Bigg Boss 8 Telugu Wild Card Contestants: గ్లామర్ పెంచుతున్న బిగ్ బాస్... వైల్డ్ కార్డు ఎంట్రీలో నలుగురు అందాల భామలు, హౌస్‌లోకి వచ్చేది ఆ రోజేనా?
Bigg Boss 8 Telugu: ఎనిమిదో సీజన్ చప్పగా సాగుతోందని విమర్శలు కొన్ని వస్తున్న నేపథ్యంలో ఇంటిలోకి నలుగురు అందాల భామలను తీసుకు రావడానికి బిగ్ బాస్ రెడీ అయ్యారు. వారితో పాటు ఇంకెవరు ఉన్నారో చూడండి
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చప్పగా సాగుతోందన్న విమర్శలు సోషల్ మీడియాలో ఎక్కువ అవుతున్నాయి. ఏదో ఒకటి రెండు ఎపిసోడ్లు మినహా మిగిలిన రోజుల్లో బిగ్ బాస్ షో నీరసంగా సాగుతోందన్న అభిప్రాయమే ఎక్కువగా జనాల్లో ఉంది. సీజన్ 7 రికార్డ్స్ ను బద్దలు కొడుతుందని అందరూ అంచనాలు వేస్తే ఇదేమో ఫ్లాప్ అయిన సీజన్ 6 తో పోటీ పడుతోందని అంటున్నారు బిగ్ బాస్ రివ్యూవర్లు.
అంచనాలు తారుమారు చేస్తున్న హౌస్ మేట్స్
ఈ సారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎంపికలోనే పొరబాటు చేసింది టీమ్ అన్న మాటలే ఎక్కువగా వినబడుతున్నాయి. గత సీజన్ లోని అంబటి అర్జున్ లా చాలాకీగా ఉంటాడని, లీడర్ షిప్ క్వాలిటీస్ తో హౌస్ లో టాప్ కంటెస్టెంట్ గా ఉంటాడని అనుకున్న నిఖిల్ వీలైనంత వరకూ మౌనంగా, మరో హౌస్ మేట్ సోనియా ఇన్ఫ్లుయెన్స్ తో ఆడుతున్నాడని అతని ఆటతీరు చూస్తేనే అర్థమైపోతోంది. మిగిలిన వాళ్లతో పోలిస్తే ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న విష్ణు ప్రియ సైతం స్మార్ట్ గా ఆడుతోందో? ఇన్నోసెంట్ గా ఆడుతోందో? అన్న ఫీలింగ్ ఆమె అభిమానులకే తెచ్చి పెడుతోంది. కామెడీతో అదరగొడతారు అనుకున్న బేబక్క, దూకుడుగా ఆడుతాడని అంచనా వేసిన శేఖర్ బాషా మొదటి రెండు వారాల్లోనే బయటకి వచ్చేస్తే... 'బిగ్ బాస్'నే తిట్టి అభయ్ ఎలిమినేట్ అయిపోయాడు. ఒకప్పుడు హిట్ సినిమాలు చేసిన హీరో ఆదిత్య ఓం కూడా సైలెంట్ అయిపోయాడు ప్రస్తుతానికి హౌస్‌లో సోనియా హవా మాత్రమే నడుస్తోంది. అయితే ఆమె ఆటతీరుపై ప్రేక్షకుల్లో నెగిటివిటీ ఎక్కువవుతోంది.
వైల్డ్ కార్డు ఎంట్రీలకు రంగం సిద్ధం... వాళ్లు వచ్చేది ఆ రోజే!
ఉన్న హౌస్ మేట్స్ అంచనాలు అందుకోక పోవడం తో పాత సీజన్ లనుండి కొందరు హౌస్ మేట్స్ ను ఈ సీజన్ లోకి కూడా తీసుకు వచ్చే పనిలో పడ్డారు బిగ్ బాస్ టీమ్. గత 7 సీజన్ల నుండి ఏడుగురు కంటెస్టెంట్ లను బిగ్ బాస్ లో ప్రవేశ పెట్టాలన్నది టీమ్ ఆలోచన అంటున్నారు. అయితే ముందుగా ఐదుగురు ని లోపలకి పంపాలని కూడా ప్లాన్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. వచ్చే నెల 5వ తేదీన... శనివారం నాడు బిగ్ బాస్ మెగా ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఆ రోజు నాగార్జున పాత సీజన్ ల నుండి ఐదుగురు హౌస్ మేట్స్ ను లోపలికి పంపుతారు అంటున్నారు.
వైల్డ్ కార్డ్స్ ఎంట్రీలతో బిగ్ బాస్ ఇంటిలో అడుగుపెట్టేది వీరేనా?
తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడూ స్పెషల్ గా నిలిచిపోయేది ఎన్టీఆర్ హోస్ట్ హోస్ట్ గా ప్రారంభమైన మొదటి సీజనే. అందులోని హౌస్ మేట్స్ ఇప్పటికీ ఆడియన్స్ ఫెవరెట్ గా ఉన్నారు. ఆ సీజన్ లో తన మల్టీ టాలెంటెడ్ ఆటతో అందరినీ ఆకట్టుకున్న హరితేజ ఈసారి బిగ్ బాస్ లో వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇస్తున్నారని తెలుస్తోంది. కామెడీ పరంగా, కళల పరంగా, స్పోర్టివ్ నేచర్ తో ఆడే హరితేజ వస్తే బిగ్ బాస్ సీజన్ 8 కు ఊపు వస్తుంది అని టీమ్ అంచనా వేస్తున్నారు.
జబర్దస్త్ అవినాష్ (Jabardasth Avinash)గా మొదలై ప్రస్తుతం 'మా' అవినాష్ కింద మారిన 'ముక్కు' అవినాష్ 'బిగ్ బాస్' సీజన్ 4లో తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. అవినాష్, అమ్మ రాజ శేఖర్ ల కామెడీ, బాండింగ్ ఆ సీజన్ లో బాగా వర్క్ అవుట్ అయింది. అవినాష్ కూడా ఈ సీజన్ లో వైల్డ్ కార్డు గా ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం టాలీవుడ్‌లో లేడీ కమెడీయన్స్ కొరత ఉంది. ఆ లోటును భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్న నటి రోహిణి. 'బిగ్ బాస్' సీజన్ 3లో ఆమె పాల్గొన్నప్పుడు 'జబర్దస్త్' నటిగా మాత్రమే రోహిణి తెలుసు. కానీ ప్రస్తుతం ఆమె క్రేజ్,ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. బిగ్ బాస్ హౌస్ లో కామెడీ చేయగల లేడీ కంటెస్టెంట్ లేకపోవడంతో రోహిణి ఆస్థానాన్ని ఫిల్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.
'బిగ్ బాస్' సీజన్ 7లో వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చిన నయని పవని ఒక్క వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. అయితే ఆమె ఆడిన తీరు చాలా మందిని ఆకట్టుకుంది. టాస్క్ ల్లోనూ ఆమె అద్భుతంగా పాల్గొంది. తనని జనం అర్థం చేసుకునే లోపే ఎలిమినేట్ అయిపోవడంతో ఆమెకు మరో అవకాశం ఇవ్వడం కరెక్ట్ అని బిగ్ బాస్ ఫ్యాన్స్ నుంచి డిమాండ్ ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకుని నయని పవనినీ వైల్డ్ కార్డుగా సీజన్ 8 లోకి పంపించే అవకాశాలు ఉన్నాయి.
గౌతమ్ కృష్ణ, శోభాశెట్టి... బిగ్ బాస్ సీజన్ 7లో ఒక రేంజ్‌లో రచ్చ చేసిన హౌస్ మేట్స్. ఈ ఇద్దరిలో ఒకరు సీజన్ 8లో వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తుంది. వీరిలో గౌతమ్ కృష్ణకు కాస్త ఎక్కువ ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. ఆ సీజన్లో సీక్రెట్ రూమ్ కి వెళ్లివచ్చిన తర్వాత 'అశ్వద్ధామ 2.0' అంటూ గౌతమ్ చేసిన హంగామా ఎవరూ మర్చిపోలేరు. మరోసారి హౌస్ లో అలాంటి క్రేజీ హంగామా జరగాలని బిగ్ బాస్ టీమ్ స్కెచ్ వేస్తోంది. దానికి గౌతమ్ కృష్ణ హెల్ప్ అవుతాడు అనేది బిగ్ బాస్ ఎనలిస్టుల అంచనా. ఒకవేళ ఆయన కాకుండా శోభా శెట్టి గనుక 'బిగ్ బాస్'లోకి వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇస్తే... ఆ షో టిఆర్పీలు ఎక్కడికో వెళ్లిపోతాయి అంటున్నారు ఫ్యాన్స్. సో... ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం అక్టోబర్ 5న 'బిగ్ బాస్ హౌస్'లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న వైల్డ్ కార్డ్స్ వీళ్ళే. మరి ఈ వైల్డ్ కార్డ్స్ తో నైనా సీజన్ 8కు క్రొత్త ఊపు వస్తుందో లేదో చూడాలి.