Kingdom OTT Release Date: ఓటీటీలోకి విజయ్ 'కింగ్డమ్' వచ్చేస్తోంది - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Kingdom OTT Platfrom: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ బ్లాక్ బస్టర్ కింగ్డమ్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ అధికారిక ప్రకటన ఇచ్చింది.

Vijay Deverakonda's Kingdom OTT Release On Netflix: యంగ్ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'కింగ్డమ్'. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ జులై 31న రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. నెల రోజుల్లోపే ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఈ నెల 27 నుంచి ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. 'బంగారం, రక్తం, నిప్పుల రాజ్యంలో బూడిద నుంచి కొత్త రాజు లేస్తాడు. ఆ సామ్రాజ్యాన్ని నెట్ ఫ్లిక్స్‌లో చూడండి' అంటూ రాసుకొచ్చింది.
View this post on Instagram
ఈ మూవీలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు. బ్రదర్ సెంటిమెంట్‌తో గ్యాంగ్ స్టర్ డ్రామాగా సినిమా రూపొందింది. విజయ్ అన్నగా సత్యదేవ్ కీలక పాత్ర పోషించారు. వీరితో పాటే వెంకటేశ్, అయ్యప్ప పి శర్మ, మహేష్, గోపరాజు రమణ, రాజ్ కుమార్ కసిరెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు.
స్టోరీ ఏంటంటే?
సూరి (విజయ్ దేవరకొండ) ఓ సాధారణ కానిస్టేబుల్. సూరి చిన్నప్పుడు అతని తండ్రి మద్యానికి బానిసై ప్రతిరోజూ తాగొచ్చి అమ్మ (రోహిణి) తన అన్నను కొట్టేవాడు. దీంతో ఆందోళనకు గురయ్యేవాడు సూరి. ఒకరోజు నాన్నను చంపేసి ఇంటి నుంచి సూరి అన్నయ్య శివ (సత్యదేవ్) వెళ్లిపోతాడు. అప్పటి నుంచీ శివ కోసం వెతుకుతుంటాడు సూరి. ఈ క్రమంలోనే సూరికి, పోలీస్ అధికారులకు మధ్య ఓ గొడవ జరుగుతుంది. అది పై అధికారుల వరకూ వెళ్లి సూరిని విచారించేందుకు వస్తారు.
అయితే, ఊహించని రీతిలో సూరిని ఓ అండర్ కవర్ ఆపరేషన్ కోసం సెలక్ట్ చేస్తారు. తన అన్న శివ శ్రీలంకలో ఉన్నాడని... కొన్నేళ్ల క్రితం అక్కడికి వెళ్లి స్థిరపడిన తెగతో కలిసి అక్కడే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకొని స్థిరపడినట్లు తెలుసుకుంటాడు. తన అన్నను కలిసేందుకు ఇదే ఛాన్స్ అని భావించిన సూరి అందుకు ఒప్పుకుంటాడు. జైలులో తన అన్నను కలిసిన సూరి అక్కడి నుంచి ఎలా బయటకు వెళ్లాడు? ఓ స్మగ్లింగ్ గ్యాంగ్ నుంచి తన అన్నకు ముప్పు ఉందని తెలుసుకుని ఏం చేశాడు? అసలు శ్రీలంకలో శివ స్మగ్లర్‌గా మారడానికి కారణం ఏంటి? సూరి శివను తనతో తీసుకెళ్లాడా? అసలు ప్లాష్ బ్యాక్‌లో ఏం జరిగింది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















