నిర్మాత చావాాలా.. బతకాలా!.. ఫిల్మ్ ఫెడరేషన్ మాఫియాగా మారిందా.. ఫెడరేషన్ కార్యదర్శి ఇంటర్వ్యూ
సినీ కార్మికుల సమ్మెపై నిర్మాతలతో ఫెడరేషన్ కు ఎక్కడ చెడింది.? ఫెడరేషన్ డిమాండ్లు ఏంటి.? ఫెడరేషన్ పై నిర్మాతలు చేస్తున్న ఆరోణల్లో నిజాలేంటి .?ఫిల్మ్ ఫెడరేషన్ కార్యదర్శి అమ్మిరాజుతో ABP Desam ఇంటర్వ్యూ

ఏబిపి దేశం.. సినీ ఇండస్ట్రీలో కార్మికుల సమ్మె ఇంకా ఎన్నాళ్లు.. ఎప్పుడు ముగుస్తుంది.. చర్చలు విఫలమవ్వడానికి కారణాలంటేి.. కార్మికుల అభ్యంతరాలేంటి... నిర్మాతలు ఎలాంటి కండషన్స్ పెడుతున్నారు..?
అమ్మిరాజు, ఫిల్మ్ ఫెడరేషన్ కార్యదర్శి
నిర్మాతలు నాలుగు షరతులు పెడుతున్నారు. ఉదయం 6గంటలను నుండి సాయంత్రం 6గంటల వరకూ ఉండే కాల్ షీట్ ను మార్చి , తొమ్మిది గంటల వరకూ చేయమంటున్నారు. అలా చేస్తే ప్రతీ కార్మికుడు మూడు గంటలు నష్టపోతాడనేది మా అభిప్రాయం. ఉదయం 6 గంటల నుండి రాత్రి 9వరకూ చేేయడం వల్ల కార్మికులు ఇబ్బంది పడతారు. మరో నిబంధన సెలవు రోజుల విషయంలో వచ్చింది. ప్రతీ ఆదివారం డబుల్ కాల్ షీడ్ ఉండేది. అది మేము ఇవ్వలేమని నిర్మాతలు అంటున్నారు. ప్రతీ నెలా రెండో ఆదివారం ఫెడరేషన్ అనుమతితో మాత్రమే డుబుల్ కాల్ షీట్ డబ్బు చెల్లిస్తాము. నేషనల్ హాలిడేస్ కు మాత్రమే సెలవు దినాలుగా పరిగణిస్తాము. నెలలో మిగతా మూడువారాలు పని ఉంటే షూటింగ్స్ కు కార్మికులు రావాల్సిందే అనే నిబంధన మేము ఒప్పుకోవడం లేదు. అదే విధంగా ఫైటర్స్ ,డ్యాన్స్ మాస్టర్స్ నిష్పత్తి విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
ముంబాయి, చైన్నై ఇలా ఇతర రాష్ట్రాల నుండి కార్మికులను పిలిచినప్పుడు వాళ్లు, వీళ్లు 50శాతం ఉండాల్సిందే అనే నిబంధన తీసేయాలని కోరారు. అయితే మీరు పెట్టిన నాలుగు నిబంధనలు ఫెడరేషన్ ఒప్పుకుంటే మీరు ఎంత శాతం జీతాలు పెంచుతున్నారని అడిగాము.నిర్మాతల నుండి మాకు ఎలాంటి సమాధానం రాలేదు. నిబంధనలకు ఓకే ఐతే చెప్పండి అని వెళ్లిపోయారు. ఇప్పటి వరకూ నిర్మాతల నుండి ఎటువంటి సమాధానం రాలేదు.
ఏబిపి దేశం..
30శాతం కార్మికుల జీతాలు పెంచాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. నిర్మాతలు 15శాతం పెంచుతామంటూ కండీషన్స్ పెడుతున్నారు.ఒకవేళ 15శాతం మించి పెంచలేమని నిర్మాతలు అంటే మీకు అంగీకరిస్తారా..జీతాల పెంపుపై ఫెడరేషన్ ఫైనల్ నిర్ణయమేంటి..?
అమ్మిరాజు, ఫిల్మ్ ఫెడరేషన్ కార్యదర్శి.
ఇప్పుడు 15శాతం పెంచి, ఏటా 5శాతం చప్పున పెంచుతామంతామని నిర్మాతలు చెబుతున్నారు. అయితే డిఓపీ, డ్యాన్సర్స్ , ఫైట్ మాస్టర్స్ ఇలా ఈ మూడు యూనియన్లకు మాత్రం పెంచలేమని చెబుతున్నారు. మేము అందుకు ఒప్పుకోలేదు.ఈ చిక్కుముడి వీడాలంటే ఆదివారం రోజు పనిచేస్తే డబుల్ ఇవ్వాలి. పాతపద్దతి ప్రకారమే నిబంధనలు ఉండాలి. అలా జరిగితే కాస్త జీతాలు పెంపు పర్సంటేజ్ కాస్త తగ్గినా మాకు సమ్మతమే.నిర్మాత కష్టాలు మాకు తెలిసిందే. మా ఇబ్బందులు నిర్మాతకు తెలిసందే.కొంచెం అటూ ఇటూగా మాట్లడుకుని ముందడుగువేయాల్సిన చోట ఎందుకు వెనకడుగు వేస్తున్నారో మాకు అర్ధంకావడంలేదు.నిర్మాత సంతోషంగా ఉండాలి. ఇండస్ట్రీని నమ్ముకున్న కార్మికుడు సంతోషంగా ఉండాలి.
ఏబిపి దేశం..
ఫిల్మ్ ఫెడరేషన్ పేరుతో మాఫియా తయారైయ్యారని, 10మంది కావాల్సిన చోట 30 మంది అయితే షూటింగ్ కు వస్తామంటున్నారని, నిర్మాతకు భారంగా మారుతున్నారంటూ వస్తున్న ఆరోపణలపై ఫెడరేషన్ స్పందన ఏంటి..?
అమ్మిరాజు, ఫిల్మ్ ఫెడరేషన్ కార్యదర్శి..
జీతాల కోసం మా న్యాయమైన డిమాండ్ తప్పుదారిలో వక్రీకరిస్తున్నారు. నిర్మాతలను కార్మికులు ఎప్పుడూ డిమాండ్ చేయలేదు. ఓ లిస్ట్ ప్రకారం నలుగు ఆర్టిస్టులతో ఒకలా., పదిమందితో ఒకలా షూటింగ్ ఉంటుంది. ఈ రోజు టెక్నాలజీ పెరిగింది. ఎక్కువ వర్కర్స్ తో పెద్దసినిమాలు చేస్తున్నారు కాబట్టి అందుకు అవసరమైన కార్మికులను మాత్రమే పంపుతాము . ఇప్పటి వరకూ కార్మికులు నిర్మాతలను ఇబ్బంది పెట్టినట్లు ఒక్క ఫిర్యాదు రాలేదు. ఎవరైనా ఇబ్బంది పెడతే ఫెడరేషన్ కు ఫిర్యాదు చేస్తే మేం ఖచ్చితంగా ఆయా యూనియన్లపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము.
ఏబిపి దేశం..
నైపుణ్యం ఉన్న కార్మికుడు యూనియన్ లలోకి రావాలంటే రాలేని పరిస్దితి ఉందా., సభ్యత్వం పేరుతో కార్మికుల వద్ద నుండి లక్షలాది రూపాయలు యూనియన్లు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలపై ఏమంటారు..?
అమ్మిరాజు, ఫిల్మ్ ఫెడరేషన్ కార్యదర్శి..
ఓ వ్యక్తిలో సినీ ఇండస్ట్రీకి అవసరమైన నైపుణ్యం ఉన్నట్లు ముందుగా గుర్తించడం అసాధ్యం. అదీ టెక్నికల్ గా మరింత కష్టం. ఒక్క డైరెక్టర్ తప్ప ఎవరూ అలా సినీ ఇండస్ట్రీకి రాలేరు. మిగతావాళ్లు ట్రౌనింగ్ తీసుకోవాలి. సభ్యత్వం పేరుతో వసూలు చేస్తే డబ్బు కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చుపెడుతున్నాం.కార్మికులకు హెల్త్ కార్డు, యాక్సిడెంట్ ఇన్సురెన్స్, కుటుంబానికి ఆర్ధిక భరోసా కల్పిస్తున్నాం. ఇక్కడ జరుగుతున్నది ఒకటైతే, బయటకు ప్రచారం చేస్తున్నది మరొకటి. దయచేసి సినీ కార్మికులమీద ,యూనియన్ల మీద తప్పుడు ప్రచారం చేయోద్దు. కొత్త వారు రావాలని మేం ఎప్పుడూ కోరుకుంటాం. పెద్దవాళ్లు రిటైర్ అయైనవాళ్లను ఎంత గౌరవంగా పంపుతామో, నైపుణ్యం ఉన్న కొత్తవారిని అంతే ప్రేమతో ఆహ్వానిస్తున్నాం.





















