అన్వేషించండి
Bigg Boss 5 Telugu: నువ్ మగాళ్లతో బిజీ.. లహరిపై ప్రియా కామెంట్స్.. మండిపడ్డ రవి..
బిగ్ బాస్ సీజన్ 5 రెండు వారాలు పూర్తి చేసుకొని మూడో వారంలోకి ఎంటర్ అయింది.

లహరిపై ప్రియా కామెంట్స్
బిగ్ బాస్ సీజన్ 5 రెండు వారాలు పూర్తి చేసుకొని మూడో వారంలోకి ఎంటర్ అయింది. ఇప్పటికే హౌస్ నుంచి సరయు, ఉమాదేవి ఎలిమినేట్ కాగా.. మూడో వారం నామినేషన్స్ సోమవారం నాడు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ప్రోమోను చూస్తుంటే హౌస్ లో హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగినట్లే ఉన్నాయి.
లహరి, ప్రియాల మధ్య సంభాషణ హద్దులు దాటిందనిపించింది. ప్రియాను ఉద్దేశిస్తూ.. 'అసలు మీరెందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారో.. నాకు అర్ధం కావట్లేదు' అని లహరి అనగా.. 'ఎందుకంటే నువ్ హౌస్ లో ఉన్న మగాళ్లతో నువ్ చాలా బిజీగా ఉంటున్నావ్' అని బదులిచ్చింది ప్రియా. 'ఎవరితోనో చెప్తారా..? ప్లీజ్' అని అడిగింది లహరి. దానికి ప్రియా.. 'రవి గారితో బిజీగా ఉన్నావ్.. మానస్ తో బిజీగా ఉన్నావ్..' అని ఆన్సర్ చేసింది.
వెంటనే రవి కల్పించుకొని.. 'నేను సిరితో లహరి కంటే క్లోజ్ గా ఉంటాను. తననొక ఫ్రెండ్ లా, సిస్టర్ లా భావిస్తాను' అని రవి చెప్తుండగా.. వెంటనే ప్రియా.. 'ఇప్పుడు మీరందరి సపోర్ట్ గురించి ఎక్స్పెక్ట్ చేయొద్దు' అని కామెంట్ చేసింది. దీనికి రవి ఫైర్ అయ్యాడు. 'మీరు రాంగ్ స్టేట్మెంట్స్ ఇక్కడ ఇవ్వడానికి వీల్లేదు' అంటూ అరిచిచెప్పాడు. అదే సమయంలో లహరి కూడా 'మీకు నా గురించి మాట్లాడే రైట్ లేదు' అంటూ ప్రియాపై మండిపడింది.
#Priya makes some serious comments on #Lahari for nomination#BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/S5XD91pQL0
— starmaa (@StarMaa) September 20, 2021
Also Read: ఉమాదేవి ఔట్.. ఎమోషనల్ అయిన ప్రియాంక
ఇంకా చదవండి





















