Nithiin Shalini: నితిన్ షాలినిల బాబు పేరేంటో తెలుసా? - కృష్ణాష్టమి సందర్భంగా రివీల్
Nithiin Son: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తన కుమారుడి పేరును రివీల్ చేశారు. గతేడాది ఆయన భార్య షాలిని పండంటి మగబిడ్డకు జన్మనివ్వగా కృష్ణాష్టమి సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పారు.

Nithiin Shalini Son Name Revealed: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, షాలిని దంపతులు గతేడాది పేరెంట్స్ అయిన సంగతి తెలిసిందే. షాలిని 2024 సెప్టెంబర్ 6న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే, అప్పటి నుంచి బాబు ఫోటో కానీ, వీడియోలు కానీ ఏవీ బయటపెట్టలేదు. తాజాగా తన బాబు పేరును రివీల్ చేశారు నితిన్.
కృష్ణాష్టమి రోజు గుడ్ న్యూస్
కృష్ణష్టమి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తన బాబు పేరును వెల్లడించారు నితిన్. తన బాబుకు 'అవ్యుక్త్' అని పేరు పెట్టినట్లు చెప్పారు. 'ఈ జన్మాష్టమికి మా హృదయాలు నిండిపోయాయి. మా కొడుకు పేరును మేము సంతోషంగా ప్రకటిస్తున్నాం. అవ్యుక్త్ మా జీవితాల్లో ఎప్పటికీ ఓ చిన్ని కృష్ణుడు.' అంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.
View this post on Instagram
Also Read: ఏంటిది బిగ్ బాస్... మారిందా వాయిస్ - చాక్లెట్ బాయ్ అభిజిత్‌ను ఎంకరేజ్ చేస్తూనే భయపెట్టేశాడా?
'అవ్యుక్త్' అంటే అర్థమేంటో తెలుసా?
అవ్యుక్త్ అంటే ఎప్పటికీ మారనిది, స్వచ్ఛంగా స్పష్టంగా ఉండేది అని అర్థం. హిందూ తత్వంలో 'ప్రకృతికి మూలం' లేదా 'పరమాత్మ' అనే సందర్భంలో ఈ పేరును వాడతారు. న్యూమరాలజీ ప్రకారం ఆధ్యాత్మికత పట్ల ఎక్కువ ఇష్టం కలిగి ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఇష్టంగా ఉంటారు. ధైర్యం, లీడర్ షిప్ క్వాలిటీస్ కలిగి ఉంటారు.
నితిన్, షాలినీ 2020లో పెళ్లి చేసుకున్నారు. లవ్‌లో ఉన్న వీరు ఆ తర్వాత పెద్దలను ఒప్పించి మరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గతేడాది వీరికి బాబు జన్మించగా... దాదాపు 11 నెలల తర్వాత చిన్నారికి పేరు పెట్టారు.
ఇక సినిమాల విషయానికొస్తే... ఇటీవల నితిన్ హీరోగా నటించిన 'తమ్ముడు' మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. గత కొంతకాలంగా ఆయన ఖాతాలో సరైన హిట్ పడలేదు. తమ్ముడుకు ముందు రాబిన్ హుడ్ కూడా భారీ డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'బలగం' ఫేం వేణు దర్శకత్వంలో 'ఎల్లమ్మ' మూవీ చేయాల్సి ఉంది.





















