Balakrishna - Aishwarya: బాలకృష్ణ ఆశీర్వాదం తీసుకున్న ఐశ్యర్య, కరణ్ - IIFA 2024లో నట సింహం కాళ్లకు నమస్కరించిన స్టార్స్
Balakrishna At IIFA 2024: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణపై తనకు ఉన్న గౌరవాన్ని మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ ఈ విధంగా చాటుకున్నారు.
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అంటే ఒక్క తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖులకు మాత్రమే కాదు... యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు అందరికీ గౌరవమే. మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్యా రాయ్ (Aishwarya Rai Bachchan)కు సైతం బాలకృష్ణ అంటే గౌరవం, అభిమానం. దానిని ఐఫా వేదికపై అందరికీ అర్థమయ్యేలా చాటి చెప్పారు.
బాలకృష్ణ కాళ్లకు నమస్కరించిన ఐశ్వర్య
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ టాప్ స్టార్స్ అందరూ ఇప్పుడు దుబాయ్ లో ఉన్నారు. రెండు రోజులుగా ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ (IIFA) అవార్డులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ పురస్కారాల వేడుకలో 'పొన్నియన్ సెల్వన్' సినిమాకు గాను ఉత్తమ నటిగా ఐశ్వర్యకు అవార్డు వచ్చింది. బాలకృష్ణ చేతుల మీదుగా ఆ అవార్డును ఆమెకు అందజేశారు.
#AishwaryaRaiBachchan take blessings from#NANDAMURIBALAKRISHNA while receiving #IIFA Best #Actress award in #Tamil language for the film #PONNIYINSELVAN2@IIFA #AishwaryaRaiBachchan #IIFAUtsavam2024 #IIFA #IIFAawards2024#AishwaryaRai #JaiBalayya pic.twitter.com/fs8jf2NyYI
— GOPI NALLAPANENI (@gopi9999) September 28, 2024
ఐఫా 2024లో తమిళ్ - ఉత్తమ నటిగా అవార్డు అందుకోవడానికి వేదిక మీదకు వెళ్ళిన ఐశ్వర్యా రాయ్ బచ్చన్ తొలుత బాలకృష్ణ కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తరువాత అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం ఈ విజువల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ సైతం బాలకృష్ణ ఆశీర్వాదం తీసుకున్నారు.
Also Read: మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్ చరణ్... అక్కడ ఫస్ట్ టాలీవుడ్ హీరో గ్లోబల్ స్టారే!
View this post on Instagram
గోల్డెన్ లెగసీ అవార్డుతో బాలకృష్ణను సత్కరించిన ఐఫా!
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అతి కొద్ది మంది కథానాయకులలో బాలకృష్ణ ఒకరు. తాత మనవడు సినిమాతో ఆయన తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ సినిమా విడుదల 50 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ మధ్య హైదరాబాద్ సిటీలో ఘనంగా వేడుక నిర్వహించారు.
విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు తనయుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయమైన బాలకృష్ణ ఆ తరువాత తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. నందమూరి వారసత్వాన్ని నిలబెట్టారు. నటుడిగా తనదైన పంథా ఏర్పాటు చేసుకుని 50 ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణను గోల్డెన్ లెగసి అవార్డుతో ఐఫా సత్కరించింది.
Also Read: వెంకీ మామతో దేవిశ్రీ స్టెప్పులు - ఐఫా 2024లో గ్లామరస్ పెర్ఫార్మన్స్‌లు... ఫోటోలు చూడండి
గురువు మణిరత్నం కాళ్లకు నమస్కరించిన ఐశ్వర్య
ఉత్తమ నటిగా పురస్కారం అందుకోవడానికి ముందు వేదికపై తాను ఓ పురస్కారం ఇవ్వడానికి వెళ్లారు ఐశ్వర్యా రాయ్ బచ్చన్. అప్పుడు తాను గురువుగా భావించే ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఐఫా వేదిక మీదకు వచ్చారు. అప్పుడు ఆయన కాళ్లకు కూడా ఐశ్వర్య నమస్కారం చేశారు.