Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఎపిసోడ్ 7 రివ్యూ... ఏం సంచాలక్‌లు రా బై.. వరెస్ట్ టు బెస్ట్.. నవదీప్‌కు నిజంగానే చిన్న చూపా?
Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఎపిసోడ్ 7లో ఆసక్తికర టాస్క్‌లు నడిచాయి. 2 టీమ్‌లుగా కంటెస్టెంట్స్ విడిపోయి లీడర్ ఎంపికను జరిపారు. ఈ లీడర్ ఎంపికలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి

Bigg Boss Agnipariksha - Episode 7 Review: బిగ్ బాస్ అగ్ని పరీక్షలో టాస్కులు జరుగుతూనే ఉన్నాయి. టాప్ 15 మందికి బిగ్ బాస్ ఇల్లు ఎలా ఉంటుందో చిన్నగా రుచి చూపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో.. అలాంటి వాటినే అగ్ని పరీక్షలోనూ చూపిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం నాటి ఏడో ఎపిసోడ్‌లో మళ్లీ ఓ టాస్క్ పెట్టారు. టీంలు విడిపోయి ఆడిన ఈ టాస్కులో రకరకాల విషయాలు జరిగాయి. ఆరో ఎపిసోడ్‌లో ప్రియా టీం గెలిచింది. దాంతో ఆమెను లీడర్‌గా మళ్లీ కొనసాగించారు. ఇంకో టీం లీడర్‌ను ఎంచుకునే క్రమంలో ఓ టాస్క్ పెట్టారు.
పదమూడు మందికి ఈ టాస్క్ పెట్టారు. ఇందులో కళ్లకు గంతలు కట్టి.. అందరినీ బాక్సులో పెట్టారు. సరిగ్గా 2 నిమిషాలకు నిల్చోవాలని టాస్క్ ఇచ్చారు. ఫస్ట్ లేచినా, లాస్ట్ లేచినా అవుట్ అని పెట్టారు. ఇక 9వ స్థానంలో లేచిన వారే లీడర్ అని తెలిపారు. ఈక్రమంలో ఎవరి స్ట్రాటజీ వారు వాడారు. ఇందులో మనీష్ మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యాడు.. చివరకు లేచాడు.. అలా ఈ టాస్కు నుంచి ఫస్ట్ లేచిన షాకిబ్, లాస్ట్ లేచిన మనీష్ పక్కకు వెళ్లారు. 9వ స్థానంలో లేచిన వారి కోసం సంచాలకులు అయిన ప్రియా, హరీష్ మధ్య డిఫరెన్స్ వచ్చింది.
చివరకు ఆ ఇద్దరూ కలిసి 9వ స్థానంలో దాల్య వచ్చిందని చెప్పారు. అలా ప్రియా ఒక టీం, దాల్య ఇంకో టీంకు లీడర్ అయ్యారు. ప్రియా టీంలో హరీష్.. శ్రీజ.. కళ్యాణ్ పడాల.. దివ్య నిఖిత.. నాగ.. శ్రియా.. ఇలా ఏడు మంది అయ్యారు. ఇక దాల్య టీంలో ప్రసన్న.. శ్వేత.. పవన్.. అనూష.. కల్కిలు వచ్చారు. అలా రెడ్ టీంకి దాల్య, బ్లూ టీంకి ప్రియా లీడర్‌గా మారారు. ఇక వీరందరికీ కలిపి ఓ టాస్క్ పెట్టారు. పదమూడు కుండలు పెట్టి.. ఒక్కో కుండను ఒక్కొక్కరు చేతిలో పట్టుకోవాలని చెప్పారు.
Also Read: అందాల భామల ఇంట గణేష్ చతుర్థి... పూజలు చేసిన హీరోయిన్లు... ఎవరెలాంటి డ్రస్ వేశారో చూడండి
ఒక కంటెస్టెంట్ పట్టుకున్న కుండలో ఓ కంటెస్టెంట్ ఫోటో ఉంటుంది. ఏ కుండలో ఏ కంటెస్టెంట్ ఫోటో ఉంటుందన్నది ఎవ్వరికీ తెలియదు. అలా ఓ కంటెస్టెంట్ టాస్క్ చేయలేక కుండ జార విడిస్తే.. ఆ కుండలో ఉన్న కంటెస్టెంట్ ఫోటో బయటకు వస్తుంది. అప్పుడు ఆ ఫోటో ఉన్న కంటెస్టెంట్ అవుట్ ఆఫ్ ది రేస్ అన్నట్టుగా అవుతారు. చివరకు బోర్డ్ మీద ఎవరి ఫోటో ఉంటుందో.. ఆ టీం గెలిచినట్టుగా నియమాలు చెప్పారు.
ఇక ఆ ఆటకు మనీష్, షాకిబ్ సంచాలకులుగా ఉన్నారు. చాలా మంది సరిగ్గా పట్టుకోలేదు.. నియమాల్ని ఫాలో అవ్వలేదు.. అయినా సంచాలకులు కళ్లప్పగించి చూస్తూనే ఉన్నారు. సరైన నిర్ణయాలు అక్కడ తీసుకోలేదనిపిస్తుంది. ఇక ప్రియా విషయంలో కండీషన్స్ మాట్లాడిన సంచాలకులు.. శ్రీజ, శ్రియా ఇలా చాలా మంది కంటెస్టెంట్ల విషయంలో నియమాలు ఫాలో అవ్వలేదనిపించింది. ఇక చివరకు ఈ టాస్కులో పవన్, కల్కి మిగిలారు. ప్రియా తన స్ట్రాటజీని వాడాలని ట్రై చేసి.. పవన్ కుండను వదిలేయమంది. దీంతో పవన్ వదిలేశాడు. కానీ ఆ కుండలో ప్రియా ఫోటోనే ఉంది.
చివరి వరకు టాస్కులో నిలబడిన కల్కికి లక్ కలిసి వచ్చింది. కల్కి పట్టుకున్న కుండలో.. కల్కి ఫోటోనే ఉండటం లక్. దీంతో కల్కి ఉన్న టీం అంటే.. రెడ్ టీం.. అంటే దాల్య టీం గెలిచింది. దీంతో కల్కికి ఓట్ అప్పీల్ అవకాశాన్ని దాల్య ఇచ్చింది. నిన్న వరెస్ట్ అన్నారు.. ఈ రోజు బెస్ట్ అనిపించుకోవాలనే ఇంత పట్టుదలతో ఆడాను అని కల్కి చెప్పింది. ఇక తన టీం లీడర్ మాట విని వదిలేసినందుకు, టాస్క్ ఓడినందుకు పవన్ కన్నీరు పెట్టుకున్నాడు. ఈ రోజు మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్‌గా పవన్‌ను ఎంచుకున్నారు. ఇంకోసారి ఇలా నిరుత్సాహ పర్చను అని పవన్ తన ఓట్ అప్పీల్‌ను చేసుకున్నాడు. మనీష్ ఎలాంటి స్ట్రాటజీలు వాడటం లేదని, అంచనాల్ని అందుకోలేకపోతోన్నాడని వరెస్ట్ ప్లేయర్ అని బిందు మాధవి చెప్పింది. మరి మున్ముందు ఇంకెలాంటి టాస్కులు ఇస్తారో చూడాలి.
One blind move will decide the course of their actions! 🔥
— Starmaa (@StarMaa) August 27, 2025
Don’t miss Agnipariksha, exclusively on JioHotstar! 💫#BiggbossTelugu9 #Biggboss9Agnipariksha #StreamingNow #JioHotstar #JioHotstarTelugu pic.twitter.com/Ha21giIE4Y
ఇక నవదీప్ అయితే ప్రతీసారి కాస్త చిన్న చూపు చూసినట్టుగానే మాట్లాడుతున్నాడు. శ్రీజని ఊరు నుంచి ఊపుకుంటూ అనే విషయం నుంచి.. ఈ రోజు ఎపిసోడ్‌లో వాళ్ల స్ట్రాటజీల గురించి తక్కువ చేసి మాట్లాడటం.. టాస్కులు ఆడుతున్న విధానం గురించి నవదీప్ చాలానే సెటైర్లు వేస్తున్నారు. నవదీప్ మాట తీరే అంత అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. కాస్త గౌరవం కూడా ఇస్తున్నట్టుగా అనిపించడం లేదు.





















