BiggBoss 6 Telugu: ఆదిరెడ్డికి బిగ్‌బాస్ భారీ సర్‌ప్రైజ్, అతని భార్యా బిడ్డ ఎంట్రీ - మధ్యలో రేవంత్ కన్నీళ్లు
BiggBoss 6 Telugu: ఆదిరెడ్డి కోరిక తీర్చేశాడు బిగ్ బాస్. అతని కూతురి బర్త్ డే బిగ్ బాస్ ఇంట్లో నిర్వహించాడు.
BiggBoss 6 Telugu: ఆదిరెడ్డి ఎప్పట్నించో బిగ్‌బాస్ ను ఓ కోరిక కోరుతున్నాడు. తన కూతురి, భార్యను ఇంట్లోకి పంపించాలని, కూతురి మొదటి బర్త్ డే ఇక్కడ చేయాలని కోరాడు. కానీ ఆదిరెడ్డి కూతురి బర్త్ డే అయిపోయింది. దీంతో అతను కాస్త బాదపడ్డాడు. ఇప్పుడు ఫ్యామిలీవీక్ రావడంతో అతని కోరిక తీర్చేశాడు బిగ్‌బాస్. ఫ్యామిలీ వీక్‌లో భాగంగా మొదట ఆదిరెడ్డి భార్య, కూతురిని పంపించారు. వారిని చూసి చాలా ఆనందించాడు ఆదిరెడ్డి. కూతురికి అన్నం తినిపించాడు, ఎత్తుకుని తిప్పాడు. తండ్రిని చాలా రోజుల తరువాత చూడడంతో ఆ బిడ్డ ఏడుపందుకుంది. మిగతా ఇంటి సభ్యులు కూడా ఆదిరెడ్డి భార్యాబిడ్డకు స్వాగతం పలికారు. బిగ్‌బాస్ కేకు పంపించి ఆది కూతురి చేత కట్ చేయించారు. ఆది రెడ్డి భార్యా ‘అందరూ బాగా ఆడుతున్నరంటూ మెచ్చుకుంది, ఆటలో కొట్టుకున్న ఫర్వాలేదు’ అంది. దానికి ఆదిరెడ్డి ‘నన్ను కూడా కొట్టొచ్చా’ అని అడిగాడు. దానికి ఆదిరెడ్డి భార్యా ‘నువ్వేమైనా తోపా’ అంది. దానికి అందరూ నవ్వుకున్నారు. ఎందుకంటే అదే డైలాగ్ నాగార్జున వీకెండ్లో వేశారు.
ఇక వారం ప్రోమోలో బిగ్‌బాస్ కోచింగ్ సెంటర్ ఇచ్చారు. ఇందులో ఫైమా ఇంగ్లిష్ టీచర్ అని, ఆదిరెడ్డి డ్యాన్స్ టీచర్‌గా చేయమని ఇచ్చారు. దానికి అందరూ నవ్వారు. ఇక ఫైమా ఇంగ్లిషు చూసి తెగ నవ్వుకున్నారు అందరూ. ఇంగ్లిష్ క్లాష్ అని రాసింది. క్లాస్ స్పెల్లింగు కూడా ఫైమాకు రాకపోవడంతో అందరూ కామెడీ చేశారు. ఆమె ఇంగ్లిష్ క్లాస్ చూస్తే ఎవరైనా నవ్వుకుంటారు.
రేవంత్ సెటైర్
ఫైమా కామెడీగా ‘ఐ విల్ కొడతా’ అంది. దానికి కొడతాను ఇంగ్లిషులో చెప్పండి అని అడిగారు. దానికి ఫైమా ‘ఐ విల్ బీట్ యూ’ అంది. దానికి రేవంత్ ‘టీచర్ మీరు మాకు బీట్ కొట్టొచ్చా’ అని అడిగాడు. దానికి అందరూ పడి పడి నవ్వారు.
ఈసారి ఇంటి నుంచి ఎవరు వెళతారో అంచనా వేసేస్తున్నారు ప్రేక్షకులు. రాజ్ లేదా రోహిత్... వీరిద్దరిలో ఒకరు బయటికి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు భావిస్తున్నారు.
View this post on Instagram
Also read: చప్పగా సాగిన నామినేషన్లు, వీకెండ్ వరకు ఇక నో మజా - నామినేషన్లలో ఉన్నది ఎవరంటే