News
News
X

Bigg Boss 6 Telugu: నామినేషన్లో ఇనయా వయసుపై చర్చ, యాటిట్యూడ్ చూపించిన శ్రీహాన్

Bigg Boss 6 Telugu: ఇనయాకు హౌస్ అంతా వ్యతిరేకంగా మారినట్టు కనిపిస్తోంది.

FOLLOW US: 
 
Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో ఒకర్ని టార్గెట్ చేయడం అన్నది కామన్. గత సీజన్లలో కూడా ఒకరినే టార్గెట్ చేయడం అన్నది జరుగుతూనే ఉంది. అయితే బిగ్ బాస్ 6 సీజన్లో ఇప్పటివరకు ఇలా టార్గెట్ అవ్వడం అన్నది ఇద్దరి విషయంలో జరిగింది. మొదట్లో రేవంత్ టార్గెట్ అయినట్టు కనిపించాడు. తరువాత ఇప్పుడు ఇనయా వంతు వచ్చింది. ఈమె కూడా దాదాపు మొదట్నించి టార్గెట్ అవుతూనే వచ్చింది. ఈసారి నామినేషన్లలో కూడా ఆమెనే ఎక్కువ మంది నామినేట్ చేశాడు. నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. దానిలో ఏముందంటే...

బిగ్ బాస్ ప్రతి ఇంటి సభ్యులు ఇద్దరిని నామినేట్ చేయాలని చెప్పాడు. నామినేట్ చేసే ఇంటి సభ్యుల తలపై టమాటాలను ముక్కలు చేసి వేయాలని చెప్పాడు. శ్రీహాన్ మొదట ఇనయాపై టమాటా వేసి పిట్ట గొడవ మళ్లీ ఎత్తాడు. నీ పక్కనుంచి ఎలుక వెళుతుంటే... ఎలుకా ఎలుకా అంటాము, నువ్వు ఎలుక అయిపోతావా అన్నాడు. దానికి ఇనయా తన స్టైల్లోనే జవాబిచ్చింది. నువ్వే నన్నే అన్నావ్ అంటూ వాదించింది. 

ఇక సుదీప రేవంత్‌ను నామినేట్ చేసింది. అందరూ పోలీస్, దొంగల గేమ్‌లో కలిసి ఆడితే నువ్వు ఇండివడ్యువల్ ఆడావ్ అంది. దానికి రేవంత్ ‘అందరూ అలాగే ఆడారు’ అంటూ వాదించాడు. తన రెండో నామినేషన్ ను ఇనయాకు వేసింది సుదీప. ‘20 మంది తప్పని చెప్పినా నువ్వొక్కదానివే రైట్ అని అంటావ్’ అంది సుదీప. దానికి ఇనయా ‘నాకు నచ్చినట్టు ఉండటానికి ఇక్కడికి వచ్చా, ఇరవై మందికి నచ్చేట్టు ఉండేందుకు రాలేదు’ అంటూ వాదించింది. వీరిద్దరూ గట్టిగా అరుచుకున్నారు. 

గీతూ చంటి, ఇనయాను నామినేట్ చేసింది. చంటి అన్నా గేమ్ ఆడలేదు అని, ఇనయా దొంగాటలు ఆడుతోంది అంటూ నామినేట్ చేసింది. ఆరోహి కూడా ఇనయానే నామినేట్ చేసింది. ‘నా గేమ్ అన్ ఫెయిర్ అయితే మీరు నాకు చేసింది కూడా అన్ ఫెయిరే’ అంది ఇనయా. తరువాత ఇనయా శ్రీహాన్ ను నామినేట్ చేసింది.‘నువ్వు నా వయసు గురించి మాట్లాడావ్’ అంటూ వాదించింది. ‘నేను నీ కన్నీ చిన్నవాడిని అన్నావ్, నా వయసు నీకు తెలుసా?’ అడిగింది. వీళ్లిద్దరి మధ్యా చాలా సేపు వాగ్వాదం జరిగింది. 

News Reels

ఈ వారం ఇంటి కెప్టెన్ ఆదిరెడ్డి కావడంతో అతడిని ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు. ఇక కీర్తి, రాజశేఖర్‌ను బిగ్ బాస్ నేరుగా నామినేట్ చేయడంతో వారిద్దరినీ కూడా ఎవరినీ నామినేట్ చేయడానికి వీల్లేదు.  సమాచారం ప్రకారం ఈ వారం నామినేషన్లలో ఉన్నవారు వీరే. 

1. సుదీప
2. కీర్తి
3. ఆరోహి
4. గీతూ
5. శ్రీహాన్
6. ఇనయా
7. రాజశేఖర్
8. సూర్య
9. అర్జున్
10. రేవంత్

Also read: రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యాను, దమ్మున్న కంటెస్టెంట్స్ వాళ్లే - నేహా కామెంట్స్!

Also read: ఇంట్లో ఎవరు గాడిద? ఎవరు పాము? ఎవరు ఊసరవెల్లి? ఇదిగో మీరే చూడండి

Published at : 26 Sep 2022 11:52 AM (IST) Tags: Bigg Boss 6 Telugu inaya sulthana Bigg boss 6 Telugu Nagarjuna Biggboss Daily Updates Revnath

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో మళ్ళీ ఏకాభిప్రాయం రచ్చ - 'వరస్ట్ డెసిషన్ ఆఫ్ ది సీజన్' అనేసిన ఆదిరెడ్డి

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో మళ్ళీ ఏకాభిప్రాయం రచ్చ - 'వరస్ట్ డెసిషన్ ఆఫ్ ది సీజన్' అనేసిన ఆదిరెడ్డి

Revanth Becomes Father:సింగర్ రేవంత్ ఇంట సంబరాలు, పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అన్విత

Revanth Becomes Father:సింగర్ రేవంత్ ఇంట సంబరాలు, పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అన్విత

Bigg boss 6 Telugu: గుడ్డు జాగ్రత్త టాస్కులో శ్రీసత్యతో రేవంత్ వాదన - కొనసాగుతున్న టిక్కెట్ టు ఫినాలే రేస్

Bigg boss 6 Telugu: గుడ్డు జాగ్రత్త టాస్కులో శ్రీసత్యతో రేవంత్ వాదన - కొనసాగుతున్న టిక్కెట్ టు ఫినాలే రేస్

Bigg Boss 6 Telugu: టిక్కెట్ టు ఫినాలే రేసులో కీర్తికి కోపం - కాలితో తన్నిన కార్తీక దీపం బ్యూటీ

Bigg Boss 6 Telugu: టిక్కెట్ టు ఫినాలే రేసులో కీర్తికి కోపం - కాలితో తన్నిన కార్తీక దీపం బ్యూటీ

Bigg Boss 6 Telugu Episode 88: ఫస్ట్ ఫైనలిస్టుగా ఆదిరెడ్డి? ఓటమిని తీసుకోలేకపోయిన రేవంత్

Bigg Boss 6 Telugu Episode 88: ఫస్ట్ ఫైనలిస్టుగా ఆదిరెడ్డి? ఓటమిని తీసుకోలేకపోయిన రేవంత్

టాప్ స్టోరీస్

Andhra Teachers APP Problems : ఎన్నికలు, జనగణన కాదు అసలు సమస్య యాప్‌లే - టీచర్లు గోడు ప్రభుత్వం ఆలకిస్తుందా ?

Andhra Teachers APP Problems : ఎన్నికలు, జనగణన కాదు అసలు సమస్య యాప్‌లే - టీచర్లు  గోడు ప్రభుత్వం ఆలకిస్తుందా ?

Viral News: మొక్కే కదా అని పట్టుకునేరు ప్రాణాలు పోతాయ్- నాగుపాము కంటే డేంజర్

Viral News: మొక్కే కదా అని పట్టుకునేరు ప్రాణాలు పోతాయ్- నాగుపాము కంటే డేంజర్

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

Osmania Hospital : తొలిసారిగా ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో Transgender Doctors | DNN | ABP Desam

Osmania Hospital : తొలిసారిగా ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో Transgender Doctors | DNN | ABP Desam