Bigg Boss 5 Telugu: టాప్ ప్లేస్ లో సన్నీ.. 'నువ్ అర్హుడివా..?' అని ప్రశ్నించిన నాగ్.. ఫైనల్ గా ఎవరెవరు ఏ ప్లేస్ తీసుకున్నారంటే..?
సన్నీ, షణ్ముఖ్, మానస్, సిరి, కాజల్ లలోఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం ఆసక్తికరంగా మారింది.
ఫ్రైడే హైలైట్స్..
నిన్నటి టాస్క్ లో హానెస్ట్ గా ఆన్సర్స్ చేసిన ఒక వ్యక్తిని ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో ఎన్నుకోమని బిగ్ బాస్ చెప్పిన సమయంలో శ్రీరామ్ తన పేరు చెప్పలేని సన్నీ ఫీల్ అయ్యాడు. అదే విషయంపై సన్నీ-శ్రీరామ్ ల మధ్య డిస్కషన్ జరిగింది. ఆ తరువాత కాజల్-శ్రీరామ్ ల మధ్య హీటెడ్ ఆర్గుమెంట్ జరిగింది. 'ఏడుస్తూ.. సింపతీ కోసం గేమ్ ఆడతావని' కాజల్ ని అన్నాడు శ్రీరామ్. 'అలా ఆడేది నువ్వు.. లోన్ రేంజర్ అని చెప్పుకుంటూ.. గ్రూప్స్ మారుస్తూ.. సింపతీ కోసం నువ్ ట్రై చేస్తున్నావని' కాజల్.. ఇలా ఇద్దరూ వాదించుకున్నారు. ఆ తరువాత బిగ్ బాస్ బైక్ టాస్క్ ఒకటి ఇచ్చారు. ఇందులో మానస్, షణ్ముఖ్, సన్నీ ముగ్గురూ పాల్గొన్నారు. కాజల్ సంచాలక్ గా వ్యవహరించింది. కాజల్ కొన్ని రూల్స్ కరెక్ట్ గా చెప్పలేదు. సన్నీ ఆమె చెప్పినట్లుగానే చేసి గేమ్ లో ఫస్ట్ వచ్చాడు. ఆ తరువాత రియలైజ్ అయిన కాజల్ తనదే తప్పని కానీ విన్నర్ గా సన్నీని సెలెక్ట్ చేస్తున్నానని చెప్పింది. అది తప్పని సిరి వాదించింది. వరస్ట్ సంచాలక్ కాజల్ అంటూ అరుస్తూ మాట్లాడింది. కాజల్ తప్పు చేశానని ఒప్పుకున్నప్పుడు ఇన్ని మాటలు అనడం ఎందుకని సన్నీ అనగా.. 'నేను అంటాను బరా బర్ అంటాను' అని సిరి చెప్పింది.
వీల్ ఆఫ్ ది వీక్స్: ఆ తరువాత హౌస్ మేట్స్ తో మాట్లాడారు నాగార్జున. వారికి 'వీల్ ఆఫ్ ది వీక్స్' అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా హౌస్ మేట్స్ కి తమ జర్నీలో వెనక్కి వెళ్లే అవకాశం వస్తే ఎవరేం చేస్తారు..? ఏం చేయకుండా ఉంటారనే..? ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది.
ముందుగా కాజల్.. తనకు ఏ వీకో గుర్తులేదని అనగా.. 'నీకు గుర్తులేదా కాజల్..? అది ఎలా పాజిబుల్' అంటూ కౌంటర్ వేశారు. తొమ్మిదోవారంలో తనకు రిగ్రెట్స్ ఉన్నట్లు చెప్పింది కాజల్. ఆ తరువాత కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్లి నాగ్ తో మాట్లాడింది. జైలు నామినేషన్ వారంలో.. షణ్ముఖ్ ని సేవ్ చేయకుండా సన్నీ-మానస్ లలో ఎవరో ఒకరిని సేవ్ చేసి ఉంటే బాగుండేదని నా ఫీలింగ్. వాళ్లతో బాండ్ ఇంకా పెరిగి ఉండేదని చెప్పింది.
షణ్ముఖ్ పదకొండు, 14 వారాల్లో తనకు కొన్ని రిగ్రెట్స్ ఉన్నాయని చెప్పాడు. ఎమోషనల్ కనెక్ట్ అనేది నా రిగ్రెట్ అని చెప్పాడు. పదకొండో వారం తాను చేసిన దానికి బాధపడుతున్నట్లు షణ్ముఖ్ చెప్పాడు. తన వల్ల వేరేవాళ్లు సెల్ఫ్ హర్ట్ చేసుకోవడం నచ్చలేదని అన్నాడు. అలా జరక్కుండా ఉండాల్సింది. 14వ వారంలో టాప్ 5 ప్రెజర్ వలన సిరిపై చాలా సార్లు అరిచానని, తనను టాప్ 5లో చూడాలనేది తన ఉద్దేశమని చెప్పాడు షణ్ముఖ్.
సన్నీ 12వ వారంలో తనకొక రిగ్రెట్ ఉందని చెప్పాడు. ఐస్ గేమ్ లో తను కావాలని అలా చేయలేదని.. గేమ్ లో ఫాస్ట్ గా ఆడాలని అలా చేశానని సన్నీ చెప్పగా.. 'అందులో తప్పేముంది.. నువ్ గేమ్ ఆడావ్' అని అన్నారు నాగ్. అలానే గిల్టీ బోర్డుని మెడలో వేసుకొని తిరగడం చాలా బాధపడ్డానని.. కానీ ఆ ఇన్సిడెంట్ వలన చాలా నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు.
సన్నీ ఏడవడం చూడలేకపోయా..: మానస్ నాల్గవ వారంలో రిగ్రెట్ ఉందని చెప్పాడు. ''ఆకలిరాజ్యం టాస్క్ లో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ లో సన్నీ, నేను వెళదామని అనుకున్నాం.. కానీ ఫైనల్ గా సన్నీ వెళ్లాడు. శ్రీరామ్, శ్వేతా, సన్నీలలో హౌస్ మేట్స్ లో ఏడుగురు సన్నీని పొడిచారు. అసలు రీజన్ లేకుండా అలా చేశారు. ఆ విషయంలో చాలా బాధపడ్డాను. అక్కడ నేను స్టాండ్ తీసుకొని సన్నీ ప్లేస్ లో నేను వెళ్లి ఉంటే.. తనకు అసలు అలాంటి పరిస్థితి వచ్చేది కాదేమో అనుకున్నాను. ఫస్ట్ టైం సన్నీ ఏడవడం చూసి, నేను కూడా ఎమోషనల్ అయిపోయానని'' మానస్ చెప్పారు.
శ్రీరామ్ ఆరవ వారంలో రిగ్రెట్ ఉందని చెప్పాడు. ''నాల్గో వారంలో కెప్టెన్ గా ఉన్నప్పుడు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాను. అదే టైంలో నా వల్ల ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. జెస్సీతో గొడవ జరగడంతో హౌస్ అంతా డివైడ్ అయిపోయింది. నా వల్లే ఇదంతా జరిగిందని తీసుకోలేకపోయాను. దీంతో ఐదు, ఆరు వారాలు కూడా డల్ అయిపోయాను'' అని చెప్పుకొచ్చాడు.
ఆ తరువాత సిరి 'లెవెన్త్ వీక్ సార్' అని చెప్పింది. 'ఏం చేశాడు షన్ను..?' అని అడిగారు నాగార్జున. దానికి షణ్ముఖ్ తలబాదుకోగా.. హౌస్ మేట్స్ నవ్వేశారు. ''షన్నుతో గొడవ జరిగిన తరువాత సెల్ఫ్ హర్ట్ చేసుకున్నాను. వెనక్కి వెళ్లే ఛాన్స్ వస్తే అలా చేసుకోనని'' సిరి చెప్పింది.
హిట్ స్టార్ ఎవరు..? ఫ్లాప్ స్టార్ ఎవరు..? : హౌస్ మేట్స్ ని హిట్ స్టార్ ఎవరు..? ఫ్లాప్ స్టార్ ఎవరు..? అని ప్రశ్నించారు నాగ్.
- కాజల్.. సన్నీకి హిట్ స్టార్ ఇచ్చింది. తన పెర్సనాలిటీ ఇష్టమని చెప్పింది. షణ్ముఖ్ కి ఫ్లాప్ స్టార్ బ్యాడ్జ్ పెట్టింది. 'ఏం మాట్లాడినా.. ఇంటెన్షన్స్ లోకి వెళ్లిపోయి బ్యాడ్ ఇంటెన్షన్ తీస్తాడు' అని రీజన్ చెప్పింది.
- శ్రీరామ్.. కాజల్ కి ఫ్లాప్ స్టార్ బ్యాడ్జ్ పెడుతూ.. 'స్వీట్ కాజల్ ఉంటుంది.. కన్నింగ్ కాజల్ ఉంటుంది.. అందులో ఏది కరెక్టో నాకు అర్ధం కావడం లేదని' రీజన్ చెప్పాడు. సన్నీకి హిట్ స్టార్ ఇస్తూ.. 'తన జర్నీలో చాలా వేరియేషన్స్ కనిపించాయి. గేమ్ అయిన తరువాత చాలా ఆప్యాయంగా ఉంటాడు' అని రీజన్ చెప్పాడు.
- మానస్ కి హిట్ స్టార్ ఇచ్చిన సన్నీ.. షణ్ముఖ్ కి ఫ్లాప్ స్టార్ ఇచ్చాడు. సూర్య పాత్రలో తను ఇంకా బాగా చేయొచ్చని అనిపించిందని అన్నాడు. ఆ తరువాత నాగార్జున 'పద్నాలుగు వారాల్లో షణ్ముఖ్ నీకు ఫ్లాప్ అనిపించాడా..?' అని అనగా లేదని అన్నాడు సన్నీ. అలా అయితే సిరికి ఇవ్వాలని ఆమెకి ఫ్లాప్ స్టార్ ఇచ్చాడు. హౌస్ లో ఆమె ఒక్కదానితోనే పంచాయితీ ఉందని అన్నాడు.
- సన్నీకి ఫ్లాప్ స్టార్ ఇచ్చిన సిరి.. ఎక్కువ నెగెటివిటీ క్యారీ చేయడం ఫస్ట్ నుంచి సన్నీలో నచ్చలేదని రీజన్ చెప్పింది. షణ్ముఖ్ కి హిట్ స్టార్ ఇస్తూ.. అతడి గేమ్ ప్లే నచ్చిందని చెప్పింది.
- సన్నీ జర్నీ హిట్ సినిమాలా ఉంటుంది.. ఫాల్ అండ్ రైజ్, ఫాల్ అండ్ రైజ్ అని చెప్పి అతడికి హిట్ స్టార్ ఇచ్చాడు మానస్. షణ్ముఖ్ కి ఫ్లాప్ స్టార్ ఇస్తూ.. తన గేమ్ కన్సిస్టెంట్ గా ఉండదని చెప్పాడు.
- కాజల్ కి ఫ్లాప్ స్టార్ ఇచ్చాడు షణ్ముఖ్. సిరికి హిట్ స్టార్ ఇచ్చాడు. టాస్క్ లలో చాలా ఎనర్జిటిక్ గా ఆడుతుందని.. నన్ను చాలా తట్టుకుందని.. హిట్టు బొమ్మ అని చెప్పాడు.
నెక్స్ట్ ఫైనలిస్ట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 5 : గార్డెన్ ఏరియాలో హౌస్ మేట్స్ ని కూర్చోమని చెప్పిన నాగార్జున.. శ్రీరామ్ కి బెలూన్స్ ఇచ్చి దానికి ఒక ఎన్విలాప్ ఉందని.. అందులో ఫైనలిస్ట్ నేమ్ ఉంటుందని చెప్పగా.. 'నెక్స్ట్ ఫైనలిస్ట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 5 ఈజ్.. సన్నీ' అని అనౌన్స్ చేశాడు శ్రీరామ్.
సన్నీ.. నువ్ అర్హుడివా..?: 'హౌస్ లో ఆరుగురు ఉన్నారు.. నేను ఆరు నిమిషాల టైం ఇస్తున్నాను.. హౌస్ లో మీ పొజిషన్ ఏంటో మాకు తెలియాలి. కానీ ఈసారి చాలా సీరియస్ గా ఉండాలని' చెప్పారు నాగార్జున. ముందుగా మానస్ టాప్ ప్లేస్ లో నుంచున్నాడు. తరువాత కాజల్.. 'నేను కూడా నెంబర్ వన్ లో నుంచోవాలనుకుంటున్నాను' అని చెప్పింది. దానికి నాగార్జున 'మరి మొన్న ఎందుకు వన్ ఎవరికో ఇచ్చేశావ్..?' అని ప్రశ్నించారు.తరువాత సన్నీ కూడా టాప్ ప్లేస్ లో నుంచున్నాడు. దానికి నాగ్ 'నువ్ అర్హుడివా..?' అని ప్రశ్నించారు. 'అనిపించింది సార్' అని చెప్పాడు.
శ్రీరామ్ కూడా నెంబర్ వన్ స్థానంలో నుంచున్నాడు. గెలవడానికే గేమ్ ఆడతానని.. ట్రోఫీ గలవడానికే ఇక్కడకి వచ్చానని చెప్పాడు. షణ్ముఖ్ కూడా టాప్ ప్లేస్ లో నుంచొని.. 'ఫస్ట్ ఈ హౌస్ కి వచ్చినప్పుడు నేను విన్ అయిపోవాలని రాలేదు. నేర్చుకుందాం అనుకున్నాను. కానీ కొన్ని వారాల తరువాత నాకు విన్ అవ్వాలని అనిపించింది' అని చెప్పాడు. షణ్ముఖ్ దిగిన వెంటనే.. సిరి సెకండ్ ప్లేస్ లో నుంచొని 'నేను చాలా క్లియర్ గా ఉన్నాను. ఇప్పుడు కూడా అదే చెప్తాను(ఫస్ట్ ప్లేస్ లో షన్నుని చూడాలనుకుంటుంది)' అని చెప్పింది. 'ఆడపిల్లలు ఎప్పడూ సెకండ్.. మగపిల్లలు ఎప్పుడూ ఫస్టా' అని నాగార్జున అన్నారు.
టాప్ ప్లేస్ లో సిరి.. లాస్ట్ లో మానస్: ఆ తరువాత నాగార్జున సీరియస్ గా ఎవరు ఏ పొజిషన్ లో నుంచోవాలనుకుంటున్నారో వెళ్లి నుంచోమని చెప్పారు. ఫైనల్ గా హౌస్ మేట్స్ ఓట్ల ప్రకారం.. సిరి టాప్ ప్లేస్ లో, శ్రీరామ్ సెకండ్ ప్లేస్ లో, కాజల్ థర్డ్ ప్లేస్ లో, షణ్ముఖ్ ఫోర్త్ ప్లేస్ లో, సన్నీ ఫిఫ్త్ ప్లేస్ లో, మానస్ సిక్స్త్ ప్లేస్ లో నిలిచారు.
ఆ తరువాత నాగార్జున 'మీరు మీ గురించి స్టాండప్ అవ్వనప్పుడు జనాలు మీకోసం ఎలా స్టాండ్ తీసుకుంటారు..?' అని ప్రశ్నించారు. 'మీరు మీ గురించి స్టాండ్ తీసుకోవాలి.. మరొకరి కోసం గివప్ చేయకూడదు' అని చెప్పారు.
Also Read: 'సుడిగాలి' సుధీర్‌కు ఓ షో పోయింది! మరో షోలో మాత్రం...
Also Read: ఫన్నీ వీడియో: బ్రహ్మీతో ‘ఊ అంటావా..’ స్పూఫ్ సాంగ్.. దేవీశ్రీ ప్రసాద్ స్పందన ఇది!
Also Read: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి