అన్వేషించండి

Bigg Boss 8 Telugu Episode 27: మేం ముగ్గురమే అట్రాక్షన్... సోనియాకు ఇలా అర్థమైందా? - రోస్ట్ చేసి పడేశారు కదయ్యా

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ శుక్రవారం నాటి ఎపిసోడ్ పరమ నాసిరకంగా నడిచింది. ఏ మాత్రం ఆసక్తికరంగా అనిపించలేదు. బిగ్ బాస్ కూడా ఈ సారి చేతులెత్తేసినట్టుగా కనిపిస్తోంది.

Bigg Boss 8 Telugu Episode 27 Day 26: బిగ్ బాస్ ఇంట్లో వ్యవహారం ఒకలా ఉంటుంది. బయట ఆడియెన్స్‌కు ఇంకోలా వెళ్తుంది. అక్కడ ఉండే వాళ్లకు బయట జరిగే విషయాలు, ట్రోలింగ్‌ల గురించి తెలియదు. తన మీద ఎంత నెగెటివిటీ వస్తుందనే విషయం బయటకు వచ్చాకే తెలుస్తుంది. శుక్రవారం నాటి ఎపిసోడ్ పరమ నాసిరకంగా నడిచింది. ఏ మాత్రం ఆసక్తికరంగా అనిపించలేదు. బిగ్ బాస్ కూడా ఈ సారి చేతులెత్తేసినట్టుగా కనిపిస్తోంది. ఎక్కడా కూడా కంటెస్టెంట్లను సరిగ్గా వాడుకోవడం లేదని, టాస్కులు ఇవ్వడం లేదనిపిస్తోంది.

శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో విష్ణు ప్రియ, పృథ్వీ ట్రాక్ గురించి చర్చలు జరిగాయి.  పృథ్వీకి గాయమైందని విష్ణు ప్రియ ఆరాటపడింది. ఆ విషయం మీద సీత, నైనిక, ప్రేరణలు విష్ణు ప్రియతో మాట్లాడారు. కానీ తనకు పృథ్వీ అంటే ఇష్టమని, అతనితో మాట్లాడుతూనే ఉంటాను అని, క్లాన్‌తో సంబంధం లేదని విష్ణు ప్రియ క్లారిటీ ఇచ్చింది. ఇక విష్ణు ప్రియ, పృథ్వీల ట్రాక్ మరీ ఆర్టిఫీషియల్‌గా అనిపిస్తోంది. విష్ణు ప్రియ ఈ ట్రాక్‌తోనే సర్వైవ్ అవ్వాలని చూస్తున్నట్టుగా ఉంది. ఆమె ఆటలు కూడా ఆడటం లేదు. అసలు విష్ణు నుంచి ఆడియెన్స్ ఎంతో ఊహించి ఉంటారు. కానీ ఆమె నుంచి వస్తోంది శూన్యం.

గోల్డెన్ బ్యాండ్ ద్వారా మణికంఠ కాంతార క్లాన్‌కు షిఫ్ట్ అయ్యాడు. ఆదిత్యను శక్తి టీంకు పంపించాడు. శక్తి క్లాన్‌లో మణికంఠకు ఉన్న ప్రాధాన్యం అందరికీ తెలిసిందే. అందుకే క్లాన్ మారిపోయినట్టుగా ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ ఓ పరమ చెత్త టాస్క్ ఇచ్చాడు. ఆ చెత్త టాస్కుని కంటెస్టెంట్లలో చాలా మంది మరింత చెత్తగా మార్చారు. కారెక్టర్లు స్వాపింగ్ చేస్తూ బీబీ ఆట ఆడించాడు బిగ్ బాస్. ఈ టాస్కులో నబిల్ అంతో ఇంతో అదరగొట్టేశాడు. ఆదిత్యలా నటించి మెప్పించాడు.

Also Readగ్లామర్ పెంచుతున్న బిగ్ బాస్... వైల్డ్ కార్డు ఎంట్రీలో నలుగురు అందాల భామలు, హౌస్‌లోకి వచ్చేది ఆ రోజేనా?

సోనియా, పృథ్వీ, నిఖిల్‌ల మీద ఇంటి సభ్యులు చేసిన స్కిట్‌తో ఇంటా, బయట జరుగుతున్న విషయాలను చూపించినట్టుగా కనిపిస్తుంది. పదే పదే హగ్గులు, ముద్దులు తప్పా ఇంకేం లేదని ఆ ముగ్గుర్నీ రోస్ట్ చేసి పడేశారు మిగిలిన ఇంటి సభ్యులు. అలా తమను రోస్ట్ చేశారని సోనియా గుర్తించడం లేదు. అందరూ తమ మీద ఫోకస్ పెట్టారని, తామే అట్రాక్షన్‌గా నిలిచామని ఏదేదో ఊహించుకుంటోంది. కానీ సోనియా, నిఖిల్, పృథ్వీలను రోస్ట్ చేశారు. ఈ ముగ్గురూ ఓ గ్రూప్ అని, సోనియా ఆ ఇద్దరినీ ఎలా ఆడిస్తోందో.. హగ్గులతో ఈ ముగ్గురూ ఎలా ఇంటిని కంపు చేసేస్తున్నారో చేసి చూపించారు. 

బయట కూడా సోనియా, పృథ్వీ, నిఖిల్ గ్యాంగ్ మీద మంచి ఇమేజ్ అయితే లేదు. సోనియా చేతిలో తోలుబొమ్మల్లా మారిపోయారనే అనుకుంటున్నారు. సోనియా మీద అయితే విపరీతమైన నెగెటివిటీ ఉంది.. ఈ వారం ఆమెకే తక్కువ ఓట్లు వచ్చాయని కూడా తెలుస్తోంది. కానీ ఆమె బిగ్ బాస్ ముద్దు బిడ్డ కాబట్టి.. ఆమెను అంత త్వరగా ఎలిమినేట్ చేయరనిపిస్తోంది. ఈ వారం ఏం జరుగుతుందో చూడాలి.

Also Read: నబిల్‌ను లేపేసి మణిని టార్గెట్ చేసిన నిఖిల్ క్లాన్... బిగ్ బాస్ కాదు, బయాస్డ్ బాస్... ఎపిసోడ్ 26 రివ్యూ

టాప్ హెడ్ లైన్స్

Kadali Satyanarayana: బిగ్ బాస్ 10 తెలుగులోకి రచయిత్రి.. కడలి సత్యనారాయణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు!
బిగ్ బాస్ 10 తెలుగులోకి రచయిత్రి.. కడలి సత్యనారాయణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Rocking Rakesh: మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
Patas Hari: పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!
పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget