Bigg Boss 8 Telugu Finale: బిగ్ బాస్ 8 ఫినాలే... ముఖ్య అతిథిగా గ్లోబల్ స్టార్ - ఇంకా ఈ రోజు షోలో ఎవరెవరు వస్తున్నారంటే?
Bigg Boss 8 Telugu Winner 2024: బిగ్ బాస్ సీజన్ 8 చివరికి వచ్చింది. తెలుగోడు గౌతమ్ విన్నర్ అని సోషల్ మీడియా అంతా హోరెత్తుతోంది. అతడిని విజేతగా ప్రకటించేది ఎవరో తెలుసా?
Bigg Boss 8: బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఆఖరి మజలికి వచ్చేసింది. ఈసారి మన తెలుగోడు గౌతం కృష్ణ విన్నర్ అని ఆల్రెడీ లీక్స్ వచ్చేశాయి. ట్రోఫీని సగర్వంగా ముద్దు పెట్టుకునేది అతడే అని అందరికీ తెలిసింది. మరి విజేతగా అతనిని ప్రకటించేది ఎవరో తెలుసా? బిగ్ బాస్ 8 ఫినాలే కి ముఖ్య అతిథిగా వచ్చింది ఎవరో తెలుసా?
రామ్ చరణ్ ముఖ్య అతిథిగా బిగ్ బాస్ ఫినాలే!
Bigg Boss 8 Telugu Finale Chief Guest: బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు గ్రాండ్ ఫినాలేకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ముఖ్య అతిథిగా హాజరు అయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సోలో బాయ్ గౌతమ్ కృష్ణ విన్నర్ అని ఆయన అనౌన్స్ చేసే అవకాశాలు వందకు 100% ఉన్నాయని వినబడుతోంది.
బిగ్ బాస్ హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున, మెగా ఫ్యామిలీ మధ్య అనుబంధం, సన్నిహిత సంబంధాల గురించి ప్రేక్షకులు అందరికీ తెలిసిందే. ఆ అనుబంధం బిగ్ బాస్ 8 ఫినాలేలో మరొకసారి కనబడుతోందని వినిపించింది. రామ్ చరణ్ తాజా సినిమా 'గేమ్ చేంజర్' కబుర్లు కూడా కాస్త చెప్పారట.
బాలకృష్ణ రాలేదు కానీ... డాకు మహారాజ్ టీమ్!
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న తాజా సినిమా 'డాకు మహారాజ్' (Daaku Maharaaj). ఈ మూవీ యూనిట్ కూడా బిగ్ బాస్ సీజన్ 8 ఫినాలేలో సందడి చేసింది. బాలకృష్ణ రాలేదు కానీ ఆయన హీరోయిన్లు వచ్చారు. ఇంటి నుంచి ప్రేరణను ప్రగ్యా జైస్వాల్ బయటకు తీసుకు వచ్చారని షో నుంచి సమాచారం వచ్చింది.
విజయ్ సేతుపతితో పాటు సాయి తేజ్, ఉపేంద్ర!
తెలుగులో 'బిగ్ బాస్' షోని నాగార్జున హోస్ట్ చేస్తుంటే... తమిళ 'బిగ్ బాస్' లేటెస్ట్ సీజన్ షోని మన తెలుగు ప్రేక్షకులకు సైతం బాగా తెలిసిన తమిళ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హోస్ట్ చేస్తున్నారు. ఆయన కూడా ఈ ఫినాలేకి వచ్చినట్టు తెలిసింది.
'సంబరాల ఏటిగట్టు' కార్నేజ్ (ఇటీవల విడుదల చేసిన వీడియో గ్లింప్స్) చూసిన తర్వాత మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ ట్రాన్స్ఫర్మేషన్ చూసి ఆడియన్స్ అంతా ఆశ్చర్యపోయారు. ఆయన కూడా బిగ్ బాస్ ఫినాలేకి వచ్చారు. కన్నడ కథానాయకుడు ఉపేంద్ర సైతం షోలో సందడి చేశారు. వాళ్లంతా తమ తమ సినిమా కబుర్లతో పాటు షో గురించి చెప్పిన విశేషాలు వీక్షకులు అందరినీ ఆకట్టుకోనున్నాయి. వీళ్ల సందడితో షో ఈ రోజు మంచి ఆసక్తికరంగా సాగనుంది.