X

Bigg Boss 5 Telugu: వారిద్దరూ సేఫ్.. ఈ వారం వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరో తెలుసా..?

ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన వారిలో ఇద్దరిని సేవ్ చేశారు. వారెవరంటే..?

FOLLOW US: 

శుక్రవారం హైలైట్స్.. 


కెప్టెన్ గా గెలిచిన సన్నీ.. రేషన్ మ్యానేజర్ గా కాజల్ ని ఎంపిక చేసుకున్నారు. అనంతరం బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి మ్యాట్రిమోనీ టాస్క్ ఇవ్వగా.. సన్నీ, మానస్, షణ్ముఖ్, ప్రియాంక, సిరి, శ్రీరామ్ ఈ టాస్క్ లో పాల్గొన్నారు. వీరంతా కూడా తమకు రాబోయే పార్ట్నర్ లో ఉండాల్సిన లక్షణాలను చెప్పారు. అనంతరం మోస్ట్ కంపాటబుల్ కపుల్ గా మానస్-ప్రియాంకలను ఎన్నుకొని ఒకరితో మరొకరికి దండలు వేయించారు. 
ఇక అర్ధరాత్రి రవి, యానీ మాస్టర్, ప్రియా మీటింగ్ పెట్టుకున్నారు. మానస్ విషయంలో ప్రియాంకకి క్లారిటీ ఉంది కదా అని ప్రియాను అడిగాడు రవి. 'హా పిచ్చ లైట్' అంటూ బదులిచ్చింది ప్రియా. కానీ టాస్క్ లో మొత్తం మానస్ కే సపోర్ట్ చేస్తుందని యానీ కామెంట్ చేసింది.


ఆ తరువాత సిరి స్టిక్కర్స్ ను దొంగతనం చేసింది నేనే అని ప్రియా, యానీల దగ్గర ఒప్పుకున్నాడు రవి. ఆ విషయాన్ని ప్రియా వెళ్లి సిరితో చెప్పేసింది. 
షణ్ముఖ్-కాజల్ అర్ధరాత్రి కూర్చొని రవి గురించి మాట్లాడుకున్నారు. తను గేమ్ ఆడకుండా హౌస్ మేట్స్ ఆడుతున్నాడని షణ్ముఖ్ అన్నాడు. శ్రీరామ్.. రవికి లొంగిపోయాడని.. విశ్వ, లోబో కూడా రవి కోసమే ఆడుతున్నారని అన్నాడు షణ్ముఖ్. ఉదయాన్నే ప్రియాంకతో మీటింగ్ పెట్టాడు విశ్వ. తను కావాలని తోయలేదని.. టాస్క్ లో అలా అయిపోయిందని చెప్పే ప్రయత్నం చేయగా.. ప్రియాంక వినలేదు. 


Also Read: లాస్ట్ మినిట్ లో బిగ్ బాస్ ట్విస్ట్.. ప్రియా ఎలిమినేషన్ తప్పేలా లేదు..


వరస్ట్ పెర్ఫార్మర్ : 1. హౌస్ మేట్స్ తో మాట్లాడిన నాగార్జున వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరో చెప్పమని చెప్పారు. ముందుగా రవిని అడగ్గా.. ప్రియాంక పేరు చెప్పాడు. ఆ తరువాత సిరి దగ్గర స్టిక్కర్స్ దొంగతనం చేశావ్..? అని నాగ్ అడగ్గా.. నేను దొంగతనం చేయలేదు సార్.. నాకు దొరికాయని చెప్పగా.. నాగ్ వెటకారంగా నవ్వారు.

 2. విశ్వ కూడా వరస్ట్ పెర్ఫార్మర్ గా ప్రియాంక పేరు చెప్పాడు. ఆమె తన గేమ్ ఆడడం లేదని రీజన్ చెప్పాడు. ప్రియాంకను ఆటలో ఎందుకు తోసావ్ అని నాగార్జున ప్రశ్నించగా.. తోయలేదని గేమ్ తగిలిందని చెప్పాడు. దీంతో నాగ్ వీడియో వేసి చూపించారు.

 3. షణ్ముఖ్ వరస్ట్ పెర్ఫార్మర్ గా సిరి పేరు చెప్పాడు. తన వల్లే గేమ్ లో జీరో అయ్యానని చెప్పాడు.

 4. సిరి వరస్ట్ పెర్ఫార్మర్ గా కాజల్ పేరు చెప్పింది. ఈ వారం గేమ్ చాలా డల్ గా ఆడిందని రీజన్ చెప్పింది.

 5. జెస్సీ వరస్ట్ పెర్ఫార్మర్ గా విశ్వ పేరు చెబుతూ.. ప్రియాంకను తోయడం నచ్చలేదని రీజన్ చెప్పాడు.

 6. ప్రియాంక, ప్రియా ఇద్దరూ కూడా వరస్ట్ పెర్ఫార్మర్ గా విశ్వ పేరు చెప్పారు. 


ఆ తరువాత ప్రియాను 'చెంప పగలగొడతాను.. చెంప పగలగొడతాను.. చెంప పగలగొడతాను.. అని ఎన్ని సార్లు అంటావ్ ప్రియా..?' అని ప్రశ్నించారు నాగ్. దానికి ప్రియా.. 'చాలా ఫోర్స్ గా వచ్చి నెట్టేశాడు సార్.. మళ్లీ గనుక ఫిజికల్ అయితే చెంప పగలగొడతానని చెప్పా' అని బదులిచ్చింది. 'రిఫ్లెక్స్ లో ఒకసారి అనొచ్చు కానీ పక్కనున్న తొట్టె తీసి మరి మీదకు వెళ్లబోయావ్' అని నాగ్ అనగా.. వెంటనే సన్నీ 'నేను చూడలేదు సార్ అది' అని అన్నాడు. దానికి నాగార్జున 'చూసిన నువ్వేం చేస్తావ్ లే.. నువ్ మహా అయితే జెస్సీ మీదకు వెళ్లగలవ్' అని కామెడీ చేశారు.  • యానీ మాస్టర్ వరస్ట్ పెర్ఫార్మర్ గా జెస్సీ పేరు చెప్పింది. సీక్రెట్ టాస్క్ సరిగ్గా ఆడలేకపోయాడని చెప్పింది.

 • శ్రీరామ్ వరస్ట్ పెర్ఫార్మర్ గా మానస్ పేరు చెప్పాడు. ఇండివిడ్యుయల్ గా గేమ్ ఆడలేదని రీజన్ చెప్పాడు.


ఆ తరువాత వ్యక్తిగతమైన గేమ్ లో గ్రూప్ సహాయం తీసుకొని ఆడినందుకు కెప్టెన్సీ క్యాన్సిల్ అయింది అంటూ సన్నీకి షాకిచ్చాడు నాగార్జున. కానీ కేవలం ఎగ్స్ ప్రొటెక్షన్ కోసమే అలా చేశానని చెప్పడంతో అయితే ఓకే అని చెప్పారు నాగ్. 


ఆ తరువాత యానీతో మాట్లాడగా.. ఇండివిడ్యుయల్ టాస్క్ ను గ్రూప్ గా ఆడారని.. ఆ విషయంలో చాలా డిస్టర్బ్ అయ్యానని చెప్పింది.  • కాజల్ వరస్ట్ పెర్ఫార్మర్ గా ప్రియా పేరు చెప్పింది.

 • మానస్ వరస్ట్ పెర్ఫార్మర్ గా షణ్ముఖ్ పేరు చెప్పాడు.

 • సన్నీ వరస్ట్ పెర్ఫార్మర్ గా ప్రియా పేరు చెప్పాడు. దీనికి ప్రియా సీరియస్ అవ్వకుండా..  సన్నీని ప్రేమగా పిలుస్తూ గాల్లో ముద్దులు పెట్టింది. 


ఎక్కువ ఓట్లతో ఈ వారం వరస్ట్ పెర్ఫార్మర్ గా విశ్వ నిలిచాడు. 


శ్రీరామ్ సేఫ్..


నామినేషన్ లో ఉన్న ఎనిమిది మంది సభ్యులను(లోబో, రవి, సిరి, జెస్సీ, ప్రియా,యానీ మాస్టర్, శ్రీరామ్, కాజల్) నుంచోమని చెప్పిన నాగార్జున వాళ్ల చేతులో బుట్టలు పెట్టాడు. అందులో గోల్డ్ కలర్ ఎగ్ ఉంటే సేఫ్ అని.. బ్లాక్ కలర్ ఎగ్ ఉంటే అన్ సేఫ్ అని చెప్పారు. శ్రీరామ్ బుట్టలో గోల్డెన్ ఎగ్ ఉండడంతో అతడు సేవ్ అయ్యాడు. 


తోపు-డూపు: 


లోబోని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచిన నాగార్జున హౌస్ లో ఆరుగురికి తోపు, ఆరుగురికి డూపు టైటిల్ ఇవ్వమని అడగ్గా.. ముందుగా ప్రియాంక, కాజల్, ప్రియా, రవి, యానీ మాస్టర్, షణ్ముఖ్ లను డూపు అని చెప్పాడు. కాజల్ లాంటి మనుషులు తనకు నచ్చరని, రవికి అవసరం ఉన్నప్పుడే లోబో కనిపిస్తాడని, షణ్ముఖ్ ఫేక్ స్మైల్ ఇస్తాడని ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రీజన్ చెప్పాడు. మానస్, విశ్వ, సన్నీ, శ్రీరామ్, జెస్సీ, సిరి లను తోపు టైటిల్ కి ఎన్నుకున్నాడు. 


కాజల్ సేఫ్.. 


నామినేషన్ లో మిగిలిన ఏడుగురిని గార్డెన్ ఏరియాలోకి పిలిచిన నాగార్జున.. ఒక్కొక్కరికి ఒక్కో ఎగ్ ఇవ్వమని చెప్పారు. ఆ ఎగ్ లో ఎవరికైతే గ్రీన్ కలర్ ఉంటుందో వాళ్లు సేఫ్ అని.. రెడ్ కలర్ ఉంటే సేఫ్ కాదని చెప్పారు. ఈ టాస్క్ లో కాజల్ సేఫ్ అయింది.


Also Read: డార్లింగ్ ప్రభాస్ కి ఇలాంటి బర్త్ డే గిఫ్ట్ ఎవ్వరూ ఇచ్చి ఉండరు..


Also Read: భారతీయ సినిమాకే బాహుబలి.. కానీ మనిషి మాత్రం డార్లింగే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: Kajal nagarjuna Bigg Boss 5 Telugu Bigg Boss 5 sreeram

సంబంధిత కథనాలు

Bigg Boss 5 Telugu: 'ఇంకా ఎంత బ్లేమ్ చేస్తారు నన్ను..?' సిరి, శ్రీరామ్ తో గొడవ.. ఎమోషనల్ అయిన సన్నీ..

Bigg Boss 5 Telugu: 'ఇంకా ఎంత బ్లేమ్ చేస్తారు నన్ను..?' సిరి, శ్రీరామ్ తో గొడవ.. ఎమోషనల్ అయిన సన్నీ..

Bigg Boss 5 Telugu: 'ఫోకస్' టాస్క్ ఫన్నీ టాస్క్ గా మారిపోయిందే..

Bigg Boss 5 Telugu: 'ఫోకస్' టాస్క్ ఫన్నీ టాస్క్ గా మారిపోయిందే..

Bigg Boss 5 Telugu: రెమ్యునరేషన్ కారణంగానే రవిని ఎలిమినేట్ చేశారా..?

Bigg Boss 5 Telugu: రెమ్యునరేషన్ కారణంగానే రవిని ఎలిమినేట్ చేశారా..?

Bigg Boss 5 Telugu: 'నువ్ వెళ్లిపోతే నిజంగానే గొడవలు తగ్గుతాయ్' కాజల్ పై ప్రియాంక ఫైర్.. 

Bigg Boss 5 Telugu: 'నువ్ వెళ్లిపోతే నిజంగానే గొడవలు తగ్గుతాయ్' కాజల్ పై ప్రియాంక ఫైర్.. 

Bigg Boss 5 Telugu: టికెట్ టు ఫినాలే విజేత ఇతడే.. మళ్లీ ఛాన్స్ కొట్టేశాడు.. 

Bigg Boss 5 Telugu: టికెట్ టు ఫినాలే విజేత ఇతడే.. మళ్లీ ఛాన్స్ కొట్టేశాడు.. 
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Samsung Galaxy A13 5G: అత్యంత చవకైన శాంసంగ్ 5జీ ఫోన్ వచ్చేసింది.. లాంచ్ చేసిన కంపెనీ.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Samsung Galaxy A13 5G: అత్యంత చవకైన శాంసంగ్ 5జీ ఫోన్ వచ్చేసింది.. లాంచ్ చేసిన కంపెనీ.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

AP NGT Polavaram : పర్యావరణ అనుమతుల ఉల్లంఘన.. ఏపీ ప్రాజెక్టులకు ఎన్జీటీ రూ. 120 కోట్ల జరిమానా !

AP NGT Polavaram : పర్యావరణ అనుమతుల ఉల్లంఘన.. ఏపీ ప్రాజెక్టులకు ఎన్జీటీ రూ. 120 కోట్ల జరిమానా !

Omicran Movie: ‘ఒమిక్రాన్’ ఇది వైరస్ కాదు 1963లో విడుదలైన సినిమా.. ట్విస్ట్ ఏమిటంటే...

Omicran Movie: ‘ఒమిక్రాన్’ ఇది వైరస్ కాదు 1963లో విడుదలైన సినిమా.. ట్విస్ట్ ఏమిటంటే...

OnePlus RT: వన్‌ప్లస్ ఆర్‌టీ ధర లీక్.. 9 సిరీస్ కంటే తక్కువే.. ఎంతంటే?

OnePlus RT: వన్‌ప్లస్ ఆర్‌టీ ధర లీక్.. 9 సిరీస్ కంటే తక్కువే.. ఎంతంటే?