అన్వేషించండి

Bigg Boss 8 Promo: ‘బిగ్ బాస్ 8’ ప్రోమో వచ్చేసింది - మాట్లాడే ముందు ఆలోచించుకోమంటున్న వరాలిచ్చే కింగ్

Bigg Boss 8 Promo: ‘బిగ్ బాస్ 8’ ప్రోమో బయటికొచ్చింది. ఇందులో కంటెస్టెంట్స్ ఎవరు, ఎప్పటినుండి మొదలు లాంటి వివరాలు రివీల్ చేయకపోయినా ఎంటర్‌టైన్మెంట్ మాత్రం లిమిట్ లేకుండా ఉంటుందని నాగార్జున మాటిచ్చారు.

Bigg Boss Telugu Season 8 Promo Is Out Now: బిగ్ బాస్ రియాలిటీ షోలో తెలుగులో కూడా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. అందుకే సక్సెస్‌ఫుల్‌గా ఏడు సీజన్స్ పూర్తిచేసుకుంది. ఇక 8వ సీజన్ కూడా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని బిగ్ బాస్ లవర్స్ ఎదురుచూడడం మొదలుపెట్టారు. ఇప్పుడిప్పుడే ఈ కొత్త సీజన్‌కు సంబంధించిన అప్డేట్స్ బయటికొస్తున్నాయి. ఇటీవల బిగ్ బాస్ 8కు సంబంధించిన లోగోను విడుదల చేశారు మేకర్స్. దీంతో వరుసగా అప్డేట్స్ ఖాయం అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. అందరూ అనుకున్నట్టుగానే ‘బిగ్ బాస్ 8’కు సంబంధించిన టీజర్ తాజాగా విడుదలయ్యింది.

దొంగతనంతో ప్రోమో మొదలు..

‘బిగ్ బాస్  8’ టీజర్ మొదలవ్వగానే కామెడియన్ సత్య.. ఒక దొంగ వేషంలో ఒక నగల షాపులో దొంగతనానికి వెళ్తాడు. అక్కడ చాలా నగలు ఉన్నాయని, అవన్నీ తమకే అని సంతోషంతో తన భార్యకు ఫోన్ చేస్తాడు. కానీ తన భార్యతో మాట్లాడుతున్నప్పుడు సత్యకు వింతగా శబ్దాలు వినిపిస్తుంటాయి. దీంతో తను భయపడతాడు. ఆ శబ్దాలన్నీ అక్కడ ఉన్న అద్భుత దీపంలో నుంచి వస్తున్నాయని గమనిస్తాడు. మామూలుగా సినిమాల్లో అద్భుతదీపాన్ని చేతులతో రుద్దితే అందులో నుంచి జీని వచ్చి వారి కోరికలు తీరుస్తుంది కదా.. ఈ లాజిక్ సత్యకు కూడా తెలుసనుకుంటా అందుకే ఆ దీపాన్ని రుద్దుతాడు.

వరాలిచ్చే కింగ్..

ముందుగా ఆ అద్భుత దీపంలో నుంచి 8 అనే నెంబర్ వస్తుంది. ఆ తర్వాత జీని రూపంలో ఉన్న నాగార్జున వస్తారు. మీరెవరు అని సత్య అడగగా.. ‘‘వరాలిచ్చే కింగ్’’ అంటూ నాగ్ సమాధానమిస్తారు. ‘‘అయితే నన్ను వదిలేయండి. నేను పారిపోతాను’’ అంటూ అక్కడి నుంచి పారిపోదానుకుంటాడు సత్య. కానీ నాగార్జున.. తనను వెళ్లనివ్వరు. ఏం కావాలో కోరుకోమంటారు. ఏం కోరుకున్నా లిమిట్ లేకుండా ఇస్తామంటారు. ఇక చివరిగా ‘‘అడిగే ముందు ఒక్కసారి ఆలోచించుకో. ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు’’ అని నాగార్జున చెప్పడంతో ‘బిగ్ బాస్ 8’ టీజర్ ముగుస్తుంది.

అదే ట్యాగ్‌లైన్..

మామూలుగా బిగ్ బాస్ షోకు సంబంధించిన ఎన్నో అంశాలు ఆడియన్స్‌కు నచ్చుతాయి. అందుకే వారు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ఈ రియాలిటీ షోను చూస్తుంటారు. అందులో ఒకటి షోకు ఉండే ట్యాగ్‌లైన్. బిగ్ బాస్ అనే రియాలిటీ షో మొదలయినప్పటి నుంచి ప్రతీ సీజన్‌కు ఏదో ఒక క్యాచీ ట్యాగ్‌లైన్‌తో ముందుకొస్తున్నారు మేకర్స్. అలాగే తాజాగా విడుదలయిన ‘బిగ్ బాస్ 8’ ప్రోమోను బట్టి చూస్తే.. ఈసారి ట్యాగ్‌లైన్ ఏంటో అంచనా వేసేస్తున్నారు ప్రేక్షకులు. ‘ఒక్కసారి కమిట్ అయితే లిమిట్ లేదు’ అన్నదే ట్యాగ్‌లైన్ అవ్వొచ్చని భావిస్తున్నారు. ఈసారి లిమిట్ లేని ఎంటర్‌టైన్మెంట్‌ను అందిస్తామని మాటిస్తూ ఈ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. నిజంగానే ఎంటర్‌టైన్మెంట్ ఆ రేంజ్‌లో ఉంటే ఈ సీజన్ కూడా హిట్ అని ప్రేక్షకులు అంటున్నారు.

Also Read: ‘బిగ్ బాస్’ సీజన్ 8కు ముహూర్తం ఫిక్స్? ఏ రోజు, ఎన్ని గంటలకు ప్రారంభం కానుందంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget