షకీబ్ అందరూ టాప్ 15లోకి వచ్చారు. వీరిలోంచి బిగ్ బాస్ ఇంట్లోకి కేవలం 5 మంది మాత్రం వెళ్తారు. ఎవరు వెళ్తారు? అన్నది ఆడియెన్స్ చేతుల్లో కూడా ఉంటుందని చెప్పారు. ఓటింగ్ లైన్స్ తెరిచామని, ఇష్టమైన కంటెస్టెంట్‌కు ఓట్లు వేయండని, సెప్టెంబర్ 5 వరకు ఓటింగ్ లైన్స్..ఉంటాయని అన్నారు. ఎక్కువ ఓట్లు వచ్చిన వారు బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లే అవకాశం ఉంటుందన్న మాట.
Also Read: వారసత్వం... పెళ్లి వల్ల కాదు - ఒత్తిళ్లు ఎదుర్కొని స్వశక్తితోనే ఎదిగానన్న ఉపాసన





















