Bigg Boss Telugu Day 94 Promo : తనూజ కూర్చోమంటే కూర్చుంటున్నాడు, నిలబడమంటే నిల్చుంటున్నాడు.. కళ్యాణ్ కీలు బొమ్మగా మారిపోయాడా?
Bigg Boss 9 Telugu Today Promo : తనూజ చేతిలో కళ్యాణ్ కీలు బొమ్మలా మారిపోయాడనే రేంజ్లో భరణి కామెంట్ చేశారు. దానికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు చూసేద్దాం.

Bigg Boss 9 Telugu Task War Sanjana vs Thanuja Promo : బిగ్‌బాస్ హోజ్లో రోజు రోజుకి గొడవలు పెరుగుతున్నాయి. సీజన్ 9 ముగిసే సరికి అందరూ సైలెంట్‌గా, నవ్వుకుంటూ ఉంటారనుకుంటే.. ఇంకా ఇంకా గొడవలు పడుతూ.. కాంప్లికేట్ చేసుకుంటున్నారు. పైగా ఈ వారం ఆడియన్స్‌తో ఇంట్రాక్షన్ అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాడు బిగ్‌బాస్. కళ్యాణ్ తనూజ చేతిలో కీలు బొమ్మలా మారాడంటూ.. కామెంట్స్ చేశాడు. భరణి. ఆ మాట ఎందుకన్నాడు.. సంజన, తనూజ మధ్య గొడవ ఏంటో చూసేద్దాం.
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో..
బిగ్‌బాస్ లేటెస్ట్ ప్రోమో ఇంట్రెస్టింగ్గా సాగింది. ఎందుకంటే నాన్న, కూతురి మధ్య కూడా అనుకోని మాటలు వస్తున్నాయి. నిన్న ఇమ్మాన్యుయేల్, డిమోన్ ఆడియన్స్‌తో ఇంట్రాక్ట్ కాగా.. ఈరోజు మరిన్ని గేమ్స్ పెట్టారు బిగ్‌బాస్. మిగిలినవాళ్లకి కూడా ఆడియన్స్‌తో ఇంట్రాక్ట్ అయి.. ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. నిన్న ఇమ్మూకి ఆ అవకాశం దక్కింది. అంతేకాకుండా.. నామినేషన్స్ నుంచి తప్పించుకునేందుకు టాస్క్‌లు పెట్టాడు బిగ్‌బాస్. దానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.
సంచాలకులతో గేమ్
నామినేషన్స్ తప్పించుకుని.. ఫైనలిస్ట్‌లు అయ్యేందుకు, లీడర్ బోర్డ్‌లో పాయింట్స్ సంపాదించుకునేందుకు ఇస్తోన్న మూడో యుద్ధం పట్టుకో.. పట్టుకో అంటూ చెప్పాడు. ఈ టాస్క్‌లో భాగంగా గేమ్ సంచాలకులుగా ఇద్దరిని నియమించారు. కళ్యాణ్, సంజన సంచాలకులుగా చేస్తున్నారు. మిగిలిన వాళ్లంతా లూజ్ ప్యాంట్స్ వేసుకుని.. లైన్ ముందు నిల్చొన్నారు. సంచాలకులు స్టూల్ మీద నిల్చొని బాల్స్ వేస్తుంది.. వాటిని పోటీదారులు ప్యాంట్‌తో పట్టుకోవాలి. అలా ఎవరు ఎక్కువ పట్టుకుంటే వారు గెలిచినట్లు బిగ్‌బాస్ చెప్పాడు.
సంజనా, కళ్యాణ్ బాల్స్ వేశారు. ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకోకూడదని చెప్పినట్లు ప్రోమోలో తెలుస్తుంది. కానీ తనూజ, ఇమ్మూకి అడ్డుపడినట్లు కనిపిస్తుంది. ఆ కోపంలోనే ఇమ్మూ భరణి వైపు వెళ్లగా.. తోసుకోకూడదని చెప్పారుగా అంటారు. అయితే ఇక్కడ ఎత్తు వల్ల భరణి సుమన్ శెట్టి వైపు వస్తోన్న బాల్స్ కూడా పట్టేసుకున్నాడు. దాంతో సుమన్.. అన్న నావైపు కూడా మీరే వచ్చేస్తున్నారు అన్నా అంటూ అడిగాడు. మిగిలిన వాళ్లు అంతా.. సంచాలకులని.. తమకు బాల్ వేయాలంటూ అడిగారు. అయితే ప్రోమో ప్రకారం కళ్యాణ్ తనూజకు ఎక్కువ బాల్స్ వేసినట్లు కనిపిస్తుంది.
సంజనతో తనూజ గొడవ
సంజన దాని గురించి అడుగుతుంది. తను హైట్ తక్కువ ఉన్నాడు. ఒకటి ఎక్కువ వేస్తే ఏమవుతుందని సంజన కళ్యాణ్‌ని అడుగుతుంది. నేను అతనికి వేస్తుంటే భరణిగారు పట్టేసుకుంటున్నారని చెప్తాడు కళ్యాణ్. భరణి కాదు కాదు అని చెప్పగా.. సుమన్ శెట్టి నా డైరక్షన్ వైపు వచ్చేవి మీరు పట్టుకున్నారని అంటాడు. హైట్ ఎక్కువగా ఉండడం వల్ల జరిగేది అనే గొడవలో.. తనూజ మధ్యలో ఎంట్రీ ఇచ్చింది. మీరు భరణికి వేసినప్పుడు లేదు కళ్యాణ్ వేసినప్పుడు వచ్చిందా అంటూ సంజనను అడిగింది. దీనిపై గొడవ జరగ్గా.. భరణి దగ్గర సంజన వెళ్లి కూర్చుంది. అప్పుడు భరణి.. తనూజ కూర్చోమంటే కూర్చుంటున్నాడు. నిల్చోమంటే నిల్చున్నాడు అని కళ్యాణ్‌ని ఉద్దేశించి చెప్పడంతో ప్రోమో ముగిసింది.






















