Pakistan Man Illegal Affair in Hyderabad | హైదరాబాద్ లో లవ్ జిహాద్ కేసు | ABP Desam
భారత్ కు అక్రమంగా వచ్చిన ఓ పాకిస్తానీ ఇక్కడ హిందూ యువతిని వివాహం చేసుకుని మతం మార్చి..ఇప్పుడు వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని దొరికిపోయిన ఘటన కలకలం రేపుతోంది. పాకిస్తాన్ కు చెందిన ఫహాద్ అనే యువకుడు ప్రేమ, పెళ్లిళ్ల పేరుతో హైదరాబాద్ లో మోసాలకు పాల్పడుతున్నాడని బాధితురాలైన ఈ యువతి ఆరోపిస్తోంది. బంజారాహిల్స్ లో మౌంట్ బంజారా కాలనీలో అక్రమంగా ఉంటున్న ఫహాద్ అనే యువకుడు భారతీయుడినని చెప్పి తనను 2016లోపెళ్లి చేసుకుని పేరు ఫాతిమా గా మార్చాడు. ఇప్పుడు తను వేరే అమ్మయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బాధితురాలు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. సినీటి కరాటే కళ్యాణి బాధితురాలికి మద్దుతుగా ఆమె దగ్గరకు వచ్చి ధైర్యం చెప్పారు. పోలీసులు నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని...పాకిస్తాన్ నుంచి వచ్చి హైదరాబాద్ లో ఇలా అక్రమంగా ఉంటూ...లవ్ జిహాద్ కు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని కరాటే కళ్యాణి డిమాండ్ చేశారు.





















