అన్వేషించండి

Bigg Boss 8 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్ 8కు ముహూర్తం ఫిక్స్? ఏ రోజు, ఎన్ని గంటలకు ప్రారంభం కానుందంటే?

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ సక్సెస్ అయిన తర్వాత సీజన్ 8 గురించి ఆడియన్స్‌లో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సీజన్ ప్రారంభయ్యే రోజు గురించి సోషల్ మీడియాలో ఒక రూమర్ వైరల్ అవుతోంది.

Bigg Boss Season 8 Telugu: బిగ్ బాస్ రియాలిటీ షోకు దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో విపరీతమైన పాపులారిటీ ఉంది. కేవలం తమ భాషల్లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ రియాలిటీ షోను ఫాలో అయ్యే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. ప్రతీ సంవత్సరం ఈ షోకు సంబంధించిన కొత్త సీజన్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటారు. ఇక తెలుగులో బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్‌గా ముగింపు పలకడంతో సీజన్ 8పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఎప్పటిలాగానే ఇప్పుడు కూడా కొత్త సీజన్‌కు కొత్త హోస్ట్ వస్తారని వార్తలు వైరల్ అవుతున్నాయి. పైగా ఇందులో కంటెస్టెంట్స్ గురించి కూడా చర్చలు మొదలయ్యాయి.

వీరే కంటెస్టెంట్స్..

ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్స్‌గా పలువురి పేర్లు వైరల్ అవుతున్నాయి. వాటిలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు.. రీతూ చౌదరీ, వేణు స్వామి, సురేఖ వాణి లేదా తన కూతురు సుప్రిత, కిరాక్ ఆర్పీ, కుమారీ ఆంటీ, బుల్లెట్ భాస్కర్, బర్రెలక్క, చమ్మక్ చంద్ర, కుషిత కల్లపు, అమృత ప్రణయ్. సోషల్ మీడియాను తరచుగా ఫాలో అయ్యేవారు ఇందులో చాలామంది పేర్లను వింటూనే ఉంటారు. ముఖ్యంగా ఎవరి పర్సనల్ లైఫ్‌లో అయినా, ప్రొఫెషనల్ లైఫ్‌లో అయినా కాంట్రవర్సీలు ఉంటే వారిని వెంటనే కంటెస్టెంట్స్‌గా బిగ్ బాస్‌లోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తుంటారు మేకర్స్. ఇక వీరితో పాటు మరికొందరు పేర్లు కూడా బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్‌గా వైరల్ అవుతుండగా వీరు మాత్రం దాదాపు కన్ఫర్మ్ అని వార్తలు వినిపిస్తున్నాయి.

హోస్ట్ మారుతారా?

ఇక ప్రతీసారి బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం అయ్యేముందు నాగార్జున కాకుండా మరో వ్యక్తి హోస్ట్‌గా వస్తారని వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అయినా కూడా ప్రతీసారి నాగార్జుననే హోస్ట్‌గా వచ్చి సర్‌ప్రైజ్ ఇస్తుంటారు. కానీ ఈసారి మాత్రం హెస్ట్ మారుతారు అనే రూమర్ గట్టిగా వినిపిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా వచ్చిన శివాజీ.. నాగార్జున స్థానంలోకి వస్తారని రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ ఇంతలోనే బిగ్ బాస్ హోస్టింగ్‌ను నాగార్జున వదులుకోరని, ఇప్పటికే సీజన్ 8ను కూడా హెస్ట్ చేయడానికి ఆయన అగ్రిమెంట్ చేసుకున్నట్టు సమాచారం. పైగా దీనికోసం ఆయనకు తగిన రెమ్యునరేషన్ కూడా ఫైనల్ అయినట్టు తెలుస్తోంది.

ఆరోజు నుండే..

బిగ్ బాస్ కొత్త సీజన్ మామూలుగా ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో ప్రారంభమవుతుంది. అలాగే బిగ్ బాస్ సీజన్ 8 కూడా సెప్టెంబర్ 8 నుండి ప్రారంభం కానుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకవేళ ఈ సీజన్ నిజంగానే సెప్టెంబర్‌లో ప్రారంభం అయితే ఆగస్ట్ నుండే హౌజ్ ఏర్పాట్లు ప్రారంభమవుతాయి. ఆ ఏర్పాట్లు మొదలయిన తర్వాత ఏదో ఒక విధంగా దీనికి సంబంధించిన అప్డేట్స్ బయటికి వస్తూనే ఉంటాయి. ఇక సీజన్ 8 ఎన్ని రోజులు ఉండబోతుంది? మొత్తం ఎంతమంది కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి ఎంటర్ అవ్వనున్నారు? లాంటి విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.

Also Read: తెలుగు బిగ్ బాస్ 8లో వేణు స్వామి - భారీ పారితోషికం డిమాండ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
Lucky Car: 1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
Embed widget