Bigg Boss 5 Telugu: టాప్ లో సన్నీ.. లాస్ట్ లో సిరి.. నామినేషన్ లో ఐదుగురు..
సోమవారం ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ జరగనుంది. దీంతో ఎపిసోడ్ పై ఇంట్రెస్ట్ పెరిగింది.
కాజల్ టాప్ 5 ఉండాలనుకుంటుందని.. దానికి తగ్గట్లుగా గేమ్ ఆడే ఛాన్స్ ఉందని సిరిని జాగ్రత్తగా ఉండమని చెప్పాడు షణ్ముఖ్. ఆ తరువాత కాజల్.. సన్నీకి దిష్టి తీసింది. సిరి కూడా షణ్ముఖ్ కి దిష్టి తీసింది. సన్నీ.. సిరి వైపు చూశాడని కాజల్, మానస్ బాగా ఏడిపించారు. అప్పటివరకు పడుకొని ఉన్న షణ్ముఖ్ లేచి హాల్ లో కూర్చున్నాడు. అతడి దగ్గరకు వెళ్లి సిరి మాట్లాడే ప్రయత్నం చేయగా.. 'నీతో ఎవరు గేమ్ ఆడుతున్నారో నీకు తెలియదు. కావాలని ట్రాక్ లు పెట్టడానికి ట్రై చేస్తున్నారు. నీ క్యారెక్టర్ వరస్ట్ గా వెళ్తాది బయటకు' అని డైలాగ్ వేశాడు. 'నెగెటివ్ గా ఆలోచించకు షన్ను.. సిట్యుయేషన్ కు తగ్గట్లు రియాక్ట్ అయ్యా అంతే' అని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. అయినా షణ్ముఖ్ మాత్రం కోపంగానే ఉన్నాడు. 'నేనేం అన్నాను.. అసలు నా ఇంటెన్షన్ ఏంటి..? పిచ్చెక్కిపోతుంది నాకు' అంటూ తనలో తనే మాట్లాడుకుంది సిరి.
తెల్లవారుజామున కూడా సన్నీతో సిరికి లింక్ పెడుతూ కాజల్ ఏడిపించింది. వెంటనే సిరి.. సన్నీని అన్నయ్య అని పిలిచేసింది. అయినా కాజల్ వదలకుండా సినిమా పాటలు పాడుతూ సన్నీని ఏడిపించింది. తనను సిరి అన్నయ్య అని పిలిచినప్పుడు షణ్ముఖ్ ఉంటే ఆయన మొహం1000 వాట్స్ బల్బ్ లా వెలిగిపోయేది అని డైలాగ్ కొట్టాడు సన్నీ.
'నేను చాలా బోరింగ్ పెర్సన్. నన్ను ఇన్ని రోజులు ఎలా చూశారా అనిపిస్తుంది. ఇన్ని రోజుల్లో కొన్ని సార్లు గేమ్ బాగా ఆడలేదనిపిస్తుంది. కొన్ని సార్లు ఎమోషనల్ అయ్యా' అంటూ బిగ్ బాస్ తో చెప్పుకున్నాడు షణ్ముఖ్.
అసలు ఆట ఇప్పుడే మొదలైందంటూ బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. ఒకటి నుంచి ఆరు వరకు ర్యాంకులను ఎవరికి సూట్ అవుతాయో డిసైడ్ చేసుకుని ఆ నంబర్ల వెనుక నిలబడమని హౌస్ మేట్స్ కి చెప్పారు బిగ్ బాస్. దీంతో వారంతా డిస్కషన్ పెట్టుకున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో ఒపీనియన్ చెప్పుకున్నారు.
'నేను గనుక ఫస్ట్ పొజిషన్ లో ఉంటే.. చివరివరకు ఇలానే ఉంటాను' అంటూ డైలాగ్ కొట్టాడు. పొజిషనింగ్ గురించి నేనెప్పుడూ ఆలోచించనని మానస్ అన్నాడు. ఇంతలో శ్రీరామ్.. 'కొంతమంది యాటిట్యూడ్ అనుకోవచ్చు.. కొంతమంది కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు.. కొంతమంది యారోగన్స్ అనుకోవచ్చు.. దీనంతటికీ సపోర్ట్ చేస్తున్నది జనాలని నేను ఫీలవుతాను' అని చెప్పాడు. ఆ తరువాత మానస్ ఫోర్త్ పొజిషన్ శ్రీరామ్ కి ఇవ్వాలనుకుంటున్నానని చెప్పాడు. షణ్ముఖ్ కి థర్డ్ ప్లేస్ ఇస్తానని.. ఇంకా బెటర్ నెంబర్ ఇచ్చేవాడ్ని కానీ చిన్న పాయింట్ నచ్చలేదని.. వీకెండ్ గురించి ఎక్కువ ఆలోచిస్తాడని' చెప్పుకొచ్చాడు.
'వన్ లో అయితే షణ్ముఖ్ ని చూడాలనుకుంటున్నా' అని సిరి డైలాగ్ వేసింది. దానికి శ్రీరామ్ 'నిన్ను నువ్ చూసుకోవా..?' అని అడిగాడు. లేదని చెప్పింది సిరి. ఈ హౌస్ లో తన నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పింది. సెకండ్ పొజిషన్ లో తనే ఉంటానని.. థర్డ్ పొజిషన్ సన్నీకి, ఫోర్త్ పొజిషన్ శ్రీరామ్ కి, మానస్ అండ్ కాజల్ కి ఫిఫ్త్ పొజిషన్ ఇచ్చింది సిరి.
నేను గేమ్ ఇలా ఆడడం తప్పు అంటే డెఫినిట్ గా సిక్స్త్ పొజిషన్ తీసుకుంటానని షణ్ముఖ్ అన్నాడు. ఆ తరువాత సిరి కంటే షణ్ముఖ్ కాస్త తక్కువ అని అతడికి టాప్ 6 ఇచ్చింది కాజల్. వెంటనే షణ్ముఖ్ వెళ్లి ఆ నెంబర్ దగ్గర నిలుచున్నాడు. దానికి కాజల్.. 'ఓవరాక్షన్ చేయకు' అని అనగా.. 'నువ్ ఇచ్చిన నెంబర్ నేను యాక్సెప్ట్ చేశాను' అని డైలాగ్ వేశాడు. 'నీ అర్హత సిక్సా..' అని కాజల్ అడగ్గా.. 'నువ్ 6 ఇచ్చావ్ నేను నుంచున్నా..' అన్నట్లుగా చెప్పాడు షణ్ముఖ్.
కాసేపు హౌస్ మేట్స్ వద్ద చర్చలు జరగ్గా.. ఫైనల్ గా మొదటి స్థానంలో సన్నీ, రెండో స్థానంలో షణ్ముఖ్, మూడో స్థానంలో కాజల్, నాల్గో స్థానంలో శ్రీరామ్, ఐదో స్థానంలో మానస్, ఆరో స్థానంలో సిరి నిలిచింది.
నామినేషన్ ప్రక్రియ: ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఫినాలే వీక్ కి చేరడానికి నేరుగా ప్రేక్షకులను ఎదుర్కోవాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పారు. ఈ వారం శ్రీరామ్ కాకుండా మిగిలిన హౌస్ మేట్స్ అందరూ నేరుగా నామినేట్ అయినట్లు చెప్పారు బిగ్ బాస్. నామినేషన్ లో ఉన్న సభ్యులు షణ్ముఖ్, కాజల్, సిరి, మానస్, సన్నీ.
ఆ తరువాత కాజల్ వెళ్లి సన్నీతో డిస్కషన్ పెట్టింది. 'చూశావా కావాలనే కాజల్ ఇచ్చింది నేను 6లో ఉంటాను అంటున్నాడు. లేబెల్లింగ్ కి రెడీగా ఉంటాడు. నేను ఈ పాయింట్ చెప్పలేదని ఫీల్ అవుతున్నా' అంటూ చెప్పుకొచ్చింది.
డైరెక్ట్ గా షణ్ముఖ్ తో వెళ్లి డిస్కషన్ పెట్టింది. ఎప్పటిలానే కాజల్ పాయింట్ ను షణ్ముఖ్ ఒప్పుకోలేదు. చాలా యాటిట్యూడ్ పెరిగింది.. అంటూ కాజల్ గురించి సిరితో చెప్పాడు షణ్ముఖ్. ఓవర్ కాన్ఫిడెన్స్ బాగా పెరిగిందంటూ సిరి కామెంట్ చేసింది.
Also Read: భీమ్... భీమ్... కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ కొత్త పోస్టర్ చూశారా?
Also Read: రామారావుగా థియేటర్లలోకి రవితేజ వచ్చేది ఎప్పుడంటే?
Also Read: నేను పెడుతున్న స్టోరీస్ చూసి 'ఎన్నారైలు అందర్నీ జనరలైజ్ చేయకే ల....' అని వాగక్కర్లేదు - చిన్మయి
Also Read: అమ్మాయిలను ఎప్పుడూ అలా చూడలేదా? ఇతర మహిళలకు లేనిది ఏమైనా నాకుందా? - పాయల్ బోల్డ్ రియాక్షన్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి