Free bus politics: తిరుమలకు వెళ్లే బస్సుల్లో మహిళలు టిక్కెట్ తీసుకోవాల్సిందేనా - వైసీపీ విమర్శలపై ఆర్టీసీ ఏం చెబుతోంది ?
Free bus scheme: ఉచిత బస్సుల పథకంలో లోపాలపై వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. తిరుమలకు వెళ్లే బస్సుల్లో మహిళలకు టిక్కెట్లు తీసుకుంటున్నారని .. ఇది మోసమేనని ఆరోపిస్తోంది.

Free bus scheme Politics In AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని స్త్రీశక్తి పేరుతో ప్రారంభించింది. పూర్తి స్థాయిలో శనివారం నుంచి మహిళలు తమ గుర్తింపు కార్డు చూపించి ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వం ఈ పథకంపై ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకునేలా ఏర్పాట్లు చేసింది. పలువురు ప్రయాణికులు , టీడీపీ కార్యకర్తలు బస్సుల్లో మహిళలు పథకాన్ని ఎలా వినియోగించుకుంటున్నారో వీడియోలు తీసి అప్ లోడ్ చేస్తున్నారు.
మహిళలకు ఉచిత ప్రయాణం
— Telugu Desam Party (@JaiTDP) August 16, 2025
రూ.490 ఆదాతో అవ్వ ఆనందం
స్త్రీ శక్తి పేరుతో ప్రారంభమైన ఉచిత బస్సు ప్రయాణం పథకంతో బస్సుల్లో మహిళల సంఖ్య పెరిగింది.
విజయవాడ నుంచి జంగారెడ్డిగూడెం టికెట్ రూ.245 కాగా రెండు వైపులా రూ.490 తనకు మిగిలిందని ఓ అవ్వ ఆనందం వ్యక్తం చేసింది.#SthreeShakti… pic.twitter.com/Li8HPZqkIh
అయితే వైఎస్ఆర్‌సీపీ నేతలు మాత్రం అత్యధిక బస్సుల్లో మహిళలకు డబ్బులు వసూలు చేస్తున్నారని.. చాలా స్వల్ప సంఖ్యలోనే బస్సులకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై కొన్ని వీడియోలను వారు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. తిరుమలకు టిక్కెట్ తీసుకుంటున్నారని.. తిరుమల పక్క రాష్ట్రంలో ఉందా అని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
ఏంటి దేవాలయానికి వెళ్లే హిందువలకు టికెట్
— RAM...🇮🇳🇮🇳 (@ram_views) August 16, 2025
తీసుకుంటున్నారా... ఇదేం ఫ్రీ బస్సు స్కీమ్ రా నాయన
pic.twitter.com/mFiRTxwVMT
ఈ ఆరోపణలకు టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కౌంటర్ ఇస్తున్నారు. మొత్తం ఉన్న బస్సెస్ లో 85% లో ఫ్రీ అది కూడా స్టేట్ మొత్తం వర్తింప చేశారని.. కర్ణాటక, తెలంగాణ కంటే బెటర్ గా ఇస్తున్నారన్నారు. టీటీడీకి చెందిన సప్తగిరి బస్సుల్లో మాత్రం ఉచితం కాదని అవి ఆర్టీసీ కిందకు కాకుండా.. టీటీడీ కిందకు వస్తాయి కాబట్టి టెక్నికల్ సమస్యలు ఉన్నాయంటున్నారు.
ఆ బస్సు లో లేదు ఈ బస్సు లో లేదు అనే వాళ్ళకి చెప్పండి మొత్తం ఉన్న బస్సెస్ లో 85% లో ఫ్రీ అని అది స్టేట్ మొత్తం .. ఇది TG,KA కంటే బెటర్ గా ఇచ్చారు ..
— భవసాగర్ (@Chemchadu) August 16, 2025
ఆటో వాలాని ఏసుకొస్తారు ఇప్పుడు అసలు బస్సు ఎక్కేవాళ్ళు ఆటో ఎప్పుడు ఎక్కారు రా ? అయినా వాళ్ళని Upgrade చేసే పనిలో Govt ఉంది pic.twitter.com/KmDULgpolD
ఇవే కాకుండా మరికొన్ని వీడియోలతో వైసీపీ సోషల మీడియా పథకం అమలు తీరుపై విమర్శలు గుప్పిస్తోంది. దీనిపై ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇదొక ఫేక్ ప్రచారం. ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం స్త్రీ శక్తి గురించి అప్పుడే కొందరు కుట్రపూరిత ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. ఫ్రీ అని చెప్పి బస్సు ఎక్కే అవకాశం ఇవ్వడం లేదంటూ ఒక వ్యక్తి పాత ఫోటోను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేసాడు. నిజానికి అది జులై 25న జరిగిన ఒక… pic.twitter.com/K8TdVY9NBz
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) August 16, 2025
ఈ పథకంపై సోషల్ మీడియాతో పాటు బయట కూడా.. రాజకీయం ప్రారంభమయింది.





















