Jr NTR Hrithik Roshan War 2 Movie Video Review | వార్ 2 సినిమాకు ప్రేక్షకులు సలామ్ అంటారా.? | ABP Desam
వార్ 2 సినిమాతో బాలీవుడ్ లో తన లక్ ను ట్రై చేసే ప్రయత్నం చేశారు ఎన్టీఆర్. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తో కలిసి నటించిన తారక్ వార్ 2 సినిమాతో మెప్పించారా. ఇది తెలుగు సినిమానే అంటూ ప్రమోట్ చేస్తూ రెండు కాలర్స్ పైకి లేపి చూపించిన జూనియర్ ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్ వర్కవుట్ అయ్యిందా వార్ 2 రివ్యూ లో చుద్దాం.
సింపుల్ గా చెప్పాలంటే ఇది ఇద్దరు స్పై ల కథ. కబీర్ అండ్ విక్రమ్ చలపతి. కబీర్ హృతిక్ రోషన్. అండ్ విక్రమ్ చలపతి క్యారెక్టర్ ను జూనియర్ ఎన్టీఆర్ ప్లే చేశారు. ఇద్దరూ రా కు సంబంధించిన గూఢచారులే. అయితే వీరిలో ఎవరు హీరో..ఎవరు విలన్...ఎవరు దేశం కోసం పనిచేస్తున్నారు..ఎవరు దేశానికి వ్యతిరేకంగా వెళ్లారు అనేది వార్ 2 కథ. మధ్యలో కొన్ని ట్విస్టులు..యాక్షన్ సీక్వెన్సులు,..కావాల్సినంత డ్రామా కనిపిస్తుంది ఈ కథలో
కథనం విషయానికి వస్తే జనరల్ స్పై థ్రిల్లర్ గా అనగానే భారీ ఛేజ్ లు...మనకు ఊహకు అందని టెక్నాలజీ యూజ్ చేస్తూ చేసే మ్యాజిక్ లు..ఇలాంటి సర్ ప్రైజ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను ఎక్సెప్ట్ చేయటం కామన్. కానీ వార్ 2 లో ఎందుకనో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ డ్రామా మీద వెళ్దామనే కాల్ తీసుకున్నారు. కార్ ఛేజింగ్లు..ఫ్లైట్ మీద ఫైట్లు...గన్ ఫైరింగ్ లు అన్నీ ఉంటాయి కానీ ఎక్కువగా క్యారెక్టర్ స్టడీ మీదనే స్కీన్ ప్లే నడిపేటప్పటికీ ఓ రకమైన బోరింగ్ ఫీల్ వస్తుంది చాలా చోట్ల. అంటే పెద్దగా రివీల్ చేయటానికి కూడా స్పాయిలర్స్ ఏం లేవు కానీ ఓ కీ ఎలిమెంట్ ఉంటుంది సినిమాలో అసలు దాని కోసమే ఈ కథంతా తిరుగుతూ ఉంటుంది. అలా అని అదేదో దేశానికి సంబంధించిందో...లేదా మరేదైనా సీక్రెట్ ఆపరేషన్ కాదు. ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన బాండింగ్ మేటర్. అదెలానో సినిమా చూసే తెలుసుకోవాలి.
యాక్టింగ్ విషయానికి వస్తే ఈ సినిమాతోనే జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ ఇచ్చారా లేదా హృతిక్ రోషన్ తెలుగు సినిమాకు డెబ్యూ ఇచ్చారా అంటే...ఎన్టీఆర్ హృతిక్ రోషనే తెలుగులోకి వచ్చారని ప్రీ రిలీజ్ లో చెప్పినా ఇది పక్కాగా హిందీ సినిమా. రామారావు కు తెలుగు వచ్చు కాబట్టి డబ్బింగ్ తో సరిపోయింది కానీ మిగిలిన వాయిస్ ల డబ్బింగ్ విషయంలోనూ ఎక్కడా తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగ్ ఉండదు. ఎన్టీఆర్ క్యారెక్టర్ కు రకరకాల డైమన్షన్స్ ఉంటాయి. స్వతహాగా మంచి నటుడు కావటంతో చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయారు ఆయన. కానీ సినిమా మొత్తం ఎక్కువగా ఫేస్ అంతా కోపంగా పెట్టుకుని ఉంటారు. క్యారెక్టర్ పరంగా చూసినా అంతగా సీరియస్ గా ఉండాల్సిన అవసరం లేని చోట కూడా సీరియస్ గానే ఉండేసరికి ఓ రకమైన మొనాటినీ వస్తుంది.
బట్ హృతిక్ రోషన్ తన క్యారెక్టర్ ను కూల్ గా చేసుకుంటూ వెళ్లిపోయారు. వార్ సినిమాలో తన బాడీకి పెద్దగా పనిలేకుండా కేవలం క్యారెక్టర్ డ్రివెన్ సినిమా లా డైరెక్టర్ డీల్ చేయటంతో గో విత్ ద ఫ్లో అన్నట్లు వెళ్లిపోతుంది ఆయన పాత్ర..హృతిక్ యాక్టింగ్ కూడా. బట్ ఇద్దరూ ఫేస్ ఆఫ్ అయిన ప్రతీసారి ఎన్టీఆర్ డామినేట్ చేయటానికి చేసిన ప్రయత్నాలు..తారక్ యాక్టింగ్ స్కిల్స్ ను నోటీస్ చేయొచ్చు. ఇద్దరికీ సపరేట్ ఇంట్రో సీన్స్ ఉన్నాయి. ఫైట్ సీక్వెన్సులు ఉంటాయి. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ రెండు చోట్లా ఇద్దరూ తమ ఫర్ ఫార్మెన్స్ లతో స్టాండ్ అవుట్ అవ్వటానికి, సీన్స్ ను ఎలివేట్ చేయటానికి ఇద్దరూ ఉపయోగపడ్డారు. కియారా అడ్వానీ ఓకే ఓకే క్యారెక్టర్. తనకు కథలో ప్రాధాన్యత ఉంటుంది కానీ స్క్రీన్ స్పేస్ పెద్దగా లేదు. గ్లామర్ విషయంలో స్టాండ్ అవుట్ అవ్వటానికి ట్రై చేసింది. అనిల్ కపూర్, అశుతోష్ రాణా నోటీస్ చేయదగిన రెండు క్యారెక్టర్లు. వాళ్లిద్దరూ తమ పాత్రల పరిధి మేరకు బాగానే యాక్ట్ చేశారు.
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే వీఎఫ్ఎక్స్ బాగా తేలిపోయింది సినిమాలో. ప్రొడక్షన్ హౌస్ యశ్ రాజ్ ఫిలింస్ బడ్జెట్ 400కోట్లు అన్నారు సినిమాకు పెట్టిన ఖర్చు. కొన్ని ఫ్రేమ్స్ లో ఆ భారీ ఖర్చు కనిపిస్తుంది. అనేక దేశాల్లో వేర్వేరు లొకేషన్స్ లో షూటింగ్ చేశారు సినిమాను. మళ్లీ కొన్ని సీన్స్ లో బాగా డల్ వీఎఫ్ఎక్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ట్రైన్ పై ఫైట్ సీన్, బోట్ ఛేజింగ్ సీన్స్ లో వీఎఫ్ఎక్స్ తేలిపోయింది. ఈ సినిమాకు మ్యూజిక్ ప్రీతమ్ అండ్ బీజీఎం బల్హారా డ్యూయో. ఉన్న రెండు పాటలు విన్నప్పుడు బాగానే ఉంటాయి..గుర్తుండేంత ఇంపాక్ట్ ను క్రియేట్ చేయలేకపోయాయి. సలామ్ అనాలి సాంగ్ లో హృతిక్, ఎన్టీఆర్ డ్యాన్స్ మాత్రం అభిమానులకు ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు.
సో ఓవరాల్ గా చెప్పాలంటే వార్ సినిమాకు కొనసాగింపుగానే వచ్చినా కథ పరంగా ఇది కంప్లీట్ స్టాండలోన్ ఫిలిం అనే ఫీలింగ్ ఉంటుంది వార్ 2కు. చివర్లో వచ్చే ట్విస్ట్..క్లైమాక్స్ సినిమాకు పాజిటివ్ ఫీలింగ్ తీసుకువస్తాయి. అండ్ ఈ యూనివర్స్ లో నెక్ట్స్ సినిమాకు కూడా చివర్లో లీడ్ ఇచ్చారు. టోటల్ గా కంటెంట్ పరంగా..ఎమోషన్ పరంగా ఈ సినిమా నిలబడే సినిమానే..కానీ స్పై థ్రిల్లర్ అని జేమ్స్ బాండ్ లెవల్లో ఊహించుకుని వెళ్తే మాత్రం వార్ 2 నిరాశపరుస్తుంది.





















