News
News
X

Bigg Boss 6 Telugu: ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్, ఈ వారం డబుల్ ఎలిమినేషన్, తినడానికి వచ్చారా అంటూ ఆ తొమ్మిది మందికి క్లాసు

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ రెండో వారంలో నాగార్జున గట్టిగా క్లాసు తీసుకున్నారు కొంతమంది ఇంటి సభ్యులకు.

FOLLOW US: 

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6లో రియాల్టీగా ఆడేవారి సంఖ్య తక్కువైపోయింది, సేఫ్ గేమ్ ఆడేవారి సంఖ్య అధికంగా ఉంది. కొంతమంది ఎందుకు వచ్చారో కూడా తెలియడం లేదు. అలాంటివారందరికీ నాగార్జున గట్టిగానే క్లాసు వేశారు. ఎలిమినేషన్లో ఉన్న వారిని కాకుండా, సేఫ్ గేమ్ ఆడుతున్న వారి లగేజ్‌లను స్టోర్ రూమ్ లో పెట్టించారు. నేటి ఎపిసోడ్ కు సంబంధించి విడుదల చేసిన ప్రోమో అదిరిపోయింది. 

ప్రోమో ఏముందంటే...
వేదికపై నాగార్జాన చాలా సీరియస్ గా కనిపించారు. నాగార్జున వెనుక తొమ్మిది కుండలు పెట్టి ఉన్నాయి. వాటిపై తొమ్మిది మంది సభ్యుల ఫోటోలు ఉన్నాయి. వాటిలో ఎలిమినేషన్లో లేని వారివి కూడా ఉండడం ఆశ్చర్యానికి గురిచేసింది. కెప్టెన్ బాలాదిత్య, సుదీప, వాసంతి, శ్రీ సత్య, మెరీనా- రోహిత్, కీర్తి భట్, శ్రీహాన్, అభినయ, షానీ... వీళ్ల ఫోటోలు ఉన్నాయి. వారిని ఉద్దేశించి నాగార్జున మాట్లాడుతూ ‘మై డియర్ నైన్... మీరు బిగ్ బాస్ హౌస్‌కి ఆడ్డానికి రాలేదు, ఛిల్ అవ్వడానికి వచ్చారు’ అన్నారు. అన్ని కుండలను పగుల గొట్టారు. ఎవరిని ఉద్దేశించో తెలియదు కానీ... ‘తింటానికి, పడుకోవడానికి లోపలికి వచ్చాను అనుకుంటే, బ్యాగులు సర్దుకుని బయటికి వెళ్లిపో’ అన్నాడు.  నువ్వడకపోవడమే కాదు, అందరి ఆటలు చెడగొడుతున్నావంటూ బాలాదిత్యను ఉద్ధేశించి అన్నారు. దానికి బాలాదిత్య ‘నేను తప్పు చేశాను, బుర్రతో ఆలోచించలేదు, మనసుతో ఆలోచించాను’ అన్నారు. దానికి నాగ్ ‘మనసూ బుర్రా కాదు బిగ్ బాస్ హౌస్ మేట్ గా ఆలోచించు’ అన్నారు. 

ప్లేటు లాక్కుంటే...
శ్రీసత్యనుద్దేశించి నీ బొమ్మ పోయినప్పుడు నువ్వు ఫీలయ్యావా? అదే నీ ప్లేటు లాగేసుకుని ఉంటే కచ్చితంగా ఫీలయ్యేదానివి అన్నారు నాగార్జున. ఇక మెరీనా - రోహిత్‌ను ఉద్దేశించి ‘మీరు ఇద్దరూ ఈ ఇంట్లోకి పవర్ ఆప్ టూ కింద వచ్చారు, కానీ ఆటలో మాత్రం మైనస్ లో ఉన్నారు’ అన్నారు. 

డబుల్ ఎలిమినేషన్
అభినయశ్రీ మాత్రం తాను జీరో పర్సెంట్ ఆడానంటే ఒప్పుకోనని నాగ్ వాదించింది. దానికి నాగార్జున పది శాతం ఆడావా అని చెప్పి అడిగారు. సుదీప ‘డెఫినెట్ గా ఫ్రూవ్ చేసుకుంటా సర్’ అనగానే, నాగార్జున ‘నువ్వుంటే కదా’ అన్నారు. ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ కాదు, డబుల్ ఎలిమినేషన్ అని చెప్పారు. దాంతో ఇంటి సభ్యులంతా షాక్ అయ్యారు. ఆ తొమ్మిది మందిలో ముగ్గురు ఆల్రెడీ నామినేషన్లో ఉన్నారు, మిగతా ఆరుగురు కూడా బ్యాగులు ప్యాక్ చేసుకుని స్టోర్ రూమ్ లో పెట్టమన్నారు. వాటిని స్టేజీ మీదకు తీసుకొచ్చారు. ఇది మాత్రం ఇంటి సభ్యులకు గట్టి షాకే. నామినేషన్లో ఉన్న వారిలో అయిదుగురు ముందే సేవ్ అయిపోయారని ఈ ప్రోమో ద్వారా తెలుస్తోంది. ఈ వారం గట్టిగా ఆడిన రేవంత్, గీతూ, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్ ఈ వారం బయటపడినట్టేనని చెప్పుకోవాలి. 
ఇక సేఫ్ గేమ్ ఆడుతూ, పెద్దగా ఆడకుండా ఇంట్లో బతికేసున్న వారికి చెక్ పెట్టారు బిగ్ బాస్. వీరిలో ఎవరిని ఎలిమినేట్ చేస్తారో చూడాలి. 

Also read: ఆర్జే సూర్య ఆమెకు దూరంగా ఉంటే బెటర్, బీబీ కేఫ్‌లో ఆర్జే చైతూ - మీ అభిప్రాయమూ అదేనా?

Also read: నేను ఎప్పటికీ తల్లి కాలేను, పెంచుకున్న పాప చనిపోయింది: ‘కార్తీక దీపం’ కీర్తి భట్ కన్నీటి గాథ

Published at : 17 Sep 2022 06:12 PM (IST) Tags: Bigg Boss 6 Telugu Bigg Boss 6 Telugu daily Updates Bigg boss 6 Telugu Latest Promo Bigg boss 6 Telugu Written Updates Elimination Biggboss

సంబంధిత కథనాలు

Dil Raju: చరణ్, శంకర్ సినిమా - దిల్ రాజు లెక్క తప్పిందా?

Dil Raju: చరణ్, శంకర్ సినిమా - దిల్ రాజు లెక్క తప్పిందా?

Upcoming Movies: దసరా స్పెషల్ - థియేటర్లలో, ఓటీటీల్లో సందడి షురూ!

Upcoming Movies: దసరా స్పెషల్ - థియేటర్లలో, ఓటీటీల్లో సందడి షురూ!

Prabhas: ప్రభాస్ మరో బాలీవుడ్ సినిమా ఒప్పుకున్నారా?

Prabhas: ప్రభాస్ మరో బాలీవుడ్ సినిమా ఒప్పుకున్నారా?

Rudrangi Motion Poster: “రుద్రంగి నాది బాంచత్” అంటూ గర్జిస్తున్న జగ్గూ భాయ్!

Rudrangi Motion Poster: “రుద్రంగి నాది బాంచత్” అంటూ గర్జిస్తున్న జగ్గూ భాయ్!

Bhagya Raj: నడిగర్‌ సంఘం షాకింగ్ నిర్ణయం, సీనియర్ దర్శకుడు భాగ్యరాజ్‌‌పై వేటు!

Bhagya Raj: నడిగర్‌ సంఘం షాకింగ్ నిర్ణయం,  సీనియర్ దర్శకుడు భాగ్యరాజ్‌‌పై వేటు!

టాప్ స్టోరీస్

GVL Letter : రెండో విడతలో అయినా విశాఖలో 5జీ సేవలు ప్రారంభించండి - కేంద్రమంత్రికి జీవీఎల్ లేఖ !

GVL Letter : రెండో విడతలో అయినా విశాఖలో 5జీ సేవలు ప్రారంభించండి - కేంద్రమంత్రికి జీవీఎల్ లేఖ !

Durga Puja Pandal Kolkata: మహిషాసురిడిగా మహాత్ముడు- దుర్గా మాత మండపంలో గాంధీకి అవమానం!

Durga Puja Pandal Kolkata: మహిషాసురిడిగా మహాత్ముడు- దుర్గా మాత మండపంలో గాంధీకి అవమానం!

Dussehra Recipes 2022: దసరాకు నేతితో చేసే ఈ స్వీట్ రెసిపీలతో నోరు తీపి చేసుకోండి

Dussehra Recipes 2022: దసరాకు నేతితో చేసే ఈ స్వీట్ రెసిపీలతో నోరు తీపి చేసుకోండి

Varsha Bollamma Cute Speech: తనకు వచ్చిన తెలుగులోనే ప్రాసలతో అదరగొట్టిన వర్ష బొల్లమ్మ | ABP Desam

Varsha Bollamma Cute Speech: తనకు వచ్చిన తెలుగులోనే ప్రాసలతో అదరగొట్టిన వర్ష బొల్లమ్మ | ABP Desam