CM Chandrababu RTC Bus Journey | స్త్రీశక్తి పథకాన్ని పంద్రాగస్టు కానుకగా ప్రారంభించిన సీఎం చంద్రబాబు | ABP Desam
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా స్త్రీ శక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. సూపర్ సిక్స్ హామీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు...ఈరోజు లాంఛనంగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతే కాదు ఉండవల్లి నుంచి విజయవాడ వరకూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఆర్టీసీ బస్సులో మహిళలలతో కలిసి ప్రయాణించారు. బస్సు ప్రయాణంపై మహిళల సమస్యలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్, లోకేశ్ లు ప్రభుత్వ పథకాల గురించి మహిళలకు వివరించారు. ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించి మహిళలు ఉచితంగా నిర్దేశిత బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. స్త్రీ శక్తి పేరుతో నిర్దేశిత ఏపీఎస్ఆర్టీసీ బస్సులో మహిళలకు ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకం ప్రారంభానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఆర్టీసీ బస్సులోనే ఉండవల్లి నుంచి విజయవాడకు ప్రయాణించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలతో ఏం మాట్లాడారు. వారు ఏఏ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు.





















