Bigg Boss 5 Telugu: రవి చేసిన పనికి లహరి బలైపోతుందే.. ఈ వారం ఆమె ఎలిమినేషన్ పక్కా..
బిగ్ బాస్ సీజన్ 5 మూడో వారం పూర్తి చేసుకోబోతుంది.

బిగ్ బాస్ సీజన్ 5 మూడో వారం పూర్తి చేసుకోబోతుంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ తో మద్దలైన ఈ సీజన్ లో తొలివారం సరయు.. రెండో వారం ఉమాదేవి ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు మూడో వారంలో మొత్తం ఐదుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. శ్రీరామ్, మానస్, ప్రియాంక, ప్రియా, లహరిలలో శ్రీరామ్, మానస్, ప్రియాంకలకు ఓటింగ్ పరంగా ఎలాంటి ఢోకా లేదు. పైగా ఆడియన్స్ లో వీరిపై పెద్దగా నెగెటివిటీ లేదు.
Also Read: 'కొండపొలం' ఇంట్రెస్టింగ్ అప్డేట్.. 'రొమాంటిక్' మూవీ రిలీజ్ డేట్..
కానీ ప్రియా, లహరిలు మాత్రం ఈసారి డేంజర్ జోన్ లో ఉన్నారనే చెప్పాలి. గతవారంలో రవి-ర్పియా-లహరిల మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. రవి-లహరి మిడ్ నైట్ బాత్రూమ్ లో హగ్ చేసుకున్నారని ప్రియా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ గొడవ చాలా పెద్దది అయింది. ఈ విషయంలో ప్రియాపై చాలా నెగెటివిటీ ఏర్పడింది. కానీ ఎప్పుడైతే రవి.. లహరి గురించి బ్యాడ్ గా మాట్లాడిన వీడియో బయటకొచ్చిందో అప్పటినుంచి ప్రియా మాట్లాడిన దాంట్లో తప్పు లేదని.. కానీ ఆమె సరిగ్గా కన్వే చేయలేకపోయిందని అంటున్నారు.
రవి చెప్పిన మాటలనే ఆమె నామినేషన్ లో చెప్పిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక రెండు రోజులుగా హౌస్ లో లహరి రూడ్ గా బిహేవ్ చేయడాన్ని ఎక్కువగా చూపిస్తున్నారు బిగ్ బాస్. దీన్ని బట్టి ఈ వారం లహరి బయటకు వెళ్లిపోతుందనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. అలా చూస్తే లహరిని హౌస్ లో ఉంచి ప్రియాను బయటకు పంపించొచ్చు. మరేం జరుగుతుందో చూడాలి!
Also Read: అక్షయ్ సినిమాకి మోక్షం.. దీపావళికి స్టార్ హీరోల ఎంట్రీ ఖాయం..
Also Read: లవ్‌స్టోరీ సమీక్ష: గుండె బరువెక్కించే సందేశం.. ప్రేమకథ రూపంలో..
Also Read: పాటల తోటమాలి మనల్ని వదిలి నేటికి ఏడాది.. నీ పాట మిగిలే ఉంది.. మిగిలే ఉంటుంది
Before You Go
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
ట్రెండింగ్ వార్తలు






















