అన్వేషించండి

Bigg Boss 8 Telugu Day 29 Promo 1: నామినేషన్ పేరుతో కంటెస్టెంట్ల మధ్య మంట పెట్టిన బిగ్ బాస్... ఇవాళ్టి ప్రోమోలో హైలెట్స్ ఇవే  

బిగ్ బాస్ 8 తెలుగు డే 29 కి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది. అందులో నామినేషన్ ప్రక్రియ ఇంట్రస్టింగ్ గా సాగింది.

నిన్నటి వీకెండ్ ఎపిసోడ్ లో సోనీయాను హౌస్ నుంచి బయటకు పంపిన నాగ్ మరో బిగ్ బాంబ్ వేసిన విషయం తెలిసిందే. హౌస్ మేట్స్ అందరికీ మీడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. అంతే కాకుండా మీకు ఇష్టమైన కంటెంట్ కి ఓట్లు వేసుకోవడం ఆపొద్దు అంటూ ఆడియన్స్ కు చెప్పి ముందుగానేట్ హింట్ ఇచ్చారు. దీంతో ఈ వీక్ ఎవరెవరు నామినేట్ కాబోతున్నారనే విషయం నిన్నటి నుంచే హాట్ టాపిక్ గా మారింది. ఎప్పటిలాగే ఐదవ వారం నామినేషన్లలో హౌస్ మేట్స్ ఒకరినొకరు టార్గెట్ చేసుకున్నారనే విషయం తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోను చూస్తే అర్థమవుతుంది.

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ మంటలు 
ప్రోమో మొదట్లోనే బిగ్ బాస్ 'ఈ వారం నామినేషన్ ప్రక్రియలో ఎవరి ప్రయాణాన్ని ఇంట్లో నుంచి పంపించాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటోలను మంటల్లో విసిరేసి, వారిని నామినేట్ చేయండి. గెలవాలనే కోరిక మీలో ఎలా రగులుతుందో, ఎంత ఎక్కువగా వెలుగుతుందో చూపించండి' అంటూ నామినేషన్ ప్రాసెస్ ను వివరించారు బిగ్ బాస్. ప్రోమోలో ముందుగా మణికంఠ 'పార్టిసిపేషన్ స్కిల్స్ తగ్గాయి' అంటూ నైనికాను నామినేట్ చేశాడు. 'నువ్వు నా గేమ్ చూడట్లేదు' అంటూ నైనిక డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఇద్దరి మధ్య కాసేపు వాదన నడిచింది. ఆ తర్వాత కిరాక్ సీత వచ్చి మణికంఠ ఫోటోను మంటలో వేసి నామినేట్ చేసింది. 'నిఖిల్ త్యాగం చేయమంటే నువ్వు చేస్తావా? పోనీ గేమ్స్ త్యాగం చేస్తా అంటే నాకోసం నువ్వు ఎలిమినేట్ అవుతావా' అంటూ మణికంఠను ప్రశ్నించింది. మణికంఠ 'నేనేం చెప్పానురా' అని ప్రశ్నించగా, 'నెక్స్ట్ డే శాక్రిఫైజ్ చేయలేదు' అని చెప్పావు అంటూ అరవడంతో పెద్ద గొడవైంది.  'ఇక్కడ మీ క్లాన్ నే అడుగు. నేనేం అనట్లేదు ఊరికే' అంటూ మణికంఠపై ఫైర్ అయ్యింది.

ఆ తర్వాత నైనిక.. నబిల్ ను నామినేట్ చేయగా 'బిగ్ బాస్ నన్ను వేరే వాళ్ళని సపోర్ట్ చేయమని చెప్పలేదు. చెప్పి ఉంటే సపోర్ట్ చేసే వాడిని' అంటూ ఎప్పటిలాగే తన స్టైల్లో నైనికకు ఇచ్చి పడేసాడు. ఆ తర్వాత 'నీ నోటి నుంచి వచ్చింది అన్నప్పుడు నువ్వు వెంటనే వచ్చి నువ్వే రియలైజై సారీ చెప్పి ఉంటే గనక...' అంటూ మణికంఠ యష్మి గౌడని నామినేట్ చేశాడు. అయితే ఎప్పటిలాగే ఆటిట్యూడ్ స్టార్ 'యష్మి గౌడ అక్కడ జెండర్ గురించి మాట్లాడుతున్నారని నాకు అసలు తెలీదు' అంటూ మణికంఠను మధ్యలోనే తగులుకుంది. ఇక నబిల్ 'ఎప్పుడూ పక్కనే కూర్చుని ఉంటున్నావు. ఎక్కువ మాట్లాడట్లేదు' అంటూ నైనికను నామినేట్ చేశాడు.

Also Read: Manchu Vishnu: ప్రకాశ్​రాజ్‌ను ఎంతగానో గౌరవిస్తా, కానీ ఆచీతూచీ మాట్లాడక తప్పదు- మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు

బాడీ షేమింగ్ రచ్చ 
నామినేషన్ లో భాగంగా హౌస్ మేట్స్ మధ్య ఆల్మోస్ట్ గొడవ జరిగినంత పని అయింది. ఈ వారం కూడా రివేంజ్ నామినేషన్లే పడ్డాయి. ఎప్పట్లాగే యష్మి గౌడ, మణికంఠ మాటలు యుద్ధం చేయగా, ఈసారి కిరాక్ సీత, మణికంఠకు పడింది. 'మెంటల్ గా సోనియా ఉంది, ఫిజికల్ గా పృథ్వి ఉన్నాడు.. నాకు ఆడాలని లేదు' అంటూ సీత ఏదో చెప్పబోతుండగానే, మణికంఠ 'ఫస్ట్ కరెక్ట్ యువర్ బాడీ లాంగ్వేజ్' అంటూ ఫైర్ అయ్యాడు. వెంటనే సీత 'నా బాడీ లాంగ్వేజ్ ఇదే' అని వాదించింది. 'నీ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంటుంది.. నువ్వు నా బాడీ లాంగ్వేజ్ ను ప్రొజెక్ట్ చేస్తున్నావు' అని మణికంఠ గట్టిగా మాట్లాడటంతో సీత వార్నింగ్ ఇచ్చినంత పని చేసినట్టు ప్రోమోలో కనిపిస్తోంది.

Also Readబాలకృష్ణ ఆశీర్వాదం తీసుకున్న ఐశ్యర్య, కరణ్ - IIFA 2024లో నట సింహం కాళ్లకు నమస్కరించిన స్టార్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS: అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
Crime News: నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
Telangana Thalli Statue: ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS: అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
Crime News: నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
నంద్యాల జిల్లాలో ఘోరం - ప్రేమించలేదని బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇంటర్ విద్యార్థి
Telangana Thalli Statue: ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
ఆ విగ్రహం తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి- మేం తిరస్కరిస్తున్నాం : కవిత
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
Pushpa 2 First Weekend Collection: నార్త్‌లో ఆదివారం దుమ్ము దులిపిన పుష్ప 2 - అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
నార్త్‌లో ఆదివారం దుమ్ము దులిపిన పుష్ప 2 - అల్లు అర్జున్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Embed widget